Pushpa 2 Kissik Song: ప్రస్తుతం తెలుగు నుండి ఎన్నో పాన్ ఇండియా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో ఎక్కువగా ‘పుష్ప 2’కు ఉన్న క్రేజ్ మరే ఇతర సినిమాకు లేదని బన్నీ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కానీ మామూలుగా బయట ప్రేక్షకుల్లో, మూవీ లవర్స్‌లో చూస్తుంటే అంత హైప్ ఏమీ కనిపించడం లేదు. అయినా కూడా పట్టు వదలకుండా మూవీపై హైప్ క్రియేట్ చేయడం కోసం మేకర్స్ అంతా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒక అప్డేట్ విడుదల చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే తాజాగా ‘కిస్సిక్’ (Kissik) అనే పాటను విడుదల చేసింది ‘పుష్ప 2’ మేకర్స్.
అన్నీ కలిసొచ్చాయి
మామూలుగా సుకుమార్ (Sukumar) సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ అంటే మామూలుగా ఉండవు. తన దర్శకత్వంలో ఇప్పటివరకు తెరకెక్కిన ప్రతీ సినిమాలో ఐటెమ్ సాంగ్ అనేది పక్కా ఉంది. ఒక్కొక్కసారి ఈ సాంగ్స్ కోసం స్టార్ హీరోయిన్లను, ఫారిన్ భామలను రంగంలోకి దించుతుంటారు సుకుమార్. అదే విధంగా ‘పుష్ప’ కోసం సమంతను దించారు. అప్పట్లో ‘పుష్ప’లో సమంత చేసిన ‘ఊ అంటావా ఊఊ అంటావా’ పాటకు మామూలు హైప్ రాలేదు. అప్పుడే సమంతకు విడాకులు అవ్వడం, పాటలో లిరిక్స్‌లో మగవారి లక్షణాల గురించి చెప్పడం, అందులో సామ్ చాలా అందంగా కనిపించడం.. ఇలాంటివన్నీ సినిమాకు హైప్ క్రియేట్ చేశాయి. కానీ ‘ఊ అంటావా’తో పోలిస్తే ‘కిస్సిక్’ కనీసం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
Also Read: ఈ మెయిన్ క్యారెక్టర్స్ ని వదులుకున్న స్టార్స్ వీళ్ళే.. చేసి ఉంటే..?
పాటల్లో పస లేదు
‘పుష్ప 2’ (Pushpa 2) నుండి ఇప్పటివరకు రెండు పాటలు విడుదలయ్యాయి. అందులో ‘సూసేకి’ పాట వెంటనే మ్యూజిక్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. అందులో అల్లు అర్జున్, రష్మిక కెమిస్ట్రీ చాలా బాగుంటుందని అప్పుడే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. కానీ ముందుగా విడుదలయిన ‘పుష్ప పుష్ప’ పాట కూడా యావరేజ్‌గానే నిలిచింది. దీంతో తరువాత విడుదలయ్యే పాట ఆడియన్స్‌లో జోష్ నింపేలా ఉండాలని ‘కిస్సిక్’ను రంగంలోకి దించారు మేకర్స్. కానీ ఇందులో శ్రీలీల అసలు కనిపించడమే లేదు. అప్పట్లో సమంతను చూడగానే యూత్ అంతా ఎంత ఎగ్జైట్ అయ్యారో.. ఆ ఎగ్జైట్మెంట్‌ను శ్రీలీల అందించలేకపోయింది.
శ్రీలీల కాపాడలేకపోయింది
‘పుష్ప 2’ మూవీ ఇప్పటికే మూడేళ్లు లేట్ అయ్యింది. దానివల్లే ప్రస్తుతం సినిమాపై ప్రేక్షకుల్లో ఒక విధమైన నెగిటివ్ అభిప్రాయం ఏర్పడింది. డిసెంబర్ 5న విడుదల తేదీని ఖరారు చేసుకున్న తర్వాత కూడా ఇప్పటికీ ఈ మూవీ షూటింగ్ పూర్తవ్వలేదు అనేది ఆ నెగిటివిటీని మరింత పెంచేస్తోంది. ఇంతలోనే ‘కిస్సిక్’ పాట విడుదలయితే అది సినిమాకు ప్లస్ అవుతుంది అనుకుంటే అది మరికాస్త మైనస్ అయ్యేలాగా ఉందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ‘పుష్ప 2’లో శ్రీలీల (Sreeleela) ఐటెమ్ సాంగ్ చేస్తుంది అని తెలిసినప్పుడు ప్రేక్షకుల్లో ఉన్న ఎగ్జైట్మెంట్.. పాట విడుదలయిన తర్వాత పూర్తిగా పోయింది.