BigTV English
Advertisement

Manchu Lakshmi-RK Roja : మంచు vs కంచు.. బిందెలతో కొట్టుకున్న మంచు లక్ష్మీ – రోజా

Manchu Lakshmi-RK Roja : మంచు vs కంచు.. బిందెలతో కొట్టుకున్న మంచు లక్ష్మీ – రోజా

Manchu Lakshmi-RK Roja; బుల్లితెరపై ఎన్నో రియాలిటీ షోస్ మనం చూస్తూ ఉంటాం. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఎన్నో గేమ్స్, మరెన్నో స్కిట్స్ తో జీ తెలుగులో ప్రసారమయ్యే ఓ గేమ్ షో సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్. ఈ ప్రోగ్రాం లో ఎంతోమంది సెలబ్రిటీలు, టీవీ సీరియల్ నటులు పాల్గొంటారు. ఈ ప్రోగ్రాం బాగా పాపులర్ అయింది. రవి, అషు రెడ్డి సీజన్ 4 కు యాంకర్స్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో సీనియర్ తెలుగు నటి, రాజకీయ నాయకురాలు రోజా రాగా.. ఆమెకి పోటీగా మంచు లక్ష్మి వచ్చారు.. ఇద్దరి మధ్య జరిగిన ఆ టాస్క్ లు ఏమిటో.. కంచు వర్సెస్ మంచు లో ఎవరు గెలిచారో చూద్దాం..


మంచు vs కంచు.. బిందెలతో కొట్టుకున్న హీరోయిన్స్ ..

సూపర్ సీరియల్ ఛాంపియన్ సీజన్ 4 లో ఎంతోమంది సీరియల్ నటులు పాల్గొన్నారు. ఈ సీజన్ మొదలై ఇప్పటికీ మూడు భాగాలు కంప్లీట్ అయింది. ఇప్పుడు నాలుగవ భాగం మార్చి 2న ప్రారంభమైంది. తాజాగా ఈ ప్రోగ్రాం ప్రోమో రిలీజ్ చేశారు. సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ గ్రాండ్ ఫైనల్ జరగనుంది. ఆ ఫైనల్ ఎపిసోడ్ కు, తెలుగు సీనియర్ నటి రోజా, మంచు లక్ష్మి వచ్చారు. మొదటి టీం పడమటి సంధ్యారాగం సీరియల్ వారు, రెండవ టీం కలవారి కోడలు టీం వారు పాల్గొననున్నారు. రెండు టీమ్స్ కి సపోర్ట్ గా ఇద్దరూ సెలబ్రిటీలు షోలో సందడి చేయనున్నారు. ప్రోమోలో.. ఎండాకాలం కదా ఏదైనా మంచి ప్రదేశానికి వద్దాం అనుకున్నాను ఇక్కడికి వచ్చాను అని మంచు లక్ష్మి కనిపిస్తుంది. పోటీలో ఎవరైనా కంచుగా కలిస్తే బాగుంటుంది అనుకున్నాను మీరు కనిపించారు అని మంచు లక్ష్మీ, రోజా తో అంటారు. ఇద్దరు ఒకరికొకరు నువ్వా నేనా అని పోటీ పడుతున్నట్లుగా చూపిస్తారు. సీజన్ 4 లో రెండు టీమ్స్ పాల్గొన్నారు. నెక్స్ట్ రోజా, లక్ష్మీ ఇద్దరికీ రెండు చేతి పంపులు ఇచ్చి బిందెలు ఇస్తారు. ఇద్దరు పోటాపోటీగా బిందెలు నింపే పనిలో పడతారు. ఎవరు ఎక్కువగా నీళ్లు పడితే వారే గెలుస్తారు అని రవి చెప్పడంతో.. ఇద్దరు పోటాపోటీగా నీళ్లు కొడుతూ ఉంటారు. మంచు లక్ష్మికి హెల్ప్ చేయడానికి రవి వెళ్తాడు. కట్ చేస్తే రోజా మాట్లాడుతూ నాకు మంచు లక్ష్మికి పోటీ అన్నారు. అలాంటిది రవి, లక్ష్మి కి హెల్ప్ చేయడం ఏంటి దానికి అర్థం ఏంటి అని రోజా అంటుంది. మీరు ఒకసారి బిందెల్ని పరిశీలించండి నా బిందెలోని ఎక్కువ నీళ్లు ఉన్నాయి అని మంచు లక్ష్మి అంటుంది. అక్కడే ఉన్న అన్షు ఇద్దరు ఆడవాళ్ళ మధ్య బిందెల పోటీ భలే పెట్టావు రవి అని అంటుంది. ప్రోమో ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఇద్దరిలో ఎవరు గెలిచారో చూడాలి అంటే ఫుల్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాలి. పూర్తి ఎపిసోడ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. మంచు వర్సెస్ కంచు అంటూ ఫుల్ ఫైట్ చూసేందుకు మేము సిద్ధం అని కామెంట్స్ చేస్తున్నారు.


మూడు భాగాలు సక్సెస్…

సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ ఇప్పటికే మూడు భాగాలు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుని నాలుగో భాగం గ్రాండ్ ఫైనల్ లోకి ఎంటర్ అయింది. జీ తెలుగులో వచ్చే సీరియల్స్ నటులతో, వారానికి ఒక సీరియల్ కి సంబంధించిన వారిని తీసుకువచ్చి, వారితో గేమ్స్, స్కిట్స్ చేయిస్తూ అభిమానుల్ని ఆకట్టుకుంటున్నారు. తాజాగా పడమటి సంధ్యారాగం సీరియల్, కలవారి కోడలు సీరియల్స్ మధ్య ఫైనల్ పోరు జరగనుంది. ఈ ఆదివారం రాత్రి 9 గంటలకు ఫుల్ ఎపిసోడ్ జీ తెలుగు లో ప్రసారమవుతుంది.

Single Movie : వెన్నల కిషోర్ మనిషి కాదా..? పాపం అందరి ముందు పరువు తీసిన కేతిక

?igsh=ZjFkYzMzMDQzZg==

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×