BigTV English

Animal Movie : గూస్‌బంప్స్ క్రియేట్ చేస్తున్న రణబీర్ పంజాబీ సాంగ్..

Animal Movie : గూస్‌బంప్స్ క్రియేట్ చేస్తున్న రణబీర్ పంజాబీ సాంగ్..

Animal Movie : సందీప్ రెడ్డి వంగా.. చేసింది రెండు సినిమాలే అయినా టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు ఈ డైరెక్టర్. ప్రస్తుతం అతను హై వోల్టేజ్ చిత్రం యానిమాల్ పై మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అయి ఉంది. అసలు రణబీర్ కపూర్ లాంటి లవర్ బాయ్ తో చేసే సినిమాకి యానిమాల్ అనే టైటిల్ పెట్టి షాక్ ఇచ్చాడు సందీప్ రెడ్డి. అర్జున్ రెడ్డి మూవీతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ రేంజ్ కి ఎదిగిన సందీప్ రెడ్డి అదే మూవీని బాలీవుడ్ లో కబీర్ సింగ్ టైటిల్ తో రీమేక్ చేసాడు.


ఇప్పుడు అతను చేస్తున్న ఈ రెండవ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటివరకు బాలీవుడ్ లో సాఫ్ట్ గా చాక్లెట్ బాయ్ లాగా కనిపిస్తూ వచ్చిన రణబీర్ కపూర్ ను ఇప్పటివరకు ఎవరు చూడనంత వైల్డ్ గా ఈ మూవీలో చూపించబోతున్నాడు. ఈ మూవీలో అంతకుమించి అనే విధంగా యాక్షన్ డోస్ ఉండబోతోంది అని టాక్. ఇందులో హీరో ఓ రేంజ్ లో ఊచ కోత కొస్తాడు అన్న క్లారిటీ ఇప్పటికే మూవీ సాంగ్స్ చూస్తే అర్ధం అవుతుంది.

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన రొమాంటిక్ సాంగ్ తో పాటు.. ఫాదర్ సెంటిమెంట్ తో కూడిన పాట కూడా అందర్ని బాగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడో సాంగ్ గా మరొక యాక్షన్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ మంచి పంజాబ్ స్టైల్ లో ఉంది. సినిమా ప్రీ-టీజర్ టైం లో ఈ పంజాబీ ఫోక్ సాంగ్ బాగా వైరల్ అయింది.ఇప్పుడు ఈ లిరికల్ సాంగ్ ఫుల్ వీడియో విడుదల చేశారు. ఈ సాంగ్ లో రణబీర్ సృష్టించే మారణహోమాన్ని హై లైట్ చేశారు. మూవీ లో హై వోల్టేజ్ సీన్స్ ఫుల్ గా ఉన్నాయన్న విషయం ఈ సాంగ్ తో స్పష్టమవుతుంది.


.

.

Related News

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big Stories

×