Shankar: సినీ ప్రపంచంలో పనిచేసే ప్రతీ ఒక్కరికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఎంత పెద్ద దర్శకుడు అయినా, ఎంత స్టార్ హీరో అయినా వారికంటూ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం అన్నీ సెట్ అయ్యేవరకు ఇతర సినిమాల మీద దృష్టిపెడతారు. తమిళ దర్శకుడు శంకర్ కూడా అంతే. శంకర్ ఖాతాలో ఇప్పటికీ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి. కానీ గత కొన్నేళ్లలో శంకర్ ఫామ్‌లో లేడు. ఆయన ఎంత భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కించినా అది నష్టాల్లోకే వెళ్లిపోతుంది. అలాంటిది తాజాగా శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ప్రస్తావన తెరపైకి వచ్చింది. దానికోసం ఆల్రెడీ హీరోను కూడా ఫైనల్ చేశాడట ఈ స్టార్ డైరెక్టర్.
డ్రీమ్ ప్రాజెక్ట్
ప్రస్తుతం శంకర్.. రామ్ చరణ్‌తో తెరకెక్కించిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) రిలీజ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ దాదాపుగా గత మూడేళ్ల నుండి సాగుతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో మూవీ వస్తుందని ప్రకటించి మూడేళ్ల దాటిపోయింది. ‘గేమ్ ఛేంజర్’ ప్రారంభించి కొన్నిరోజులు షూటింగ్ పూర్తయిన తర్వాత ‘ఇండియన్ 2’కు షిఫ్ట్ అయ్యాడు శంకర్. అలా ఈ సినిమా పక్కకు వెళ్లిపోయింది. ఆ సమయంలో రామ్ చరణ్ కూడా ఇతర సినిమాలు ఏవీ ఒప్పుకోకుండా ఎదురుచూశాడు. అయినా ‘గేమ్ ఛేంజర్’ విడుదల అవుతుందని ఫ్యాన్స్‌లో నమ్మకం పోయింది. ఫైనల్‌గా ఈ మూవీ విడుదల అవుతున్న సమయంలో శంకర్ (Shankar) డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.
Also Read: ‘రాజా సాబ్’ తర్వాత మరో స్టార్ హీరోతో మారుతి సినిమా.. ఇది పక్కా ప్లానింగ్ గురూ.!
స్క్రిప్ట్ సిద్ధం
తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి శంకర్ చాలాకాలం క్రితమే రివీల్ చేశాడు. తను ‘వేల్ పరి’ అనే సినిమాను తెరకెక్కించడమే కలగా పెట్టుకున్నానని రివీల్ చేశాడు. వేల్ పరీ అనేది ఒక యుద్ధ వీరుడి కథ. తమిళనాడులో నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కే సినిమానే ‘వేల్ పరి’ (Vel Pari). తాజాగా ‘గేమ్ ఛేంజర్’ ప్రమోషన్స్‌లో ‘వేల్ పరి’ గురించి అప్డేట్ అందించాడు శంకర్. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ముగిసిందని తెలిపాడు. తను ఎవరైనా అందమైన హీరోను చూసిన ప్రతీసారి తన డ్రీమ్ ప్రాజెక్ట్‌లో వారే హీరో అయితే ఎలా ఉంటుందని ఆలోచిస్తానని అన్నాడు. అలా చాలామంది పేర్లు నోట్ చేసి పెట్టుకున్నానని బయటపెట్టాడు.
హీరో ఒప్పుకుంటాడా
‘వేల్ పరి’లో సూర్యను హీరోగా తీసుకుంటే బాగుంటుందని శంకర్ అనుకుంటున్నట్టు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ‘కంగువా’ అనే మూవీతో ఎదురుదెబ్బ తిన్నాడు సూర్య. అందుకే ఒకవేళ ‘వేల్ పరి’ కోసం తనను అప్రోచ్ అయినా కూడా సూర్య ఒప్పుకుంటాడనే నమ్మకం చాలామంది ప్రేక్షకులకు లేదు. అంతే కాకుండా ‘గేమ్ ఛేంజర్’ హిట్ అయితేనే ‘వేల్ పరి’కి బడ్జెట్ ఇవ్వడానికి నిర్మాతలు ముందుకొస్తారు. ఒకవేళ అది కాస్త అటు ఇటు అయినా తన డ్రీమ్ ప్రాజెక్ట్.. డ్రీమ్‌గానే మిగిలిపోయే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ తర్వాత ‘ఇండియన్ 3’పై దృష్టిపెట్టనున్నాడు శంకర్.