Viral video: ఇటీవల సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు, ఇంట్రెస్టింగ్ వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ భూమి మీద ఎక్కడేం జరిగినా సోషల్ మీడియా వేదికగా ఇట్టే తెలిసిపోతుంది. వైరల్ వీడియోలు లక్షల మంది వీక్షిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియా హైప్ ఎక్కువగా ఉంది. ఇంట్రెస్టింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్‌లు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఫన్నీ వీడియోలకు లక్షల కొద్ది వ్యూస్ వస్తున్నాయి. అలాగే నెటిజన్లు వీడియోల కింద చేసే కామెంట్స్ మరింత ఫన్నీగా ఉంటున్నాయి. అయితే తాజాగా ఓ వృద్ధ జంట రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై జెట్ స్పీడ్‌తో వెళ్తున్న ఓ వీడియో తెగ వైరల్‌గా మారింది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఈ వీడియోను లక్షల మంది నెటిజన్లు వీక్షిస్తున్నారు. అలాగే లైక్‌ల ప్రవాహం కొనసాగుతోంది.
ఈ అందమైన వృద్ద జంట ఏం చక్కగా వింటేజ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ పై ధూమ్ సినిమా లెవెల్‌లో వెళ్తున్న వీడియో వైరల్ గా మారింది. వీడియోలో వీరిద్దరు నవ్వుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అటుగా వెళ్తున్న వాహనదారులు వీరిద్దరిని వీడియో తీశారు. ఆ వీడియోలో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై చక్కగా టైటానిక్ అనే పేరు ఉంది. దీంతో ఆ వీడయో స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంది. ఈ బైక్‌పై ఈ అందమైన వృద్ధ జంట సంతోషంగా విహరిస్తున్నట్టు వీడియోలో కనిపిస్తోంది. కూల్ రైడ్‌ను వారు ఆస్వాదిస్తున్నట్టు తెలుస్తోంది.
READ ALSO: CBI Jobs: సీబీఐలో 4500 ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్, ఇంకా 5 రోజులే?
వాహనదారులో వృద్ధ జంటను వీడియో తీస్తున్న సమయంలో వారు చిరునవ్వులు చిందిస్తున్నారు. వారిద్దరూ బైక్‌పై వేగంగా వెళ్తున్నట్టు వీడియోలో స్పష్టమవుతోంది. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన నెటిజన్.. అద్భుతమైన క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ‘పసండిడా ఔరత్ విత్ పసండిడా మోటార్‌సైకిల్’ అంటే.. ఇష్టమైన బైక్‌పై ఇష్టమైన మహిళతో..’ అని రాసుకొచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియా పోస్ట్ చేయగా.. లక్షల వ్యూస్ వస్తున్నాయి. ఈ వీడియోను చాలా మంది నెటిజన్లు లైక్ చేస్తున్నారు. వీడియో కింద పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు.
READ ALSO: Prasar Bharati: డిగ్రీతో ప్రసారభారతిలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.25,000 స్టైఫండ్, డోంట్ మిస్
ఓ నెటిజన్ రిటైర్ట్ కబీర్ సింగ్ అని కామెంట్ చేశాడు. వీరిద్దరి చూస్తుంటే టైటానికి సినిమా గుర్తుకు వస్తోందని.. ఆ సినిమాలో జాక్ అండ రోజ్‌లతో పోలుస్తూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. మరొక వ్యక్తి చూడడానికి ఈ వృద్ధ జంట ఎంత అందంగా ఉందో అని కామెంట్ చేసుకొచ్చాడు. ఇప్పుడే ఇలా ఉన్నారంటే.. యంగ్ ఏజ్‌లో వీళ్ల జంట ఎంత అందంగా ఉందో అని మరొకరు కామెంట్ చేశాడు.