Kollywood Movie:..ప్రస్తుతం కోలీవుడ్ సినిమాలకు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. కమల్ హాసన్ (Kamal Haasan), మణిరత్నం (Maniratnam) కాంబోలో వస్తున్న గ్యాంగ్ స్టార్ సినిమా ‘థగ్ లైఫ్’ ను మొదలుకొని.. విజయ్ దళపతి (Vijay Thalapathy) హీరోగా నటిస్తున్న ‘జన నాయగన్’ సినిమా వరకు ఈ చిత్రాలపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. దీనికి తోడు కళ్ళు చెదిరే ఓటీటీ డీల్ కూడా కుదరడంతో ఈ సినిమాలపై మరింత అంచనాలు పెరిగిపోయాయని చెప్పవచ్చు. ఇకపోతే ఏ చిత్రాలకు ఏ రేంజ్ లో ఓటీటీ డీల్ కుదిరింది అనే విషయం వైరల్ గా మారగా.. ఆ విషయాలు ఏంటో ఒకసారి చూద్దాం.
కమల్ హాసన్ మూవీ కోసం రూ.150 కోట్లు..
కమల్ హాసన్ – మణిరత్నం కాంబినేషన్లో వస్తున్న గ్యాంగ్ స్టార్ యాక్షన్ డ్రామా చిత్రం థగ్ లైఫ్.. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నో ఏళ్ల తర్వాత లెజెండ్రీ యాక్టర్ కమలహాసన్, స్టార్ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ కలవడంతోపాటు.. ఇదివరకే రిలీజ్ చేసిన టీజర్ కూడా సినిమాపై అంచనాలను ఊహించని విధంగా పెంచేసింది. జూన్ 5వ తేదీన ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ సినిమా ఓటీటీ హక్కులు ఇప్పటికే సినిమా లెవెల్ లో అమ్ముడుపోవడం గమనార్హం. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ రూ.150 కోట్ల భారీ మొత్తంలో శాటిలైట్ హక్కులను కొనుగోలు చేసింది. ఇప్పటివరకు కమలహాసన్ సినిమానే హైయెస్ట్ రేటుకు అమ్ముడై రికార్డ్ సృష్టించింది అని చెప్పవచ్చు.
భారీ ధరకు ఓటీటీ డీల్..
మరొకవైపు ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గుతున్న సమయంలో రజనీకాంత్ (Rajinikanth ) ‘జైలర్’ సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చి తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు లోకేష్ కనగరాజు (Lokesh Kanagaraj) దర్శకత్వంలో ‘కూలీ’ సినిమా రాబోతోంది. ఈ సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు తమిళ్ తంబీలు. భారీ స్టార్ కాస్ట్ కూడా కూలీ పై విపరీతమైన క్రేజ్ ను క్రియేట్ చేస్తోంది. దీన్నే భారీగా క్యాష్ చేసుకుంది.ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా హక్కులను సుమారుగా రూ.120 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. అంతేకాదు రజనీకాంత్ నుంచి రాబోయే నెక్స్ట్ సినిమా జైలర్ 2 ఓటిటి హక్కులను కూడా సన్ పిక్చర్ ప్రైమ్ కి ఇవ్వడానికి సిద్ధం అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తమిళ్ నుంచి రాబోయే నెక్స్ట్ చిత్రాలు ఇవే..
వీటికి తోడు ఈ ఏడాది విడుదల కాబోతున్న సూర్య 45 మూవీ, కార్తి సర్దార్ 2, వా వాతియార్, ధనుష్ ఇడ్లీ కడాయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఏస్, ట్రైన్, ప్రదీప్ రంగనాథన్ అప్ కమింగ్ మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రాలు కూడా భారీ ధరలకు ఓటీటీ రైట్స్ పలికే అవకాశాలున్నట్లు సమాచారం. ఇక వీటికి తోడు విజయ్ దళపతి చివరి సినిమాగా వస్తున్న జననాయగన్ సినిమాకి కూడా భారీగా ఓటీటీ డీల్ జరగబోతుందని తెలుస్తోంది. ఇన్ని భారీ అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో హై ఎక్స్పెక్టేషన్స్ తో వస్తున్న ఈ సినిమాలన్నింటికీ కూడా ఇలా రికార్డు స్థాయిలో ఓటీటీ హక్కులు కొనుగోలు కావడంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు తమిళ్ చిత్రాల హవా కొనసాగుతోందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.