Poonam Kaur: స్టార్ హీరోయిన్ సమంతకు వివాదాలు కొత్త కాదు. వివాదాలు కొనితెచ్చుకోవడం ఆమెకు అలవాటుగా మారింది. ఈ మధ్యకాలంలో సమంత ఒక పాడ్ క్యాస్ట్ ను ఓపెన్ చేసిన సంగతి తెల్సిందే. ఇందులో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను సర్టిఫైడ్ అయిన డాక్టర్స్ తో చెప్పేస్తుంది. తన హెల్త్ కు సంబంధించిన విషయాలను కూడా చెప్పుకొస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.
ఇక రెండు రోజుల క్రితం సామ్.. ఒక పోస్ట్ పెట్టింది. హైడ్రోజన్ పైరాక్సైడ్ నెబ్యులైజేషన్ వాడకంపై సామ్ ఒక చిన్న ఆరోగ్య చిట్కా చెప్పుకొచ్చింది. దాన్ని ఒక డాక్టర్ ఖండించాడు. సామ్ నిరక్షరాస్యులని, ఇలాంటి సలహాలు ఇస్తోన్న సామ్ ను జైలుకు పంపాలని డిమాండ్ చేశాడు. ఇక ఈ ఈ పోస్ట్ కాస్తా వైరల్ అవ్వడంతో సామ్ మరో పోస్ట్ పెట్టింది. తాను అని తెలుసుకొనే ఆ చిట్కా ఇచ్చినట్లు ఆమె తెలిపింది. అంతేకాకుండా DRDO లో పనిచేస్తున్న డాక్టర్ ఈ చిట్కా చెప్పారని తెలిపింది.
ఇక ఇదంతా పక్కన పెడితే.. ప్రస్తుతం సామ్ పై ట్రోలింగ్ ఎక్కువ అయ్యింది. సెలబ్రిటీలు సైతం సామ్ పై ఫైర్ అవుతున్నారు. సామ్ పోస్ట్ పై బాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల కామెంట్ చేసింది. ” జనాలకు హెల్త్ టిప్స్ ఇస్తున్న సెలబ్రిటీలను నేను ఒకే ఒక్క ప్రశ్న అడగలనుకుంటున్నాను.. మీ చికిత్సా విధానం అవతలివారికి ఉపయోగపడకపోగా.. వారు చనిపోతే పరిస్థితేంటి? ఎదుటివారికి సాయం చేయాలన్న మీ ఆలోచన మంచిదే.. కాదనను.. కానీ జరగరానిది జరిగితే మీరు బాధ్యత వహిస్తారా? మీకు సలహా ఇచ్చిన డాక్టర్ బాధ్యత తీసుకుంటారా.. ?” అంటూ చెప్పుకొచ్చింది.
ఇక జ్వాలా ట్వీట్ కు పూనమ్ కౌర్ సైతం మద్దతు పలికింది. ” ఇది సెల్ఫ్ గ్లోరిఫికేషన్ జ్వాలా, దేన్ని అయినా అడ్వర్టైజ్ చేసేయొచ్చు అనే దానికి ఇదే ఉదాహరణ. చాలా మంది సెలబ్రిటీస్ చక్కెర తీసుకోరు. కానీ వారు తీసుకోని చక్కెర ఉన్న పానీయాలు, చాక్లెట్ల గురించి ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. ఇదంతా డార్క్ రియాలిటీ” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం వీరి పోస్టులు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ వివాదంపై సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి.