Sai Pallavi: కొందరు నటీనటులు చాలా తక్కువ స్పీడ్‌లో సినిమాలు చేస్తారు. కానీ వారికి ప్రేక్షకుల అభిమానం ఎక్కువగా ఉంటుంది. కథ నచ్చినా అందులో తమ పాత్ర నచ్చకపోతే.. ఏ మాత్రం ఆలోచించకుండా ఎంత భారీ బడ్జెట్ సినిమా అయినా రిజెక్ట్ చేసే నటీనటులు ఇంకా ఉన్నారు. ఈ జెనరేషన్‌లో అలాంటి హీరోయిన్ ఎవరు అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చే పేరు సాయి పల్లవి. సాయి పల్లవి స్టోరీ సెలక్షన్ గురించి ఇప్పటికే ప్రేక్షకులకు ఒక ఐడియా ఉంది. ఏడాదికి కనీసం ఒక సినిమా కూడా చేయకపోయినా.. తను ఒక సినిమాలో నటించిందంటే దాని ఇంపాక్ట్ మామూలుగా ఉండదు. తాజాగా ‘అమరన్’ మూవీలో తన నటనకు వచ్చిన అవార్డే దీనికి నిదర్శనం.
బ్లాక్‌బస్టర్ మూవీ
ఇటీవల శివకార్తికేయన్ హీరోగా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమానే ‘అమరన్’. ఈ సినిమా అక్టోబర్ చివర్లో విడుదలయ్యి చాలాకాలం పాటు థియేటర్లలో సక్సెస్‌ఫుల్ నడిచింది. అంతే కాకుండా కలెక్షన్స్ విషయంలో కూడా రికార్డులు సృష్టించింది. ఓటీటీలో వచ్చిన తర్వాత కూడా ‘అమరన్’ (Amaran) కోసం థియేటర్లకు వెళ్లినవారు ఉన్నారంటే ఈ మూవీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ మూవీలో మేజర్ ముకుంద్‌గా శివకార్తికేయన్ నటన ప్రేక్షకులను ఎంతలాగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అందులో ఇందు రెబెక్కా వర్గీస్‌గా సాయి పల్లవి (Sai Pallavi) కూడా సమానంగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.
Also Read: రిస్క్ తీసుకుంటున్న యంగ్ డైరెక్టర్.. హ్యాట్రిక్ ఫ్లాప్స్ తప్పవా.?
గ్రాండ్ సక్సెస్
తాజాగా చెన్నైలో గ్రాండ్‌గా 22వ చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది. డిసెంబర్ 12న ప్రారంభమయిన ఈ ఫిల్మ్ ఫెస్టివల్ డిసెంబర్ 19న ముగిసింది. ఈ ఎనిమిది రోజుల్లో 50 దేశాల నుండి వచ్చిన 123 సినిమాలను అక్కడ ప్రదర్శించారు. ఈ ఈవెంట్‌లో సీనియర్లు అంతా వచ్చి ఫిల్మ్ మేకింగ్ గురించి మాట్లాడడంతో పాటు మరెన్నో స్పెషల్స్ ఉన్నాయి. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ను దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేశారు. ఎప్పుడూ లేనంతగా ఈసారి చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు 6000 మంది హాజరయ్యారని తెలిపారు. ఇక ఈ ఫెస్టివల్ ముగిసే రోజున బెస్ట్ యాక్టర్ ఫీమేల్ కేటగిరిలో సాయి పల్లవికి అవార్డ్ దక్కింది. అది కూడా ‘అమరన్’ సినిమా కోసం.
బ్యాక్ టు బ్యాక్ అవార్డులు
చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సాయి పల్లవికి అవార్డ్ రావడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇంతకు ముందు తను హీరోయిన్‌గా నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘గార్గి’కి కూడా బెస్ట్ యాక్టర్ ఫీమేల్‌గా అవార్డ్ అందుకుంది సాయి పల్లవి. ‘గార్గి’ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అందుకోలేదు. చెప్పాలంటే ఈ మూవీ గురించి చాలామందికి తెలియదు కూడా. అయినా ఈ సినిమాను చూసినవారు సాయి పల్లవి నటనను అస్సలు మర్చిపోలేరు. అలాగే ‘అమరన్’ మూవీలో కూడా ఇందు పాత్రతో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది కాబట్టి తనకు ఆ బెస్ట్ ఫీమేల్ యాక్టర్ అవార్డ్ దక్కింది.
Then for #Gargi &
Now for #AmaranCongratulations Queen @Sai_Pallavi92 on Winning Back to Back BEST ACTRESS AWARDS at Chennai International Film Festivals❤️🔥#SaiPallavi #CIFF #Indhu #Gargi pic.twitter.com/aMmkrPuHIO
— Sai Pallavi FC™ (@SaipallaviFC) December 20, 2024