BigTV English

7/G Brindavan Colony 2: అనితా.. నేను మళ్లీ వస్తున్నా అనితా.. పోస్టర్ తోనే పిచ్చెక్కించారుగా

7/G Brindavan Colony 2: అనితా.. నేను మళ్లీ వస్తున్నా అనితా.. పోస్టర్ తోనే పిచ్చెక్కించారుగా

7/G Brindavan Colony 2: కొన్ని సినిమాలు ప్రేక్షకులను థియేటర్ లోపలే వదిలేస్తాయి.. కానీ, కొన్ని సినిమాలు మాత్రం థియేటర్ నుంచి బయటకు వచ్చినా.. వెంటాడుతూనే ఉంటాయి. ఆ సినిమాలోని హీరోలో మనల్ని మనం ఊహించుకుంటాం. అరెరే ఎందుకు ఆ హీరోకే అలా జరిగింది అంటూ ఆలోచిస్తూనే ఉంటాం. అదే ఎమోషన్ అంటే. అలాంటి సినిమాలు చాలా రేర్ గా వస్తూ ఉంటాయి.


7/G బృందావన్ కాలనీ అలాంటి సినిమాలలోఒకటి. మొదట ఆ సినిమా చూసి.. ఛీఛీ ఏం సినిమారా.. ఇంత చెత్తగా ఉంది అనుకున్నారు. కానీ, ఉన్నాకొద్దీ ఆ సినిమాలోని హీరో పాత్రకు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. కన్నుల బాసలు తెలియవులే అనే సాంగ్.. ఇప్పటికీ బ్రేకప్ అయిన అబ్బాయిలు వినే అబ్బాయిల ప్లే లిస్ట్ లో  మొదటి వరుసలో ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్య లేదు.

Srikanth Odela: వింటేజ్ చిరంజీవిని చూపించను.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన శ్రీకాంత్ ఓదెల


నిర్మాత AM రత్నం రెండో కొడుకు రవి కృష్ణ హీరోగా పరిచయమైన సినిమా  7/G బృందావన్ కాలనీ. ధనుష్ అన్న సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సోనియా అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. 2004 లో ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.

7/G బృందావన్ కాలనీలో ఉండే రవి ఒక జులాయి. తండ్రి మాట వినకుండా.. తినడం, తిరగడం, అమ్మాయిల వెంటపడడం ఇదే అతని దినచర్య. నిత్యం తండ్రితో దెబ్బలు తింటూ కెరీర్ మీద ఫోకస్ లేకుండా ఉంటాడు. ఇక ఆ కాలనీకే అనితా అనే ఒక మార్వాడీ అమ్మాయి వస్తుంది. మొదటి చూపులోనే అనిత ప్రేమలో పడిపోతాడు రవి. మొదట అతడిని ఛీ కొట్టినా.. ఆ తరువాత అనిత కూడా అతడిని ప్రేమిస్తుంది. అతడిలోని టాలెంట్ ను గుర్తించి ప్రయోజకుడిని చేస్తుంది. ఇక ఇంట్లో వీరి ప్రేమ గురించి తెలిసి పెద్ద గొడవ అవుతుంది. దీంతో ఇద్దరు బయటకు వెళ్లి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఇంతలోనే అనిత ఒక యాక్సిడెంట్ లో మరణిస్తుంది. అనిత చనిపోయిందని తెలిసినా.. దాన్ని ఒప్పుకోలేకపోతాడు రవి. ఆమె పక్కన ఉన్నట్లే ఊహించుకొని బతుకుతూ ఉంటాడు. అలానే సినిమా ముగుస్తుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రెడీ చేశాడు సెల్వరాఘవన్.

Anasuya: ఛీఛీ.. సిగ్గుగా అనిపించడం లేదా.. ఇద్దరు పిల్లల తల్లి అయ్యి ఉండి అలా చూపించడానికి.. ?

రవికృష్ణనే హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక జయరామ్, సుమన్ శెట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక నేడు కొత్త సంవత్సరం పురస్కరించుకొని  ఈ సినిమాలోని ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. రోడ్డుపై రవి, అనస్వర బ్యాగులు పట్టుకొని నడుస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. అనితను మర్చిపోయాకా.. రవి జీవితంలోకి వేరే అమ్మాయి వచ్చినట్లు ఈ కథ ఉండబోతుందట. మరి అనిత కూడా ఈ సినిమాలో ఉంటుందా.. ? లేదా.. ?అనేది  తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఈ సినిమాతో రవికృష్ణ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

×