Tamannaah: తమన్నా లాంటి స్టార్ హీరోయిన్ ఒక నాగ సాధువు పాత్రలో నటిస్తుంది అంటే ప్రేక్షకులు షాక్ అవ్వక తప్పలేదు. ఇప్పటివరకు తమన్నా నటించిన చాలావరకు సినిమాలు కమర్షియల్ సినిమాలే. అందులో చాలావరకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించలేదు. అలాంటి తమన్నా ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయడం, అందులో తను నాగ సాధువు పాత్రలో కనిపించడం అంటే ప్రేక్షకులను విపరీతంగా ఆశ్చర్యపరిచింది. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమాకు జోరుగా ప్రమోషన్స్ సాగుతున్నాయి. ఇక ఈ మూవీకి కథ, మాటలు అందించిన సంపత్ నంది సైతం ప్రమోషన్స్‌లో పాల్గొంటూ ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు.
చాలా ట్రై చేశాం
తాజాగా ‘ఓదెల 2’ ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సంపత్ నంది ఎక్కువగా తమన్నా గురించే మాట్లాడాడు. ‘‘ఇందులో తమన్నా ఒక అతీత శక్తులు ఉండే ఒక నాగ సాధువు పాత్రలో నటించింది. ముందుగా మేము తనతో మూడు లుక్స్ ట్రై చేశాం. కానీ అందులో తమన్నా చాలా తెల్లగా కనిపించింది. కానీ నాగ సాధువులు ఎప్పుడూ ఎండలోనే తిరుగుతారు కాబట్టి వాళ్ల చర్మం ట్యాన్ అయిపోతుంది. అందుకే స్కిన్ టోన్ వేరేలా ఉంటుంది. అలా తమన్నాకు ఎన్ని రకాల మేకప్ ట్రై చేసినా రియలిస్టిక్ ఫీల్ మాత్రం రాలేదు. కానీ నాగ సాధువుల్లో ఫారినర్స్ కూడా ఉంటారు. తమన్నా ఎండలో తిరిగిన ప్రతీసారి తన మొహం పింక్ అయిపోతుంది’’ అని తమన్నాకు నాగ సాధవు లుక్ కోసం ఎంత కష్టపడ్డారో బయటపెట్టాడు సంపత్ నంది.
దానికోసమే కష్టాలు
‘‘తమన్నా (Tamannaah)కు ఏ మేకప్ లేకుండా ఉంచాలని అప్పుడే డిసైడ్ అయ్యాం. నేను ఇదే విషయాన్ని డిజైనర్ నీతూ లుల్లాకు చెప్పాను. కొన్ని కాస్ట్యూమ్స్‌ను రిఫరెన్స్‌లాగా పంపించాను. తను కొన్ని డిజైన్స్ పంపించింది. అన్నీ సెట్ చేశాక ప్రస్తుతం మీరు సినిమాలో చూస్తున్న తమన్నా లుక్ వచ్చింది. ఈ లుక్ రావడానికి చాలా సమయం పట్టింది. దానికోసం మేము చాలా కేర్ తీసుకున్నాం. ఈ సినిమా కోసం తమన్నా పూర్తిగా వెజిటేరియన్‌గా మారిపోయింది. తను ఒక ఆధ్యాత్మిక జర్నిలో ఉండడం వల్లే ఇలాంటి పాత్రను తను ఈజీగా చేయగలిగింది. తను ఈ పాత్ర చాలా ఈజీగా చేసేసింది’’ అంటూ ‘ఓదెల 2’ (Odela 2)లో తమన్నా పర్ఫార్మెన్స్ గురించి ప్రశంసించాడు సంపత్ నంది (Sampath Nandi).
Also Read: తమన్నాపై పవన్‌కు యూట్యూబర్ అన్వేష్ ఫిర్యాదు.. ప్రాణాలు తీసేస్తున్నారంటూ..
గ్రాఫిక్సే హైలెట్
‘ఓదెల 2’ సినిమాలో అదిరిపోయే గ్రాఫిక్స్ కూడా ఉంటాయని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ఇప్పటికే మూవీ టీమ్ అంతా ఈ గ్రాఫిక్స్ చాలా బాగా వచ్చాయని నమ్మకంతో ఉంది. గత ఆరు నెలల నుండి దాదాపు 150 వీఎఫ్ఎక్స్ ఎక్స్‌పర్ట్స్ ఈ సినిమాపై వర్క్ చేస్తున్నారని మేకర్స్ బయటపెట్టారు. అశోక్ తేజ ‘ఓదెల 2’ను డైరెక్ట్ చేయగా కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించాడు సంపత్ నంది. ఇందులో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా వశిష్ట సింహా విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది. తమన్నా హీరోయిన్ అవ్వడం వల్ల ఈ మూవీపై ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ ఏర్పడింది.