Saif Ali Khan: బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి దొంగలు చొరబడడం, వాళ్లు తనపై కత్తితో దాడి చేయడం.. ఇదంతా ఒక్కసారిగా ప్రేక్షకులు అందరినీ షాక్‌కు గురిచేసింది. ఒక పేరున్న బాలీవుడ్ హీరో ఇంట్లోకి దొంగలు అంత ఈజీగా ఎలా రాగలరు అంటూ అప్పటినుండి ప్రేక్షకులు చర్చించుకుంటూనే ఉన్నారు. మొత్తానికి సైఫ్ అలీ ఖాన్‌పై కత్తులతో దాడి జరిగినా కూడా కుటుంబ సభ్యులు వెంటనే అలర్ట్ అయ్యి తనను ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు కూడా తనకు సర్జరీ చేసి, తగిన చికిత్సను అందించి ప్రమాదం నుండి బయటపడేయగలిగారు. ఇప్పుడు సైఫ్ ఆరోగ్యం బాగానే ఉన్నా.. తనకు ఉన్న సినిమా కమిట్మెంట్స్ విషయంలోనే కన్ఫ్యూజన్ మొదలయ్యింది.
లైన్‌లో దేవర
గతేడాది ఎన్‌టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవర’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు సైఫ్ అలీ ఖాన్. తను హీరోగా నటించిన హిందీ సినిమాలను చాలామంది తెలుగు ప్రేక్షకులు కూడా చూస్తుండడంతో తను ఎప్పుడో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయ్యాడు. అయినా కూడా మొదటిసారి తనను తెలుగు సినిమాలో చూడడం చాలామంది ఎగ్జైటింగ్‌గా అనిపించింది. అయితే ‘దేవర’లోనే కాదు దాని సీక్వెల్‌లో కూడా సైఫ్ నటించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్‌కు అయిన తీవ్ర గాయాల వల్ల మళ్లీ తను షూటింగ్ సెట్‌లో ఎప్పుడు అడుగుపెడతాడు అనే విషయంపై క్లారిటీ లేదు. తనపై జరిగిన దాడి వల్ల ఒక హిందీ సినిమా కూడా ఎఫెక్ట్ కానుంది.
షూటింగ్ ఫిక్స్
రాహుల్ ధోలాకియా దర్శకత్వంలో నిఖిల్ అద్వానీ నిర్మాణంలో సైఫ్ అలీ ఖాన్ ఒక భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. జనవరి 20న ఈ మూవీ షూటింగ్ ప్రారంభించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. మధ్ ఐల్యాండ్‌లో ఈ మూవీకి షూటింగ్‌కు కావాల్సిన సెట్ కూడా సిద్ధమయ్యింది. ఇందులో సైఫ్ అలీ ఖాన్‌తో పాటు ప్రతీక్ గాంధీ, దీపక్ దోబ్రియాల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరగడం వల్ల షూటింగ్ షెడ్యూల్ అంతా మారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‘‘ముందుగా ఏప్రిల్‌లో షూటింగ్ ప్రారంభించాలని అనుకున్నాం. కానీ జనవరికి ప్రీపోన్ చేశాం. ఇప్పుడు సైఫ్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మార్చి, ఏప్రిల్‌లో షూటింగ్ ప్రారంభించడానికి ప్రయత్నిస్తాం’’ అని మేకర్స్ చెప్తున్నారు.
Also Read: ఇద్దరి మధ్య ఉన్న విచిత్రమైన అనుబంధం ఏంటో తెలుసా?
బయోపిక్‌లో సైఫ్
రాహుల్ ధోలాకియా దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా ఒక హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియాలో జరిగిన మొదటి ఎలక్షన్స్ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కనుందట. 1951 అక్టోబర్ నుండి 1952 ఫిబ్రవరీ మధ్య జరిగిన పరిస్థితుల గురించి ఈ సినిమాలో చూపించనున్నారని సమాచారం. ఇండియా మొదటి చీఫ్ ఎలక్షన్ కమీషనర్ అయిన సుకుమార్ సేన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) కనిపించనున్నాడు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ గురించి సైఫ్‌తో మాట్లాడనున్నారు మేకర్స్.