BigTV English

Manchu Manoj: మంచు వారి ఇంట్లో రెండో కొడుకుగా పుట్టడం వల్ల మనోజ్ కి ఇన్ని అవమానాలా..?

Manchu Manoj: మంచు వారి ఇంట్లో రెండో కొడుకుగా పుట్టడం వల్ల మనోజ్ కి ఇన్ని అవమానాలా..?
Advertisement

Manchu Manoj: మంచు మనోజ్ (Manchu Manoj) భైరవం సినిమా(Bhairavam Movie) ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు . మే 31 తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది. ఇలా ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర బృందం పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా జీ తెలుగులో ప్రసారమవుతున్న డ్రామా జూనియర్ కార్యక్రమానికి హాజరయ్యారు. జీ తెలుగులో ప్రసారమవుతున్న ఈ కార్యక్రమానికి సినీనటి రోజాతో పాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ ప్రొడ్యూసర్ తో పాటు మంచు మనోజ్ సాయి శ్రీనివాస్ పాల్గొన్నారు.


డోర్ మ్యాట్ తో సమానం…

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎపిసోడ్ ప్రసారమైంది. ఇందులో భాగంగా హేమంత్ అనే కుర్రాడు సెకండ్ హ్యాండ్ స్కిట్అంటూ ఒక స్కిట్ చేశారు అయితే ఈ పెర్ఫార్మెన్స్ మంచు మనోజ్ ను ఎంతగానో ఆకట్టుకుందని స్పష్టం అవుతుంది. ఇంట్లో రెండో కొడుకుగా పుడితే వాళ్ల కష్టాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే వారికంటూ ఏది కొత్తది ఉండదు. మొదటి వారు ఉపయోగించిన వస్తువులని చిన్నవాళ్లకు ఇస్తుండటం సర్వసాధారణం. ఈ క్రమంలోనే హేమంత్ ఇంట్లో రెండో కొడుకుగా పుడితే ఎలాంటి కష్టాలు ఉంటాయో వివరించాడు. మనం వేసుకునే చెప్పులు బట్టల నుంచి మొదలుకొని ప్రతిదీ సెకండ్ హ్యాండ్ వాడాల్సి ఉంటుందని రెండో కొడుకుగా పుడితే ఇలాంటి బాధలు తప్పవు అంటూ రెండో కొడుకు కష్టాలు గురించి తెలిపారు. ఇంట్లో రెండో కొడుకు గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇంటి ముందు డోర్ మాట్… ఇంట్లో రెండో కొడుకు బతుకు ఒక్కటే అంటూ ఈ కుర్రాడు తన స్కిట్ లో చెప్పడంతో వెంటనే మనోజ్ ఈ డైలాగుకు కనెక్ట్ అయ్యారు.


అవమానాలు పడ్డాడా…

ప్రతి ఒక్క ఇంట్లో రెండో కొడుకుకి ఇలాంటి కష్టాలు తప్పవని ఈ కుర్రాడు తన స్కిట్ ద్వారా తెలియజేశారు . ఈ స్కిట్ అనంతరం మనోజ్ ఆ చిన్నారిని హగ్ చేసుకుని నువ్వు స్కిట్ చేస్తుంటే నా బాధలన్నీ చెబుతున్నట్టు ఉంది… ఈ స్కిట్ తో నేను నీకు పెద్ద అభిమానిగా మారిపోయాను అంటూ మనోజ్ మాట్లాడారు. ఇక వెంటనే డైరెక్టర్ ఎప్పటికైనా నా సినిమాలో నీకు అవకాశం ఇస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ విధంగా మనోజ్ ఈ స్కిట్ కు ఇంతలా కనెక్ట్ అయ్యాడు అంటే తన ఇంట్లో కూడా తన పరిస్థితి అలాగే ఉండేదని చెప్పకనే చెప్పేశారు.. మంచు మనోజ్ ఇంట్లో ఇప్పటికే ఎన్నో విభేదాలు ,గొడవలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

మోహన్ బాబు చిన్న కుమారుడైన మనోజ్ కూడా తన ఇంట్లో చిన్నప్పటినుంచి ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొన్నారని మనోజ్ మాటల్లో స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికీ మనోజ్ తన ఇంట్లో ఈ విధమైనటువంటి అవమానాలని ఎదుర్కొంటున్నారు. గత కొంతకాలంగా మంచు కుటుంబంలో చోటు చేసుకున్న గొడవల నేపథ్యంలో మనోజ్ ను కుటుంబం మొత్తం దూరం పెట్టిన విషయం తెలిసిందే. అయితే తన ఇంట్లో తనకు ఏమాత్రం ప్రాధాన్యత లేదని ఇప్పటికి కూడా అవమానిస్తున్నారని ఈ సందర్భంగా మనోజ్ చెప్పకనే చెప్పేశారు..

Related News

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

Big Stories

×