Shilpa Shetty : బాలీవుడ్ నటి శిల్పాశెట్టి (Shilpa Shetty) ఇటీవల భువనేశ్వర్‌లోని లింగరాజ్ ఆలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఆ ఆలయాన్ని సందర్శించడం కొత్త వివాదానికి తెర తీసింది. ఆలయంలో అలాంటి పనులు ఎలా చేస్తారు? అంటూ మండిపడుతున్నారు హిందూవాదులు. అసలు ఆ టెంపుల్ లో శిల్పా శెట్టి ఏం చేసింది అనే వివరాల్లోకి వెళ్తే..
రీసెంట్ గా భువనేశ్వర్‌లోని లింగరాజ్ ఆలయాన్ని సందర్శించింది శిల్పా శెట్టి (Shilpa Shetty). ఈ సందర్భంగా నిషేధిత ప్రాంతాల్లో తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. శిల్పా ఆలయం లోపల దిగిన చిత్రాలను పంచుకున్న తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఫోటోగ్రఫీ యాక్సెస్ నిషేధించబడిన ఆలయ విధానాలను ప్రశ్నిస్తూ కామెంట్స్ చేస్తున్నారు
నటి శిల్పాశెట్టి (Shilpa Shetty) సందర్శన సమయంలో 11వ శతాబ్దపు మందిరంలో మొబైల్ ఫోన్ తీసుకెళ్లినందుకు నీతి సూపర్‌వైజర్ రాజ్ కిషోర్ మహాపాత్రకు లింగరాజ్ ఆలయ నిర్వాహకులు మంగళవారం షోకాజ్ నోటీసు జారీ చేశారు. సోమవారం సాయంత్రం సందర్శించిన శిల్పాకు మహాపాత్ర మందిరం, దాని వివిధ ఆచారాల వివరాలను ఆయన వివరిస్తూ కనిపించారు.
ఆలయం లోపల మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై కఠినమైన నిషేధం ఉన్నప్పటికీ, శిల్పా శెట్టి (Shilpa Shetty) తన సందర్శనను రికార్డ్ చేయడం, తర్వాత తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో మందిరం చిత్రాలు, వీడియోను పోస్ట్ చేయడం విమర్శలకు దారి తీసింది. ముఖ్యంగా అక్కడ ఉన్న పోలీసులు, ఆలయ నిర్వహణ అధికారులు సెలబ్రిటీలకు ఒక రూల్, సాధారణ ప్రజలకు ఒక రూల్ పెడుతున్నారు. గర్భగుడితో సహా మందిరంలోకి మొబైల్ ఫోన్లను తీసుకురావడానికి వీఐపీలను ఎలా అనుమతించారు అంటూ మండి పడుతున్నారు నెటిజన్లు. దీనిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు నీతి సూపర్‌వైజర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. కాగా శిల్పాశెట్టి ఒక నగల షోరూమ్‌ను ప్రారంభించేందుకు భువనేశ్వర్ వెళ్ళి, ఆ తర్వాత ఆలయాన్ని సందర్శించారు.
అయితే సెలబ్రిటీలు ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు 2018లో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూడా లింగరాజ్ ఆలయ ప్రాంగణంలో ఒక యాడ్ కోసం ఫోటో షూట్ చేయద్యమం వివాదాస్పదమైంది. చాలా ఎదురుదెబ్బల తర్వాత షూట్‌కు అనుమతించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆలయ నిర్వాహకులు హామీ ఇచ్చారు. 11వ శతాబ్దానికి చెందిన ఈ శివాలయంలో మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడాన్ని బ్యాన్ చేశారు. అయితే సేవాయత్‌లు లేదా సేవకులు తమ ఫోన్ లను తీసుకెళ్లవచ్చు. ఫిబ్రవరి 2024లో ఒక డిజిటల్ క్రియేటర్ పూరీ జగన్నాథ ఆలయ ప్రాంగణంలో ఫోటోలు తీయడంపై కూడా భక్తులు ఇదే విధమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా మరోవైపు శిల్పా శెట్టి (Shilpa Shetty) పాష్ రెస్టారెంట్ లో ఒక కాస్ట్లీ దొంగతనం జరిగిన ఘటన ఈరోజు వెలుగులోకి వచ్చింది. దాదాపు 80 లక్షల విలువైన బిఎండబ్ల్యూ కారు అది. బాంద్రాకు చెందిన 34 ఏళ్ల వ్యాపారవేత్త రుహాన్ ఫిరోజ్ ఖాన్, తెల్లవారుజామున 1 గంటల సమయంలో ఇద్దరు స్నేహితులతో వచ్చి రెస్టారెంట్‌లో పని చేస్తున్న వాలెట్ పార్కింగ్ వ్యక్తికి తన కారు కీను అప్పగించారు. ఆ తరువాత కారు మాయం కావడంతో విషయంలో బయటకు వచ్చింది.