Akhil Akkineni: అక్కినేని ఇంట వరుస వేడుకలు జరుగుతున్నాయి. ఈ మధ్యనే అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య రెండో వివాహం ఘనంగా జరిగింది. నటి శోభితతో డిసెంబర్ 4 న అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ జంట వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మొదట చైకు హీరోయిన్ సమంతతో వివాహం అయ్యింది. కొన్ని విభేదాల వలన వీరు విడాకులు తీసుకున్నారు. ఇక డైవర్స్ తరువాత చై.. శోభితతో డేటింగ్ చేశాడు. ఈ ఏడాదిలోనే ఇరు కుటుంబ వర్గాలను ఒప్పించి చై – శోభిత పెళ్లి ఘనంగా జరిగింది.
ఇక ఈ పెళ్లి వేడుకల్లోనే చిన్న కొడుకు అఖిల్ కూడా ఒక ఇంటివాడు కాబోతున్నట్లు నాగార్జున ప్రకటించడం సోషల్ మీడియాను షేక్ చేసింది. అఖిల్.. దుబాయ్ కు చెందిన జైనాబ్ రావ్‌జీతో వివాహం సెట్ అయ్యినట్లు అక్కినేని కుటుంబం అధికారికంగా తెలిపింది. దీంతో అక్కినేని అఖిల్ లేడీ ఫ్యాన్స్ గుండెలు ముక్కలయ్యాయి.
Also Read : స్వయంభులో సుందర వల్లి.. ఈసారి అయినా హిట్ ను అందుకుంటుందా.. ?
అఖిల్ – జైనాబ్ ఫోటోలను నాగార్జున షేర్ చేస్తూ.. “మా కోడలు జైనాబ్ రావ్‌జీ, మా కొడుకు అఖిల్ అక్కినేని నిశ్చితార్థం ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాము.. ఈ అమ్మాయిని మా కుటుంబంలోకి ఆహ్వానించడం సంతోషంగా ఉంది.. మీరు యువ జంటను ఆశీర్వదించండి” అని చెప్పుకొచ్చాడు. అప్పటి నుంచి ఈ జంట ఎక్కడ కనిపించినా.. కెమెరా కళ్ళన్నీ వారి పైనే ఉన్నాయి.
తాజాగా అఖిల్ – జైనాబ్ లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ఫోటో చై – శోభితా పెళ్లి వేడుకల్లోది అని తెలుస్తోంది. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో అఖిల్ కనిపించగా.. డిజైనర్ డ్రెస్ లో జైనాబ్ కనిపించింది. ఇద్దరు చూడముచ్చటగా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
Also Read : కష్టాల నుండి బయటికొచ్చి నభా నటేశ్ కమ్ బ్యాక్.. అసలు ఏమైందంటే?
ఇక ఈ ఫోటోను చూసిన అభిమానులు.. అయ్యగారి పక్కన అమ్మగారు.. ఇది కదా జంట అంటే అని కొందరు. ఇక నెక్స్ట్ మీరే అఖిల్ బాబు అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇక అఖిల్ కు కాబోయే భార్య జైనాబ్.. అయ్యేగారి కంటే 9 ఏళ్లు పెద్దది. ప్రేమకు వయస్సుతో సంబంధం లేదు అని అయ్యగారు నిరూపించారు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అఖిల్ కు ఇప్పటికే ఒక ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అయిన విషయం తెల్సిందే.
అక్కినేని అఖిల్, శ్రియ భూపాల్‌ల ఎంగేజ్‌మెంట్ 2016 డిసెంబర్ 9న హైదరాబాద్‌లోని జీవీకే గెస్ట్‌హౌస్‌లో జరిగింది. అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్, ప్రముఖ వ్యాపారవేత్త జీవీ కృష్ణారెడ్డి (జీవీకే) మనవరాలు శ్రియ భూపాల్‌ల ఎంగేజ్మెంట్ సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది.
Also Read : నబీల్‌కు గెలుపు శాతం ఎంతంటే.?
అఖిల్, శ్రియల మధ్య రెండు సంవత్సరాలు ప్రేమ కథ నడిచింది. వారి వివాహానికి ఇటలీలో మేలో తేదీలు పెట్టుకున్నారు. త్వరలోనే వివాహం అనుకొనేలోపు వీరి మధ్య విభేదాలు తలెత్తి.. నిశ్సితార్దాన్ని క్యాన్సిల్ చేశారు. ఈ ఘటన తరువాత అఖిల్ సినిమాల మీద ఫోకస్ చేశాడు. ప్రస్తుతం అఖిల్ ఒక పెద్ద ప్రాజెక్ట్ ను ఓకే చేశాడు. త్వరలోనే అధికారిక ప్రకటన మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.