BigTV English

Salaar: సలార్ లో ప్రభాస్ క్యారెక్టర్.. ఆ ఒక్కటే మిస్సింగ్..

Salaar: సలార్ లో ప్రభాస్ క్యారెక్టర్.. ఆ ఒక్కటే మిస్సింగ్..

Salaar: బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న సలార్.. హ్యాట్రిక్ లోపలతో బాధపడుతున్న ప్రభాస్ కు సూపర్ డూపర్ హిట్ అందించింది. ఇంత మాస్ రేంజ్ లో తమ ఫేవరెట్ హీరోని స్క్రీన్పై చూడడం ప్రభాస్ అభిమానులకు నిజంగా పండగగానే ఉంది. ఈ ఉత్కంఠత మధ్య ప్రస్తుతం సలార్ కి సంబంధించిన మరొక క్రేజీ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీలో ప్రభాస్కు చాలా తక్కువ డైలాగ్స్ ఉండడం పై కొంతమంది అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.


బాహుబలిలో ప్రభాస్ కి ఉన్న డైలాగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలుసు. డైనమిక్ కటౌట్ కి తగినట్టుగా ఇరగదీసే డైలాగ్స్ తో ప్రభాస్ అందరిని ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాడు. అయితే సలార్ మూవీలో ప్రభాస్ కు చాలా పరిమితమైన డైలాగ్స్ ఉండడం పై మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది అభిమానులు ప్రభాస్ తన డైలాగ్ డెలివరీ నైపుణ్యాన్ని ప్రదర్శించి అవకాశం ఈ చిత్రంలో లేకుండా పోయింది అని బాధపడుతున్నారు. మరికొంతమంది ఇది కథను అనుసరించి ,కథనానికి తగినట్టుగా స్క్రిప్ట్ ఉంది కాబట్టి పర్వాలేదు అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

“పగిలిందా,” “క్షమించండి,” “రెండు నిమిషాల్లో దొరలా రెడీ చేస్తా,” “కాటేరమ్మ రాలేదు,” “దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను,”,“వాళ్లను గర్ల్ ఫ్రెండ్స్ అంటారు” డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక సినిమాలో ప్రభాస్ డైలాగ్స్ మొత్తం లెక్కపెడితే గట్టిగా ఒక 38 వరకు ఉండొచ్చు అని అంచనా. డైలాగ్ డిస్కషన్ తీసి పక్కన పెడితే మాస్ యాక్షన్ లో మాత్రం ప్రభాస్ ఈ మూవీలో ఇరగదీసే పర్ఫామెన్స్ ఇచ్చాడు అనడంలో ఎటువంటి డౌట్ ఎప్పటినుంచో తమ అభిమాన నటుడు నుంచి సాలిడ్ కం బ్యాక్ ఆశిస్తున్న డార్లింగ్ ఫాన్స్ ఈ మూవీ తో ఫుల్ ఖుష్ అవుతున్నారు.


ప్రస్తుతం మెయిన్ హీరోకి ఇలా మూవీలో డైలాగ్స్ చాలా వరకు తగ్గించడంపై పలు రకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. కంటెంట్ సాలిడ్ గా ఉంటే డైలాగ్ తో అవసరం లేదు అన్న విధంగా ఉంది సలార్ చిత్రం. టాలీవుడ్ లో రాబోయే చిత్రాలకు ఇది కొత్త ట్రెండ్ సెట్టింగ్ గా మారే అవకాశం కూడా కనిపిస్తోంది. మొత్తానికి సలార్ మూవీ ప్రభాస్ కు సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చింది అనడంలో ఎటువంటి డౌట్ లేదు.

Tags

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×