Hrithik Roshan: ఎవరైనా ప్రేమించి, పెళ్లి చేసుకున్న తర్వాత మనస్పర్థలు వస్తే విడిపోవడం సహజం. కానీ అలా విడాకులు తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్‌గా ఉండాలని నిర్ణయించుకున్న జంటలు ఉన్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో విడాకుల తర్వాత కూడా సన్నిహితంగా ఉంటున్న కపుల్స్ ఎంతోమంది ఉన్నారు. అందులో హృతిక్ రోషన్, సూసేన్ ఖాన్ కూడా ఒకరు. 14 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత హృతిక్, సూసేన్ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత వేర్వేరు వ్యక్తులను ప్రేమించి ఎవరి దారి వారు చూసుకున్నారు. కానీ వీరు ఇప్పటికీ పార్టీల్లో తరచుగా కలుస్తూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. అలా తాజాగా సూసేన్‌కు హృతిక్ రాసిన లేఖ వైరల్ అవుతోంది.
కొత్త స్టోర్
హృతిక్ రోషన్ ఒక స్టార్ యాక్టర్ అయితే తన మాజీ భార్య సూసేన్ ఖాన్ ఒక ఇంటీరియర్ డిజైనర్. ఇప్పటికే ఆ రంగంలో సూసేన్‌కు మంచి గుర్తింపు లభించింది. దేశవ్యాప్తంగా తన పేరుపై పలు ఇంటీరియర్ డిజైనర్ స్టోర్స్ ఉన్నాయి. ఇక తన టాలెంట్‌ను హైదరాబాద్ ప్రజలకు చూపించాలని ‘ది చార్కోల్ ప్రాజెక్ట్’ పేరుతో హైదరాబాద్‌లో కొత్తగా ఒక ఇంటరీయర్ డిజైనింగ్ స్టోర్‌ను ఓపెన్ చేసింది సూసేన్ ఖాన్. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా స్వయంగా ప్రకటించింది. దానిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా షేర్ చేశాడు హృతిక్ రోషన్. అంతే కాకుండా సూసేన్ ఇన్నేళ్లు తన కల కోసం ఎలా కష్టపడిందో చెప్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ అప్లోడ్ చేశాడు.
కల నెరవేరింది
‘కల నిజమయ్యింది. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది సూసేన్. నాకు ఇంకా గుర్తుంది 20 ఏళ్ల క్రితం దీని గురించే నువ్వు కలలు కంటుండేదానివి. ఈరోజు నీ చార్కోల్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన రెండో స్టోర్‌ను హైదరాబాద్‌లో లాంచ్ చేయడం చూసిన తర్వాత నిన్ను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాను. చాలాకాలం నుండి కలలు కంటూ ఉన్న ఒక అమ్మాయి ఇప్పుడు ఆ కలలను నిజం చేసి చూపించింది. నీ కష్టం కనిపిస్తుంది. అంతకంటే ఎక్కువగా నీ టాలెంట్ ఇందులో కనిపిస్తుంది. వరల్డ్ క్లాస్ టాలెంట్ ఇది. హైదరాబాద్‌లోని చార్కోల్ స్టోర్‌ను, అందులోని డిజైన్, ప్రజెంటేషన్, విజన్‌ను చూసిన తర్వాత నేను చాలా షాకయ్యాను’ అంటూ చెప్పుకొచ్చాడు హృతిక్ రోషన్.
Also Read: ప్రముఖ నటుడి పాడే మోసిన స్టార్ హీరో.. ముఖర్జీ ఫ్యామిలీకి రణబీర్ ఏమవుతారంటే.?
స్పెషల్ రీల్
సూసేన్ ఖాన్ (Sussanne Khan)తో పాటు ఈ స్టోర్‌ను ప్రారంభించిన ఇతర పార్ట్‌నర్స్‌కు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పాడు హృతిక్ రోషన్ (Hrithik Roshan). అందరికీ సక్సెస్ దక్కాలని విష్ చేశాడు. సూసేన్‌కు విషెస్ చెప్తూ ఒక స్పెషల్ రీల్ షేర్ చేశాడు హృతిక్. అందులో తను సూసేన్‌తో పాటు తన కొడుకు హ్రేహాన్‌తో కలిసి కనిపించాడు. హృతిక్ రోషన్, సూసేన్ ఖాన్ నాలుగేళ్ల డేటింగ్ తర్వాత 2000లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు. హ్రేహాన్, హ్రిదాన్. పెళ్లయిన 14 ఏళ్ల తర్వాత అంటే 2014లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత వేర్వేరు వ్యక్తులను ప్రేమించి ప్రస్తుతం వారి పర్సనల్ లైఫ్‌లో బిజీగా ఉన్నారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">