Betting Apps: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌పై, వాటిని ప్రమోట్ చేస్తున్నవారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని అధికారులు నిర్ణయించుకున్నారు. అందుకే వాటిని ప్రమోట్ చేసిన 11 మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్‌పై కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడం వల్ల ఇంత జరుగుతుందని తెలియక కేసు నమోదు అవ్వగానే చాలామంది షాక్‌లో ఉన్నారు. అంతే కాకుండా విచారణకు రమ్మన్నా కూడా కొందరు డుమ్మా కొట్టారు. ఈ విషయంపై ఆర్జే, బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ భాషా స్పందించాడు. మీడియా ముందుకు వచ్చిన శేఖర్ భాషా చాలావరకు ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను సపోర్ట్ చేసినట్టుగానే మాట్లాడాడు.
ప్రమోట్ చేశారు
‘‘ఇందులో బిగ్ బాస్‌లో నా బ్యాచ్‌మేట్స్ కూడా ఉన్నారు. ఇదంతా జరగగానే వాళ్లకు వెంటనే ఫోన్ చేసి ఏంటి పరిస్థితి అని కనుక్కున్నాను. వాళ్లకు ఏం జరుగుతుందో తెలియదు. గట్టిగా చెప్పాలంటే ఎఫ్‌ఐఆర్ అంటే ఏంటో కూడా తెలియదు. ఒకటిన్నర సంవత్సరం క్రితం ఎప్పుడో ఆ యాప్స్‌ను ప్రమోట్ చేశారు. ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకొని ఎవరో కావాలని కేసు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఎప్పుడు చేసినా ప్రమోట్ చేసినట్టే. ఈ బెట్టింగ్ యాప్స్‌ను ఇంకెవ్వరూ ప్రమోట్ చేయకండి అంటూ అవగాహన వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. నేరుగా వచ్చి నోటీసులు తీసుకొని వారికి సమాచారం అందించారు. జీవితంలో మొదటిసారి ఇలా కేసు నమోదు అవ్వడంతో వాళ్లు భయపడుతున్నారు’’ అంటూ విషయాన్ని చాలా సింపుల్‌గా మాట్లాడేశాడు శేఖర్ భాషా.
తెలిసీ తెలియక చేశారు
‘‘బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత అప్పటికే వీరికి చాలా ఫేమ్ ఉంటుంది కాబట్టి బ్రాండ్ ప్రమోషన్స్ కోసం చాలామంది అప్రోచ్ అవుతుంటారు. అదే సమయంలో బెట్టింగ్ యాప్స్ గురించి కూడా అప్రోచ్ అయ్యింటారు. కానీ వీళ్లకు ఏది లీగల్, ఏది కాదు అని కూడా తెలియదు. నిన్న మా బిగ్ బాస్ గ్రూప్‌లోనే దీని గురించి డిస్కషన్ జరిగింది. ఇప్పటినుండి బెట్టింగ్ యాప్స్ అస్సలు ప్రమోట్ చేయకూడదని డిసైడ్ అయ్యారు. బిగ్ బాస్ నుండి ఎవరూ ఇప్పటినుండి ఈ ప్రమోషన్స్ చేయరు. తెలిసి, తెలియక తప్పు చేస్తే పర్వాలేదు. తెలిసి పదేపదే చేస్తున్నారంటే అది కరెక్ట్ కాదు. ఏ యాప్‌ను ప్రమోట్ చేశారో ఎఫ్ఐఆర్‌లో లేదు’’ అని చెప్పుకొచ్చాడు శేఖర్ భాషా.
Also Read: వాళ్లని కిందేసి తొక్కితే కలుగులోని ఎలుక బయటికి వస్తుంది.. చీకోటి ప్రవీణ్ షాకింగ్ కామెంట్స్..!
వాళ్ల తరపున హాజరు
మొత్తానికి బెట్టింగ్ యాప్స్ (Betting Apps) కేసులో సాయంత్రం 4 గంటలకు విచారణకు రమ్మని పలువురు ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కు నోటీసులు జారీ చేశారు పోలీసులు. అందులో విష్ణుప్రియా, టేస్టీ తేజ మాత్రం హాజరు కాలేదు. వాళ్లిద్దరి తరపున శేఖర్ భాషా (Shekar Basha) రంగంలోకి దిగాడు. వాళ్లిద్దరూ హాజరు కావడానికి మరో 3 రోజులు సమయం కోరగా దానికి పోలీసులు అంగీకరించారని చెప్పుకొచ్చాడు శేఖర్ భాషా. పోలీసులు ఇచ్చిన గడువులో కచ్చితంగా అందరూ విచారణకు హాజరవుతారని హామీ ఇచ్చాడు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదని, కానీ వారు ప్రమోట్ చేసిన విషయం వారికే గుర్తులేదని వారిని సమర్ధించాడు శేఖర్ భాషా.
బెట్టింగ్ యాప్ విషయంలో వాళ్లు తెలియకే ప్రమోట్ చేశారు: శేఖర్ బాషా
విష్ణుప్రియకు కనీసం FIR అంటే ఏంటో కూడా తెలియదు
తప్పు తెలిశాక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయమని వీడియోలు కూడా రిలీజ్ చేశారు
ఇది వాళ్లకు పూర్తిగా కొత్త.. భయపడుతున్నారు
– శేఖర్ బాషా pic.twitter.com/cEDHJV4P4y
— BIG TV Breaking News (@bigtvtelugu) March 18, 2025