BigTV English

NTR 31: ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ టైటిల్ ఇదే.. ఫ్యాన్స్ కు పూనకాలే.. ?

NTR 31: ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ టైటిల్ ఇదే.. ఫ్యాన్స్ కు పూనకాలే.. ?

NTR 31: ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా తరువాత తారక్ ..ఎన్టీఆర్ 31 చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఎన్టీఆర్ 31 అధికారికంగా ప్రకటించి ఏడాది కావొస్తుంది. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్, దేవరతో బిజీగా మారాడు.


ఇంకోపక్క ప్రశాంత్ నీల్ సైతం సలార్ తో బిజీగా ఉండడంతో.. ఎన్టీఆర్ 31 పై ఎవరు ఫోకస్ చేయలేదు. ఇప్పుడు దేవర ఫినిష్ అయ్యింది.. సలార్ రిలీజ్ కూడా అయ్యింది. ప్రశాంత్ నీల్.. సలార్ 2 ను ఇప్పుడప్పుడే మొదలుపెట్టే ఆలోచనలో లేడని తెలుస్తోంది. దీంతో కచ్చితంగా ఎన్టీఆర్ 31 మీదనే ఫోకస్ చేస్తున్నాడట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పనులు కూడా మొదలైనట్లు తెలుస్తోంది.

ఇక ఆగస్టులో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్ ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడట.


ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ ఇదే అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ క్యారెక్టర్ కు పర్ఫెక్ట్ గా ఈ టైటిల్ సరిపోతుందని భావించిన మేకర్స్ డ్రాగన్ ను ఫిక్స్ చేసినట్లు చెప్పుకొస్తున్నారు. దీంతో అభిమానులు డ్రాగన్ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.

ఇకపోతే ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రష్మికను తీసుకుంటున్నారట. అంతేకాకుండా అనిమల్ విలన్ బాబీ డియోల్.. ఎన్టీఆర్ కు ధీటుగా నటించబోతున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Tags

Related News

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×