Simbu: కొన్ని సందర్భాలలో దర్శకులు వాళ్ళు అనుకున్న సీన్ అనుకున్నట్లు తీయడానికి చాలా తాపత్రయపడుతుంటారు. ఆ సీన్ అలా వచ్చినంత వరకు చెక్కుతూనే ఉంటారు. అటువంటి దర్శకులు చాలామంది ఉన్నారు అని చెప్పాలి. ముఖ్యంగా ఎస్ఎస్ రాజమౌళి (RajaMouli) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంత పర్ఫెక్ట్ గా సీన్ మేకింగ్ పై కాన్సన్ట్రేషన్ చేస్తుంటారు. అందుకే తనను జక్కన్న అని కూడా అంటారు. అయితే కొన్నిసార్లు కొంతమంది నటులు తమ కంటే పెద్ద నటులతో నటించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ తరుణంలో తమ కంటే పెద్ద నటులతో నటిస్తున్నప్పుడు కొద్దిపాటి ఇబ్బంది ఖచ్చితంగా కలుగుతుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి స్థాయి ఏంటో అందరికీ తెలిసిన విషయమే. తనకు విలన్ గా నటించి మెప్పించాడు హీరో సత్యదేవ్. అప్పుడు సత్యదేవ్ (Satya Dev)ఎంత ఇబ్బంది పడ్డాడు చాలా సందర్భాల్లో తెలిపాడు.
ఎక్స్పెక్టేషన్స్ పెంచిన ట్రైలర్
మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్,శింబు ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా థగ్ లైఫ్. దాదాపు 37 సంవత్సరాల తర్వాత మణిరత్నం కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా చాలామంది పెద్దపెద్ద నటులు ఈ సినిమాలో కనిపిస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కూడా మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమా నాయకుడు కంటే కూడా మంచి హిట్ అవుతుంది అని కమలహాసన్ ఇదివరకే తెలిపారు.
కమలహాసన్ మెడ పట్టుకున్న శింబు
ఈ సినిమాలో కమల్ హాసన్ మెడను పట్టుకుని ఒక సీన్ ఉంటుంది. అయితే అది శింబు మొదట చాలా ఆర్టిఫిషియల్ గా చేశాడు. దీనితో మణిరత్నం రెండుసార్లు కట్ చెప్పారు. మణిరత్నం (Mani Ratnam) గట్టిగా పట్టుకోమని చెప్పినప్పుడు. శింబు ఈసారి చాలా గట్టిగా పట్టుకున్నాడు. అయితే కమల్ హాసన్ దాని రియాక్ట్ అయ్యే విధానం బట్టి నిజంగా నటిస్తున్నారా లేకపోతే నేను గట్టిగా పట్టుకున్నాను అనే ఆలోచన శింబు కు మొదలైంది. ఒకవేళ మెడను వదిలేస్తే మణిరత్నం కట్ చెబుతారు. ఇలా పట్టుకుంటే కమల్ హాసన్ ఇబ్బంది పడతారు. అని ఆలోచిస్తూ శింబు మొత్తానికి ఆ సీన్ ఎలానో పూర్తి చేశాడు. అయితే దీని గురించి ఈవెంట్లో క్లారిటీ ఇచ్చాడు. నేను అలా కావాలని పట్టుకోలేదు మణిరత్నం గారి వలన అలా పట్టుకున్నాను. దీనికి కారణం మణిరత్నం సార్ దయచేసి నన్ను క్షమించండి అంటూ కమలహాసన్ కు తెలిపాడు శింబు.
Also Read : Vijay Sethupathi : ఆ సూపర్ హిట్ సినిమా నేను చేయాల్సిందే, స్క్రిప్ట్ చదివినప్పుడే నచ్చింది