BigTV English

Naga chaithanya: ఆ అలవాటుతో జీవితానికి ఇంకేం కావాలంటున్న నాగచైతన్య..!

Naga chaithanya: ఆ అలవాటుతో జీవితానికి ఇంకేం కావాలంటున్న నాగచైతన్య..!

Naga chaithanya: టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య పలు చిత్రాలతో దూసుకుపోతున్నారు. కానీ అనుకున్న స్థాయిలో సక్సెస్‌ని సాధించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ వెబ్ సిరీస్‌ తీసి అందరి దృష్టిని ఆకర్షించారు. ‘ధూత’ పేరుతో ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ సిరీస్ సూపర్ రెస్పాన్స్‌ను అందుకొని.. నాగ చైతన్యకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.


ఇదే జోష్‌లో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు నాగ చైతన్య. ఇందులో భాగంగా ప్రస్తుతం దర్శకుడు చందూ మొండేటితో ‘తండేల్’ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న మూవీ యూనిట్.. కర్ణాటకలోని తాజా షెడ్యూల్‌లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను నాగ చైతన్య ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు.

ఇందులో భాగంగా తాజాగా ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ చైతన్య.. తన ఫేవరేట్ ఫుడ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘‘అందరూ అనుకున్నట్టు న్యూడిల్స్, పిజ్జా, బర్గర్ వంటి ఫుడ్స్ నాకు ఇష్టం ఉండదు. అచ్చ తెలుగు వంటకాలు అయిన.. వైట్ రైస్, ముద్దపప్పులో నెయ్యి వేసుకుని, ఆవకాయ పచ్చడి పెట్టుకుని తినడం అంటే చాలా ఇష్టం. ఆ కాంబినేషన్‌లో పచ్చి పులుసు కలుపుకొని తింటే ఉంటుంది కాదా..’’ అంటూ మాట్లాడారు. ఇక వాటికి సైడ్ డిష్‌గా మటన్ కాని, రొయ్యల ఫ్రై కానీ తింటుంటే జీవితానికి ఇంకేం కావాలంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన మాటలు వింటుంటే నాగచైతన్య మంచి ఫుడీ అని తెలిసిపోతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×