Casting Couch in Malayalam Industry: సినీ పరిశ్రమలో నటీమణులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కున్నా వాటిని ఓపెన్‌గా బయటికి చెప్పే సాహసం చేయరు. ఒకవేళ అలా చేస్తే వారి కెరీర్ ఎండ్ అయిపోతుందని భావిస్తారు. అందుకే క్యాస్టింగ్ కౌచ్ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. అలా అని అందరు బాధితులు సైలెంట్‌గా ఉండడం లేదు. సమయం వచ్చినప్పుడు వారికి జరిగిన అన్యాయం గురించి చెప్తూ వారికి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. తాజాగా ఒక మలయాళ నటి కూడా తనకు ఎదురైన వేధింపుల గురించి ఓపెన్‌గా చెప్పడానికి ముందుకొచ్చారు. మలయాళ నటి సౌమ్య తనను ఒక తమిళ దర్శకుడు వేధించాడంటూ ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తప్పు చేశాను
ఒక తమిళ సినిమాలో నటించడానికి వెళ్లిన తనకు ఆ దర్శకుడి వల్ల చేదు అనుభవం ఎదురయ్యిందని గుర్తుచేసుకున్నారు సౌమ్య. ‘‘ఒకరోజు ఆ దర్శకుడు నన్ను ఇంటికి పిలిచాడు. ఆ సమయంలో తన భార్య ఇంట్లో లేదు. నన్ను కూతురులాంటి దానివి అంటూనే ముద్దుపెట్టుకున్నాడు. నేను షాకయ్యాను. నేను ఆ విషయాన్ని నా ఫ్రెండ్స్‌తో చెప్పాలని చాలా అనుకున్నాను కానీ చెప్పలేకపోయాను. చాలా సిగ్గుగా అనిపించింది. ఇలాంటి మనిషితో మంచిగా ఉండాలని నిర్ణయించుకున్నందుకు నేనేదో తప్పు చేసిన ఫీలింగ్ వచ్చింది’’ అంటూ అప్పటి ఘటన గురించి ఒక ప్రముఖ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో బయటపెట్టారు సౌమ్య.
Also Read: తమన్నా రాధ గెటప్ పై కృష్ణ భక్తుల మండిపాటు.. మరీ అంత బోల్డా?
రేప్ చేశాడు
‘‘ఆ ఘటన తర్వాత కూడా నేను డ్యాన్స్ రిహార్సెల్స్‌కు వెళ్లాను. అలా రోజురోజుకీ ఆ మనిషి ప్రవర్తన కూడా మారుతూ వచ్చింది. పూర్తిగా నన్ను, నా శరీరాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్నాడు. ఒకానొక సందర్భంలో నన్ను బలవంతపెట్టాడు. అంటే తను నన్ను రేప్ చేశాడు. నేను కాలేజ్‌లో ఉన్న సమయంలో దాదాపు ఏడాది పాటు ఇది జరుగుతూనే ఉంది. ఆ తర్వాత నన్ను తనకోసం వేశ్యగా మార్చుకున్నాడు. ఈ బాధ నుండి బయటపడడానికి నాకు 30 ఏళ్లు పట్టింది. ఇలాంటి వేధింపులు ఎదుర్కున్న బాధితులు అందరూ బయటికొచ్చి రిపోర్ట్ చేయాలని నేను ప్రోత్సహిస్తున్నాను ’’ అని పిలుపునిచ్చారు సౌమ్య. ప్రస్తుతం సినీ పరిశ్రమలో దర్శకుడిపై సౌమ్య చేసిన ఆరోపణలు వైరల్ అవుతున్నాయి.
పేరు చెప్పను
‘‘నాకు 18 ఏళ్లు ఉన్నప్పుడు, కాలేజ్‌లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు సినీ పరిశ్రమలో అడుగుపెట్టాను. నా ఫ్యామిలీకి ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియదు. నేను నటి రేవతిని నా రోల్ మోడల్‌లాగా చూసేదాన్ని. అలా తమిళ సినిమాలో అవకాశం రాగానే స్క్రీన్ టెస్ట్‌కు వెళ్లాను. ముందుగా తన భార్య దర్శకురాలు అని చెప్పారు. కానీ ఆ వ్యక్తే మొత్తం డైరెక్షన్ చేశాడు. మెల్లగా తన అసలు స్వరూపం బయటపడింది. తన ఆనందం కోసం నా ప్రైవేట్ పార్ట్‌లో రాడ్ పెట్టేవాడు’’ అని తెలిపారు సౌమ్య. ఆ తమిళ దర్శకుడి పేరును మాత్రం తను ఓపెన్‌గా చెప్పడానికి ఇష్టపడలేదు. అతడి పేరును నేరుగా కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ పోలీస్ టీమ్‌కు అందిస్తానని తెలిపారు.