Raja Lingamurthy murder: భూపాలపల్లిలో తొమ్మిది రోజుల క్రితం నాగవెళ్లి రాజలింగమూర్తి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే రాజలింగమూర్తి హత్యపై విచారణ జరిపించాలని ఆయన భార్య సరళ ప్రభుత్వానికి విన్నవించారు. ఈ క్రమంలోనే తన భర్త హత్యపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డిని వేడుకున్నారు.
ALSO READ: Group-D Jobs: 32000 ఉద్యోగాలకు ఇంకా రెండు రోజులే మిత్రమా.. ఆలస్యం వద్దు..!
సీఎం రేవంత్ రెడ్డికి తన బాధను విన్నవిస్తూ రాజలింగమూర్తి భార్య ఓ వీడియో విడుదల చేశారు. తనకు, తన పిల్లలకు ప్రాణహాని ఉందని సరళ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన భర్త రాజలింగ హత్య కేసులో ప్రధాన సూత్రధారి బీఆర్ఎస్ నేత హరిబాబు పరారీలో ఉండడంపై తమకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. తన భర్త హత్య వెనుక కేటీఆర్, హరీష్ రావు, గండ్ర వెంకటరమణా రెడ్డి హస్తం ఉందని ఆమె ఆరోపించారు. సీబీఐ ఎంక్వైరీ చేసి అసలు దోషులను పట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేశారు. స్థానిక పోలీసులపై తనకు నమ్మకం లేదని చెప్పారు. తాను ఇచ్చిన పిటిషన్ కాదని, మరొక పిటిషన్ లో తనకు తెలియకుండా డీఎస్పీ సంతకం తీసుకున్నారని ఆమె ఆరోపించారు.
ALSO READ: BEL Recruitment: బెల్‌లో ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.50,000.. ఈ అర్హత ఉంటే చాలు భయ్యా..
‘నా భర్త చనిపోయి 9 రోజులు గడుస్తున్నాఅసలు దోషులు ఎవరో తెలియడం లేదు. మేడిగడ్డ ప్రాజెక్ట్ కారణంగానే నా భర్తను చంపారు. భూమి తగాదా విషయంలో ఆయనను ఎవరూ చంపలేదు. 2 గుంటల భూమి విషయంలో నా భర్త చనిపోయారని అంటున్నారు. దానిలో ఏమాత్రం నిజం లేదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, రమణారెడ్డి కుమ్మక్కై చంపారనే డౌట్ మాకు ఉంది. రమణా రెడ్డి అనుచరుడు హరిబాబు పాత్ర ఎక్కువగా ఉందని మేం అనుకుంటున్నాం. వందల, వేల కోట్ల ప్రాజెక్ట్ విషయంలోనే నా భర్తను చంపారు. చాలా రోజుల నుంచే నా భర్తను చంపాలనే స్కెచ్ వేశారు. కరెంట్ లేని సమయంలో నా భర్తను దారుణంగా హత్య చేశారు. ఈ కేసును సీఎం రేవంత్ రెడ్డి సీబీఐతో విచారణ జరిపించాలి’ రాజలింగమూర్తి భార్య సరళ వేడుకున్నారు.