Rakesh Varri : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలు హీరోగా చాలామంది నిలబడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో కనిపించి ఆ తర్వాత హీరోగా సినిమాలు చేసిన వాళ్లు కూడా ఉన్నారు. విజయ్ దేవరకొండ (Vijay devarakonda), సిద్దు జొన్నలగడ్డ (Siddhu jonnalagadda) వంటి హీరోలు ముందుగా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించి నేడు హీరోలుగా కొనసాగుతున్నారు. వాళ్ల కెరియర్ లో మంచి హిట్ సినిమాలు ఉన్నాయి. సిద్దు జొన్నలగడ్డ జోష్ (Josh) సినిమాలో ఒక కీలకపాత్రలో కనిపించాడు. ఆ సినిమాలో కనిపించిన చాలామంది నటులు తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకొని ఇప్పటికీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈ సినిమాలో రాకేష్ వర్రి ఒక కీలక పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత హీరోగా కూడా తనను తాను నిలబెట్టుకునే ప్రయత్నం చేశాడు. ఎవరికీ చెప్పొద్దు అనే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది.
Also Read : Nani: అవును.. ప్యారడైజ్ ఫిక్స్.. నాని పోస్ట్ వైరల్
రీసెంట్ టైమ్స్ లో చిన్న కాన్సెప్ట్ సినిమాలు అద్భుతంగా వర్కౌట్ అవుతున్నాయి. చాలా చిన్న సినిమాలు పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. అందులో ఎవరికి చెప్పొద్దు సినిమా కూడా ఒకటి. చాలామంది తాము ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయిన తర్వాత కొన్ని సినిమాలను నిర్మించే ప్రయత్నాలు కూడా చేస్తారు. విజయ్ దేవరకొండ లాంటి హీరో మీకు మాత్రమే చెప్తా అంటే సినిమాలు కూడా నిర్మించాడు. అలానే రాకేష్ పేక మేడలు అనే సినిమాలను నిర్మించాడు. ఈ సినిమాకి వాస్తవంగా మంచి టాక్ వచ్చింది కానీ థియేటర్లో కమర్షియల్ సక్సెస్ కాలేదు. అయితే ఈ సినిమాకి ఓటీటిలో మంచి రెస్పాన్స్ వచ్చింది. లేకపోతే ఈ సినిమాకి సంబంధించి కొన్ని కామెంట్స్ చేశాడు నటుడు రాకేష్.
Also Read: Amaran: ముకుంద్ చెల్లి పాత్రలో నటించిన ఈ బ్యూటీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?
విరించి వర్మ దర్శకత్వంలో రాకేష్ ప్రస్తుతం జితేందర్ రెడ్డి అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. రిలీజియన్ ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది ఈ తరుణంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక ఈవెంట్ ను నిర్వహించింది చిత్ర యూనిట్. ఈవెంట్ లో రాకేష్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ కు గురి అయ్యాడు. నాకే మార్కెట్ లేదు.. నేను ఇంకొకరితో ‘ పేక మేడలు’ (Peka Medalu) చేసి తప్పు చేశాను. నటుడికి సరైన గుర్తింపు వచ్చిన తర్వాత ఇలా సినిమాలను నిర్మించాలి అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. నాకు సరైన గుర్తింపు లేకపోవడం వల్లనే దాదాపు సంవత్సరం పైగా టైం పోయింది అని చెప్పుకొచ్చాడు రాకేష్.