BigTV English

Jaya Prada: సినీ నటి జయప్రదకు షాక్.. అరెస్ట్ చేయాలంటూ కోర్టు ఆదేశం..

Jaya Prada: సినీ నటి జయప్రదకు షాక్.. అరెస్ట్ చేయాలంటూ కోర్టు ఆదేశం..

Jaya Prada latest news


Jaya Prada latest news(Cinema news in telugu): సీనియర్ నటి జయప్రద ఎన్నో సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, హిందీ, తమిళం, బెంగాలి వంటి భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి ఫుల్ క్రేజ్, పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇక హీరోయిన్‌గానే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి ప్రేక్షకుల్ని మెప్పించింది.

అంతేకాకుండా సీతా కళ్యాణం, హిందీ లవకుశ, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం వంటి పౌరాణిక పాత్రల్లో నటించి అలరించిన ఘనత ఆమెకే దక్కుతుంది. ఇకపోతే అప్పట్లో తెలుగు దేశం తరపున రాజ్యసభ సభ్యురాలిగా తన సేవలను అందించారు.


అనంతరం ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ తరపున రాంపూర్ ఎంపీగా కూడా తన విలువైన సేవలను ప్రజలకు అందించారు. అయితే సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ మంచి గుర్తింపు పేరు ప్రతిష్టలు అందుకున్న నటి జయప్రదకు ప్రస్తుతం టైం ఏమి బాగోలేదు.

READ MORE: జయప్రద థియేటర్స్ కేసులో కొత్త మలుపు.. తీర్పును కాస్త సడలించిన మద్రాసు హైకోర్టు.

ప్రస్తుతం ఈ నటి చుట్టూ వివాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే కొన్ని కేసులు కూడా ఈమెపై నమోదు అయ్యాయి. అంతేకాకుండా మద్రాసు హైకోర్టు జయప్రదకు 6 నెలల జైలు శిక్షకూడా విధించింది. ఆ తర్వాత బెయిల్‌పై బయటకువచ్చింది.

ఇదిలా ఉంటే.. తాజాగా జయప్రదకు మరోషాక్ తగిలింది. జయప్రద 2019 ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన కేసుకి సంబంధించి ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్ కోర్టు ఆమెకు షాక్ ఇచ్చింది. మార్చి 6 లోపు జయప్రదను కోర్టులో హాజరు పరచాలని పోలీసులను ఆదేశించింది.

కాగా అప్పట్లో ఎన్నికల సందర్భంగా జయప్రద ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు ప్రజా ప్రతినిధుల కోర్టు ఆమెకు సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని కోర్టు ఎన్నిసార్లు ఆదేశించినా ఆమె పట్టించుకోలేదు.

READ MORE: జయప్రదకు 6 నెలల జైలు శిక్ష.. ఎందుకంటే..?

దీంతో ఆమెను అరెస్ట్ చేసి తమ ముందు ఉంచాలని రాంపూర్ ఎస్పీకి.. కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జయప్రదను యూపీ పోలీసులు గాలీస్తున్నట్లు సమాచారం.

Related News

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×