Hyderabad Weather: తెలంగాణ ప్రజలకు ఇదొక కూల్ కూల్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఈ విషయం తెలిస్తే ఔరా అనక మానరు. ఔను ఈ చల్లని కబురు తెలుసుకుంటే చాలు.. హుషారెత్తి ఎగిరి గంతులేస్తారు. అటువంటి చల్లని కబురును తెలంగాణ వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
అసలు విషయంలోకి వెళితే.. ఏపీ కంటే తెలంగాణకు సమ్మర్ సీజన్ ముందుగానే వచ్చిందని చెప్పవచ్చు. ఓవైపు భానుడి భగభగలు, మరోవైపు వేడిగాలులతో తెలంగాణ ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి. తెలంగాణలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం 10 గంటల నుండి బయటకు అడుగు పెట్టేందుకు కూడా వృద్ధులు, చిన్నారులు సాహసించడం లేదు. ఇటువంటి తరుణంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని ఇప్పటికే ప్రభుత్వం పలు సూచనలు సైతం జారీ చేసింది. అయితే తాజాగా తెలంగాణ వాతావరణ శాఖ అధికారులు సమ్మర్ లో చల్లని వార్తను చెప్పారు.
హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో నగరవాసులు గృహాలలో నుండి బయటకు రాలేని పరిస్థితి. ఆఫీసులకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు పాటిస్తూ తమ ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి. రాత్రివేళ అయితే వేడిగాలుల ధాటికి సామాన్య ప్రజానీకం అవస్థలు పడుతున్నారు. మొత్తం మీద నగరంలో వేడిగాలుల దెబ్బకు కూలర్లకు, ఏసీలకు గిరాకీ పెరిగింది. ఇలా నగర వాసులు పడుతున్న ఇబ్బందులకు సూర్యుడు కొద్దిరోజులు కరుణించాడని చెప్పవచ్చు.
రాబోయే 48 గంటలు హైదరాబాద్ నగరంలో రాత్రిపూట చల్లని వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ అంచనా దారులు బాలాజీ ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించారు. అంతేకాదు పగలు కూడా ఉష్ణోగ్రత తగ్గుముఖం పడుతుందట. ఐదవ తేదీ బుధవారం రాత్రి నుండి అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్ సహా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని బాలాజీ ప్రకటించారు. పగటి ఉష్ణోగ్రతల కంటే రాత్రి ఉష్ణోగ్రతలు చాలా తగ్గుముఖం పడతాయని, ఎక్కువగా హైదరాబాద్ నగరంలో చల్లని వాతావరణం ఉంటుందంటూ ఆయన తెలిపారు.
హైదరాబాద్ నగరంలో చల్లని వాతావరణానికి గల కారణాలను కూడా బాలాజీ వివరించారు. ఉత్తర భారతదేశం నుండి ఆకస్మికంగా చలిగాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణలో తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈనెల 5, 6, 7 తేదీలలో హైదరాబాద్ నగరం వాసులకు వేడి గాలుల నుండి ఉపశమనం లభిస్తుందని, మార్చి 9 తర్వాత ఊహించని స్థాయిలో మళ్లీ ఎండలు విపరీతంగా ఉంటాయంటూ బాలాజీ హెచ్చరించారు.
Also Read: Ram Gopal Varma : వర్మకు ఈ సారి సీఐడీ నోటీసులు… ఇక ఆపండి అంటూ హైకోర్టును ఆశ్రయించిన ఆర్జీవీ..!
మొత్తం మీద గత కొద్ది రోజులుగా తీవ్రమైన వేడిగాలులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ ఉత్తర జిల్లాల ప్రజలకు, హైదరాబాద్ నగరవాసులకు మూడు రోజులపాటు చల్లని గాలులు పలకరిస్తాయని చెప్పవచ్చు. అందుకే ఈ కూల్ కూల్ న్యూస్ తెలుసుకున్న నగరవాసులు హమ్మయ్య అంటూ నిట్టూరుస్తున్నారు. అసలే రంజాన్ సంధర్భంగా నైట్ బజార్ కు ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. వేడిగాలుల ధాటికి బయటకు రాలేని ప్రజలు ఈ మూడు రోజులు చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కాస్త ఊరట చెందుతారని భావించవచ్చు.