BigTV English

Ranveer Singh: ‘నాన్న’ చైల్డ్ ఆర్టిస్ట్‌ తో రొమాన్స్ చేయనున్న రణవీర్.. ఛిఛీ, సిగ్గుందా?

Ranveer Singh: ‘నాన్న’ చైల్డ్ ఆర్టిస్ట్‌ తో రొమాన్స్ చేయనున్న రణవీర్.. ఛిఛీ, సిగ్గుందా?

Ranveer Singh Romance With Teen Age Actress: ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ సక్సెస్ తర్వాత రణవీర్ సింగ్,  ఆదిత్య ధర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రామ్ పాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రణవీర్ కు జోడీగా యంగ్ హీరోయిన్ సారా అర్జున్ ను ఎంపిక చేశారు మేకర్స్.  ఈ సెలెక్షన్ పై బాలీవుడ్ లో జోరుగా చర్చ నడుస్తోంది. ప్రస్తుతం సారా వయసు 19 ఏండ్లు కాగా, రణవీర్ ఏజ్ 39 ఏండ్లు. ఇద్దరి మధ్య ఏకంగా 20 ఏండ్ల తేడా ఉంది. ఈ నేపథ్యంలో నెటిజన్లు రణవీర్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.


ఛి ఛీ సిగ్గుందా రణవీర్..?

రణవీర్, సారా మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండటంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. రణవీర్ సరసన సారాను సెలెక్ట్ చేసిన మేకర్స్ కు అసలు బుద్దిలేదంటున్నారు. రణవీర్ సింగ్ ‘బ్యాండ్ బాజా బారాత్’ సినిమా వచ్చినప్పుడు సారా వయసు 5 ఏండ్లు. ఆ అమ్మాయితో  రొమాన్సా?” అంటూ ఓ నెటిజన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. “అయ్యో 39 ఏండ్ల వ్యక్తి సరసన 19 ఏండ్ల అమ్మాయి హీరోయినా?” అంటూ మరో నెటిజన్ షాక్ అయ్యాడు. “సినిమాకు హీరో ఎంత ముఖ్యమో, హీరోయిన్ కూడా అంతే ముఖ్యం. ఇద్దరి కెమిస్ట్రీ కుదరకపోతే సినిమా అంతా చెడిపోతుంది. ఈ విషయం తెలిసే రణవీర్ సరసన సారాను సెలెక్ట్ చేశారా?” అంటూ మరొకరు స్పందించారు. “సినిమాలో హీరోయిన్ ఎంపిక అనేది హీరో మీద ఆధారపడి ఉండదు. అసలు తప్పు దర్శకనిర్మాతలది” అంటూ మరో నెటిజన్ ఫైర్ అయ్యాడు. మొత్తంగా రణవీర్ సరసన సారాను ఎంపిక చేయడంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.


ఇంతకీ ఎవరీ సారా అర్జున్

సారా అర్జున్ హిందీ, మలయాళం, తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. విక్రమ్ ‘నాన్న’ సినిమాలో ఆయన కూతురుగా నటించింది. ఈ సినిమా ఆమెకు మంచి క్రేజ్ తీసుకొచ్చింది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘పొన్నియిన్ సెల్వన్’ మూవీలోనూ కీలక పాత్ర పోషించింది. యువ నందిని పాత్రలో ఒదిగిపోయి నటించింది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. గత కొంతకాలంగా ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రల్లో నటించడం మానేసింది. హీరోయిన్ గా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ మూవీలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. అయితే, ఈ సినిమాలో రణవీర్ తో పోల్చితే ఆమెకు పరిమిత స్క్రీన్ స్పేస్ ఉండవచ్చని తెలుస్తోంది.

తక్కువ వయసున్న హీరోయిన్లతో జోడీ కట్టడం ఇదే తొలిసారి కాదు!

ఇక బాలీవుడ్ లో చిన్న వయసు హీరోయిన్లతో హీరోలు జతకట్టడం ఇదే తొలిసారి కాదు. దీపికా పదుకొణె, అనుష్క శర్మ కూడా వయసులో తమ కంటే 20 ఏళ్లు పెద్ద అయిన షారుఖ్ ఖాన్‌తో జతకట్టారు. బీ టౌన్ లో ఏజ్ గ్యాప్ విషయంలో తీవ్ర చర్చ జరుగుతున్నప్పటికీ మేకర్స్ వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు రణవీర్ సరసన సారాను ఎంపిక చేయడంతో మరోసారి చర్చకు కారణం అయ్యింది.

రణవీర్ సింగ్,  ఆదిత్య ధర్ మూవీ గురించి..

ఇక ఈ మూవీ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. రణవీర్ పాకిస్తాన్‌ లో ఒక మిషన్‌ కోసం పని చేసే  ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్‌ల ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.  ఈ సినిమాలో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Also:ఫెయిల్యూర్ హీరోయిన్ పై ప్రశంసలు.. అసలు కథ ఏంటంటే..?

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×