E-Paper
Advertisement

Pooja Hegde : తెలుగులో గ్యాప్ కి కారణం ఇదే… ఇప్పటికి జ్ఞానోదయం అయినట్టుంది పాపకు !

Pooja Hegde : తెలుగులో గ్యాప్ కి కారణం ఇదే… ఇప్పటికి జ్ఞానోదయం అయినట్టుంది పాపకు !

Pooja Hegde : బుట్ట బొమ్మ పూజా హెగ్డే ‘రెట్రో’ (Retro) సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూర్య (Suriya) సరసన ఆమె నటించిన ఈ సినిమా బాగానే కలెక్షన్లు రాబడుతుండడంతో గాల్లో తేలిపోతుంది పూజ. ఈ నేపథ్యంలోనే తాజా ఇంటర్వ్యూలో ఈ అమ్మడు టాలీవుడ్ లో ఎందుకు గ్యాప్ వచ్చింది అనే విషయంపై ఓపెన్ అయింది. ఇంతకీ పూజ హెగ్డే టాలీవుడ్లో సినిమాలు చేయకపోవడానికి గల కారణం ఏంటి? అనే విషయంలోకి వెళ్తే…

టాలీవుడ్ లో గ్యాప్ కి ఇదే కారణమా? 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజ హెగ్డే తను టాలీవుడ్ కి దూరం కావడానికి గల కారణం ఏంటో వెల్లడించింది. “టాలీవుడ్ ప్రేక్షకులు మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నారు. అసలు ఎందుకు టాలీవుడ్ లో సినిమాలు చేయట్లేదు?” అనే ప్రశ్నకి పూజ హెగ్డే స్పందిస్తూ… “కొత్త పూజను తెరపై చూపించే ఒక మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పటిదాకా నా వరకు వచ్చిన స్టోరీలలో ఒక్కటి కూడా నచ్చలేదు. ఏదో ఒకటి చేసేద్దాంలే అని కాకుండా ప్రేక్షకుల కోసం ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఇప్పటికే ఒక తెలుగు సినిమాకు సైన్ చేశాను” అంటూ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. కానీ తాజాగా పూజ హెగ్డే చేసిన కామెంట్స్ విన్నాక నెటిజన్లు ఈ బ్యూటీకి ఇప్పుడు జ్ఞానోదయం అయినట్టుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వరుస డిజాస్టర్లు… అవకాశాలు కరువు 

పూజ హెగ్డే 2014లో ‘ఒక లైలా కోసం’ అనే సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది. ఈ సినిమాతో పాటు ఆ తర్వాత వచ్చిన ‘ముకుందా’ కూడా ప్లాఫ్ అవ్వడంతో మూడేళ్ల పాటు టాలీవుడ్ ఆమెను దూరం పెట్టింది. అయితే 2017లో అల్లు అర్జున్ తో ఆమె నటించిన ‘డీజే’ మూవీ పూజా హెగ్డే కెరీర్ కి టాలీవుడ్లో మంచి బూస్ట్ ఇచ్చింది. ఆ తర్వాత మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ తో నటించి టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. ఒకానొక టైంలో ఈ అమ్మడు నెంబర్ వన్ పాన్ ఇండియా హీరోయిన్ గా మారడం ఖాయం అనుకున్నారంతా.

Read also : ఐఎండీబీలో రేటింగ్ 9 ఉన్న ట్రూ స్టోరీ… ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలంటే ధైర్యం కావాలి మావా

కానీ ‘అల వైకుంఠపురంలో’ సినిమా తర్వాత ఈ బ్యూటీ నటించిన ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. ప్రభాస్ తో నటించిన పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ నుంచి మొదలు పెడితే… ఆచార్య, బీస్ట్ లాంటి సినిమాలు కూడా ప్లాఫ్ అయ్యాయి. అంతేనా ఆ తర్వాత బాలీవుడ్ లో చేసిన మరో సినిమా కూడా బెడిసి కొట్టింది. దీంతో పూజా హెగ్డే స్టోరీ సెలెక్షన్ పై విమర్శలు మొదలయ్యాయి. ఆల్మోస్ట్ 6-7 డిజాస్టర్లు చూశాక ఆలోచనలో పడ్డ పూజా, కొన్నాళ్ల పాటు సైలెంట్ గా ఉండి, ఇప్పుడు సూర్య ‘రెట్రో’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ కూడా ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు. కానీ ఇందులో పూజ హెగ్డే నటించిన ‘రుక్కు’ పాత్ర కు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. ఇన్ని రోజులు గ్లామర్ పాత్రల్లో మెరిసిన పూజా హెగ్డే ఈ సినిమాలో అందమైన కట్టు, బొట్టుతో ఆకట్టుకుంది. మరిప్పుడు పూజా ఎలాంటి తెలుగు సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతోంది అనేది చూడాలి.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×