Ram Pothineni: ఈరోజుల్లో యంగ్ హీరోలు కేవలం యాక్టింగ్ వరకే పరిమితం కాకుండా ఇతర విభాగాల్లో కూడా తమ సత్తా చాటాలని అనుకుంటున్నారు. అందుకే ప్రతీ విభాగంలో ఒక ప్రయోగం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇతర సౌత్ భాషల్లో అలాంటి ప్రయోగాలు చేసే యంగ్ హీరోలు చాలామందే ఉన్నా.. టాలీవుడ్‌లో మాత్రం అలాంటి వారు చాలా తక్కువ. ఇప్పుడు అదే కేటగిరిలో యంగ్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) అలియాస్ రామ్ కూడా జాయిన్ అవ్వనున్నాడు. ఇప్పటివరకు కేవలం యాక్టింగ్‌పై తప్పా ఇతర విభాగాల్లో చాలా తక్కువగా ఫోకస్ చేశాడు రామ్. అలాంటిది తన అప్‌కమింగ్ మూవీ కోసం ఫ్యాన్స్‌కు ఒక స్పెషల్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాడట ఈ చాక్లెట్ బాయ్.
వేగంగా షూటింగ్
హీరోగా కెరీర్‌ను ప్రారంభించినప్పటి నుండి ఎన్నో రకాల పాత్రల్లో కనిపించాడు రామ్. అప్పుడప్పుడు తన సినిమాలతో మాస్ ఇమేజ్‌పై కూడా ఫోకస్ పెట్టాడు. కానీ ప్రేక్షకులకు మాత్రం తను చాక్లెట్ బాయ్‌గానే ఇష్టం. గత కొన్నేళ్లుగా పూర్తిగా కమర్షియల్ హీరోగా మారడానికి ప్రయత్నాలు చేశాడు ఈ యంగ్ హీరో. కానీ ఆ ప్రయత్నాలు చాలావరకు ఫెయిలే అయ్యాయి. అందుకే మరోసారి లవర్ బాయ్‌గా కనిపించి హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే మహేశ్ బాబు దర్శకత్వంలో ఒక లవ్ స్టోరీని చేయడానికి ఒప్పుకున్నాడు. ‘రాపో 22’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ.. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్‌తో దూసుకుపోతోంది. ఇక ‘రాపో 22’ కోసం రామ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
కొత్త అవతారంలో
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ మహేశ్ బాబు (Mahesh Babu) దర్శకత్వంలో రామ్ నటిస్తున్న సినిమానే ‘రాపో 22’. ఈ సినిమాలో భాగ్యలక్ష్మి భోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో సాగర్ అనే పాత్రలో రామ్ కనిపించనున్నాడు. ఈ మూవీ కోసం మరోసారి పూర్తిగా తన లుక్ మార్చేసి లవర్ బాయ్‌గా మారిపోయాడు రామ్. అంతే కాకుండా తాజాగా తన ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇవ్వడం కోసం ఈ మూవీలో ఒక పాట కూడా రాశాడని ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. తను ఏ పాటకు లిరిక్స్ రాశాడు అనే విషయం బయటికి రాకపోయినా.. చాలా క్యాచీ లిరిక్స్‌తో ప్రేక్షకులను అట్రాక్ట్ చేసేలా మాత్రం ఈ పాట ఉంటుందని తెలుస్తోంది. లిరిసిస్ట్‌గా రామ్ కొత్త అవతారం చూడడానికి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: భార్యతో సహా స్టార్ హీరో అనుమానాస్పద మృతి.. ఇంతకీ ఏం జరిగింది.?
డేటింగ్ రూమర్
‘రాపో 22’ సినిమా గురించి ఇప్పటికే పలు రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో సాగర్ అనే పాత్రలో రామ్ కనిపిస్తుండగా.. తన గర్ల్ ఫ్రెండ్ మహాలక్ష్మి పాత్రలో భాగ్యశ్రీ భోర్సే (Bhagyashri Borse) నటించనుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుండి రామ్, భాగ్యశ్రీ చాలా క్లోజ్‌గా ఉంటున్నారని, డేటింగ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. హీరోగా అడుగుపెట్టినప్పటి నుండి రామ్‌పై ఇలాంటి రూమర్స్ రావడం చాలా అరుదు.