Vijay Sethupathi : రీసెంట్ టైమ్స్ లో రిలీజ్ అయిన సత్యం సుందరం సినిమా ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయింది. కార్తీ (Kaarthi) అరవిందస్వామి కీలకపాత్రలో కనిపించిన ఈ సినిమాకి తెలుగు ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పట్టారు. 96 సినిమా తర్వాత సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా కాబట్టి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉండేవి. అంచనాలన్నిటిని కూడా ఈ సినిమా సక్సెస్ఫుల్ గా రీచ్ అయింది. దాదాపు 3 గంటల పాటు ఉండే ఈ సినిమా ప్రేక్షకులకు బోరు కొట్టకుండా అద్భుతంగా డీల్ చేసాడు దర్శకుడు. స్వతహాగా ప్రేమ్ కుమార్ (Prem Kumar)సినిమాటోగ్రాఫర్ కావడం వలన ఈ సినిమాలో విజువల్స్ కూడా అద్భుతంగా రాబట్టుకున్నాడు అని చెప్పాలి. ఈ సినిమాకి గోవింద వసంత్ అందించిన మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్. వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకే వచ్చిన 96 మ్యూజిక్ కూడా అందరిని విపరీతంగా ఆకట్టుకుంది.
విజయ్ సేతుపతి చేయాల్సింది
విజయ్ సేతుపతి త్రిష కృష్ణన్ (Trisha Krishnan) నటించిన 96 సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమాతోనే దర్శకుడు సి ప్రేమ్ కుమార్ కి మంచి పేరు వచ్చింది. ఇదే సినిమాను తెలుగులో జాను (Jaanu) పేరుతో తెరకెక్కించారు. కానీ ఆ మ్యాజిక్ సెకండ్ టైం వర్కౌట్ కాలేదు. అయితే సి ప్రేమ్ కుమార్ చేసిన రెండవ సినిమా సత్యం సుందరం (Satyam Sundaram) సినిమా కూడా విజయ్ సేతుపతి చేయాల్సిందే. ఆ సినిమా స్క్రిప్ట్ స్టేజ్ లోనే ఉన్నప్పుడే విజయ్ సేతుపతి చదివారు. అప్పుడు విజయ్ సేతుపతికి ఆ సినిమా విపరీతంగా నచ్చింది. కానీ తనకు డేట్స్ కుదరకపోవడం వలన ఆ సినిమా చేయలేదు అని ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు విజయ్ సేతుపతి. కేవలం తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా చాలామంది హీరోలు సూపర్ హిట్ సినిమాలను వదులుకున్న దాఖలాలు ఉన్నాయి.
రెండు క్వాలిటీ ఫిలిమ్స్
మామూలుగా చాలామంది దర్శకులు త్వర త్వరగా సినిమాలు చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని హిట్ సినిమాలు ఉంటాయి. మరికొన్ని ఫట్ సినిమాలు ఉంటాయి. కానీ క్వాలిటీ సినిమాలు తీయడం అనేది మామూలు విషయం కాదు. ఒక సినిమా మనిషి ఆలోచన తీరుని మార్చాలి అనే నమ్మి అతి తక్కువ మంది దర్శకులలో సి ప్రేమ్ కుమార్ ఒకరు. అందుకనే తను తీసిన రెండు సినిమాలు కూడా కేవలం తమిళ్ ఫిలిం ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా మంచి ఆదరణను పొందుకున్నాయి.
Also Read : Simbu : అందుకే నాన్నను రావద్దు అని చెప్పాను, స్టేజ్ పై ఏడ్చేసిన శింబు