BigTV English

Fashion Show: లఖోటియా కాలేజ్ ఆధ్వర్యంలో “ట్రాషిక్ – ది బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్” ఫ్యాషన్ షో

Fashion Show: లఖోటియా కాలేజ్ ఆధ్వర్యంలో “ట్రాషిక్ – ది బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్” ఫ్యాషన్ షో

Fashion Show: ఫ్యాషన్ షో(Fashion Show) అనేది ఎంతో మందికి ఇష్టమైన రంగం అని చెప్పాలి. ఫ్యాషన్ షో ద్వారా ఫ్యాషన్ పట్ల వారికి ఉన్నటువంటి అభిరుచులను తెలియజేస్తూ ఉంటారు. అయితే ఈ ఫ్యాషన్ షో ద్వారా అద్భుతమైన సందేశం అందించడం అనేది ఒక గొప్ప విషయం. ఇలాంటి ఒక గొప్ప సందేశాన్ని తెలియజేస్తూ..లఖోటియా కాలేజ్ ఆఫ్ డిజైన్స్ (Lakhotia College of Designs)ఆధ్వర్యంలో “ట్రాషిక్ ది బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్”(Trashique-The Best Out of Waste ) ఫ్యాషన్ షో నిర్వహించారు. ఈ ఫ్యాషన్ షో ద్వారా ఒక గొప్ప సందేశాన్ని తెలియజేసారని చెప్పాలి. ట్రాషిక్అనేది ట్రాష్ మరియు చిక్ లను కలిపి వ్యర్థాలను ఫ్యాషన్, క్రియామకమైన, అద్భుతమైనదిగా మార్చే స్ఫూర్తిని తెలియజేస్తుంది. ఈ ఫ్యాషన్ షో లో భాగంగా విద్యార్థులు ఫాబ్రిక్ అవశేషాలతో పాటు ప్లాస్టిక్ సీసాలు అలాగే న్యూస్ పేపర్లు వంటి వాటిని రీసైకిల్ చేసి వాటి నుంచి తయారుచేసిన దుస్తుల ద్వారా ఫ్యాషన్ షో ని ప్రదర్శించారు.


వ్యర్థం అంటే విలువ లేనిది కాదు…

ప్రస్తుతం ఈ ఫ్యాషన్స్ కి సంబంధించిన ఫోటోలు అందరినీ ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా ఆలోచింపచేస్తున్నాయి. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా లఖోటియా కాలేజ్ ఆఫ్ డిజైన్ మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ అఫాన్ ముజాహిద్ (Mahomad Afaan Mujahid)మాట్లాడుతూ.. ట్రాషిక్ అనేది కేవలం ఒక సంఘటన మాత్రమే కాదు ఇది ఒక ప్రకటన. వ్యర్థాల పట్ల మన ఆలోచనలు మార్చుకోవడానికి, వాటిని తిరిగి ఉపయోగించడం గురించి ఆలోచింప చేస్తుందని తెలిపారు. వ్యక్తపదార్థాలు అంటే విలువ లేనివి కాదని ఈ షో ద్వారా తెలియ చేస్తున్నారని వెల్లడించారు.


సృజనాత్మక నైపుణ్యం..

ఈ సమాజం పట్ల బాధ్యతాయుతమైన మరియు భవిష్యత్తును ఆలోచింపచేసే సృజనాత్మకతను పెంపొందిస్తుందని తెలిపారు. ఈరోజు మా కాలేజీ విద్యార్థులు అసాధారణమైన ఆవిష్కరణలను ప్రదర్శించారు. స్థిరత్వం అంటే ఒక ధోరణి కాదని, అది జీవన విధానమని గుర్తు చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా న్యాయ నిర్ణయితలు అధ్యాపకులు పరిశ్రమ నిపుణులు పర్యావరణ స్పృహతో కూడిన ఈ ఫ్యాషన్ అద్భుతమైన ప్రదర్శనను వీక్షించి తమ ఆలోచనలను అభిప్రాయాలను పంచుకున్నారు. ఇలా ఈ ఫ్యాషన్ షో ద్వారా “ట్రాషిక్ ది బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్” ఫ్యాషన్ షో సృజనాత్మక నైపుణ్యాన్ని పెంపొందించడమే కాకుండా సామాజిక అలాగే పర్యావరణ బాధ్యతను కూడా పెంపొందించిందని ఈ విషయంలో లఖోటియా కాలేజ్ తమ నిబద్ధతను చాటుకుందని తెలిపారు.
ప్రస్తుతం ఈ ఫ్యాషన్ షో కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Also Read: Star Actress: నటి మరణం.. అవయవ దానం చేసిన కుటుంబ సభ్యులు.. గ్రేట్ అంటూ?

Related News

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×