Nayanthara:లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార (Nayanthara ) ఈ మధ్యకాలంలో ఎక్కువగా భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు బయటకు వెళ్లాలంటేనే కాస్త ఆలోచించే ఈమె ఈమధ్య ఎక్కువగా అందరిలో కలుస్తూ మరింత పాపులారిటీ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అన్నట్టు నయనతార మారిపోయింది. ముఖ్యంగా నయనతార పెళ్లి తర్వాత తన భర్త విఘ్నేష్ శివన్ (Vighnesh Shivan)తో కలిసి ప్రముఖ దేవాలయాలను సందర్శించడమే కాకుండా ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
Hero Suhas: ఈ టార్చర్ ఏంటి… స్టేజ్ పైనే హీరో అసహనం..!
భర్తతో కలిసి ప్రత్యేక పూజలు..
ఇక ఇప్పుడు తన భర్తతో కలిసి ఇంట్లోనే ప్రత్యేక పూజలు చేయించినట్లు వార్తలు వినిపిస్తున్నా. అంతేకాదు హోమం కూడా వేసి పండితులతో నిష్టగా పూజలు నిర్వహించినట్లు సమాచారం. ఇక కారణం ఏంటో తెలియదు కానీ నయనతార ఇలా ఈ విధంగా ఇంట్లోనే పూజలు పెట్టడం ఇదే తొలిసారి అని అభిమానుల సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా పెళ్లి తర్వాత ఆమె ఎంతలా మారిపోయిందో , ఆమెపై ట్రోలింగ్ కూడా అంతలానే జరుగుతూ వస్తోంది. ముఖ్యంగా పెళ్లి తర్వాత ఎన్నో విమర్శలు ఎదుర్కోవడమే కాదు ఆమెపై పూర్తి నెగెటివిటీ ఏర్పడింది.అందుకే ఇప్పుడు తనపై పాజిటివిటీ పెరిగేలాగా ఈ విధంగా పూజలు చేయించి ఉండవచ్చు అని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంతమంది త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతుందేమో అందుకే ఇలా దేవుడు ఆశీర్వాదాలు తీసుకోవడానికి పూజలు నిర్వహిస్తోంది అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం . ఏది ఏమైనా సోషల్ మీడియాలో ఇప్పుడు నయనతార – విఘ్నేష్ శివన్ పేర్లు బాగా ట్రెండ్ అవుతున్నాయి.
నయనతార కెరియర్..
డయానా మరియం కురియన్ గా 1984 నవంబర్ 18 కర్ణాటక, బెంగళూరులో జన్మించిన ఈమె.. నటి మాత్రమే కాదు.. నిర్మాత.. మోడల్.. టీవీ వ్యాఖ్యాత కూడా. మలయాళీ క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన ఈమె విద్యాభ్యాసం మాత్రం వివిధ రాష్ట్రాలలో పూర్తయింది. కాలేజ్ చదువుకునే రోజుల్లోనే మోడలింగ్ మొదలుపెట్టిన నయనతార.. ఆ తర్వాత మలయాళీ దర్శకుడు సత్యన్ అంతిక్యాడ్ “మనస్సినక్కరే “అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించిన ఈమె.. ఏకంగా మోహన్ లాల్(Mohanlal ), మమ్ముట్టి(Mammootty ) వంటి స్టార్ హీరోల సినిమాలలో కూడా అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు తెలుగు, తమిళ్, మలయాళం , హిందీ, కన్నడ అంటూ భాషతో సంబంధం లేకుండా ప్రతి భాషలో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
నయనతార చిత్రాలు..
ఇకపోతే గత ఏడాది బాలీవుడ్ చిత్రాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. గతంలో లేడీ ఓరియంటెడ్ మూవీగా వచ్చిన ‘మూకుత్తి అమ్మన్’ అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను తెలుగులో ‘అమ్మోరు తల్లి’ పేరిట విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘మూకుత్తి అమ్మన్ 2’ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రానికి సుందర్ సి ,(Sundar C)దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా పూజా కార్యక్రమాలలో తొలిసారి కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది నయనతార. ఏది ఏమైనా నయనతార కెరియర్లో మరింత సక్సెస్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.