BigTV English

Visit Moscow: రష్యా వెళ్లే టూరిస్టులకు క్రేజీ న్యూస్, ఆ కార్డుతో ఈజీగా చెల్లింపులు చేసుకోవచ్చు!

Visit Moscow: రష్యా వెళ్లే టూరిస్టులకు క్రేజీ న్యూస్, ఆ కార్డుతో ఈజీగా చెల్లింపులు చేసుకోవచ్చు!

ప్రస్తుతం చాలా దేశాలు భారతీయ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. కొన్ని దేశాల్లో ఫోన్ పే, గూగుల్ పేతో పాటు ఇతర యుపిఐలు కూడా పని చేస్తున్నాయి. మరికొన్ని దేశాల్లో ఇవేమీ పని చేయవు. భారత్ కు మిత్రదేశం అయిన రష్యాలోనూ మన వీసా, మాస్టర్ కార్డులు పని చేయవు. ఈ నేపథ్యంలో పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సరికొత్త కార్డును పరిచయం చేసింది. రష్యాలో అతిపెద్ద బ్యాంకు అయిన స్బెర్ అత్యాధునిక టూరిస్ట్ బ్యాంకింగ్ కేంద్రాన్ని ప్రారంభించింది. భారతీయ పర్యాటకులో పాటు ఇతర అంతర్జాతీయ సందర్శకులకు టూరిస్ట్ కార్డ్‌ లను అందిస్తుంది. ఈ కార్డుతో రష్యాలో ఈజీగా చెల్లింపులు చేసే అవకాశం ఉంటుంది.


మల్టీ ఫంక్షనల్ హబ్ గా..

స్బెర్ ట్రావెల్ అండ్ బ్యాంకింగ్ పేరుతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కేవలం చెల్లింపులకు సంబంధించిన కార్డులు జారీ చేయడమే కాదు,  పర్యాటక సమాచారాన్ని అందించడంతో పాటు బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది. అన్ని విషయాలను వెల్లడించే మల్టీ ఫంక్షనల్ హబ్‌గా పని చేస్తుంది. మాస్కోలో చూడదగిన ప్రదేశాలు, వింతలు, విశేషాలకు సంబంధించి అన్ని విషయాలను ఇక్కడ తెలుసుకునే అవకాశం ఉంటుంది. కరెన్సీని మార్పిడి చేసుకోవాలన్నా, డబ్బును బదిలీ చేయాలన్నా, సందర్శనా ప్రయాణ ప్రణాళికను ప్లాన్ చేసుకోవాలన్నా, ఈ కేంద్రంలో సిబ్బంది సాయం చేస్తారు. పర్యాటక సమాచార నిపుణులు రష్యన్, ఇంగ్లీష్, అరబిక్ భాషల్లో వివరిస్తారు.


టూరిస్టు కార్డుతో క్యాష్ లెస్ చెల్లింపులు

రష్యా టూరిస్ట్ కార్డ్‌ ను తీసుకునే సందర్శకులు మాస్కో అంతటా నగదు రహిత చెల్లింపులు చేసుకోవచ్చు. ఈ కార్డ్ రష్యన్ MIR చెల్లింపు నెట్‌ వర్క్‌లో పనిచేస్తుంది. స్థానిక వ్యాపారులు, ప్రజా రవాణా, మ్యూజియంలు, రెస్టారెంట్లు సహా అన్ని చోట్ల సపోర్టు చేస్తుంది. అంతేకాదు, ఈ కార్డును పొందేందుకు అదనపు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగానే అందిస్తారు. ఆ దేశ పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు గాను, స్బెర్ బ్యాంక్ ఈ కార్డును అందుబాటులోకి తీసుకొచ్చింది.

అందుబాటులో వర్చువల్ టూరిస్ట్ కార్డు

ప్రయాణీకుల డిజిటల్ చెల్లింపులను దృష్టిలో పెట్టుకుని స్బెర్ టూరిస్ట్ కార్డ్‌ను డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫామ్ అయిన యూమనీతో అనుసంధానించింది. పర్యాటకులు రష్యాలో అడుగు పెట్టగానే యూమనీ అకౌంట్ ను క్రియేట్ చేసుకుని వర్చువల్ టూరిస్ట్ కార్డ్‌ను పొందవచ్చు. రష్యన్ సిమ్ కార్డ్ అవసరం లేకుండా ఫోన్ నంబర్‌ను మాత్రమే ఉపయోగించవచ్చు. ఈ వర్చువల్ కార్డ్‌ను ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం QR కోడ్ స్కానింగ్, NFC ట్యాపింగ్‌తో సహా నగదు రహిత చెల్లింపుల కోసం YooMoney యాప్ ద్వారా ఉపయోగించవచ్చు. iOS వినియోగదారులు QR కోడ్‌లను స్కాన్ చేయడం ద్వారా చెల్లించవచ్చు. ఈ పద్ధతి మాస్కో అంతటా ఉంది. ఒకవేళ ఫిజికల్ కార్డును ఇష్టపడే వారికి, దీనిని ముందుగానే ఆర్డర్ చేసి నేరుగా వారు బస చేసే హోటల్‌ లోనే పొందే అవకాశం ఉంటుంది. Yoomoneyకి సపోర్టు చేసే ATMల ద్వారా కార్డ్‌ను రీఛార్జ్ చేయడం సులభం.

మాస్కోకు పెరుగుతున్న భారతీయ పర్యాటకులు

మాస్కోకు ఇండియా నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వెళ్తున్నారు. 2024లో దాదాపు ఎనభై ఆరు వేల మంది భారతీయ పర్యాటకులు మాస్కోను సందర్శించారు. 2023తో పోలిస్తే 1.4 రెట్లు పెరిగారు.

Read Also: రాత్రి వేళ రోడ్డుపై మెరిసే ఈ లైట్లు కరెంటు లేకుండా ఎలా పనిచేస్తాయో తెలుసా?

Related News

Ganga Bridge: ఆసియాలోనే అద్భుతం.. 10 కి.మీ పొడవైన గంగా వంతెన.. ఇది వేరే లెవల్ బాస్!

Trains Cancelled: భారీ వర్షాలు.. పట్టాల మీదికి నీళ్లు, 5 రోజుల పాటు 10 రైళ్లు రద్దు!

Namo bharat Train: అది లోకల్ ట్రైన్ కాదురా అయ్యా, నమో భారత్!

Indian Railways: ఆ టైమ్‌లో టీటీఈ.. ప్రయాణీకులను అస్సలు డిస్టర్బ్ చేయకూడదు, అలా చేస్తే దబిడి దిబిడే!

MMTS Trains: కొత్త రూట్లు, మరిన్ని స్టాప్ లు, MMTS ప్రయాణీకులకు క్రేజీ న్యూస్!

SCR Updates: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. సికింద్రాబాద్, విజయవాడ, విశాఖ రైళ్లు తిరిగి అసలు రూట్‌లోకి!

Big Stories

×