Rain Alert: ఈ సారి సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడంతో వాతావరణంలో చాలా మార్పులు జరిగాయి. ఎండాకాలంలో వర్షాలు, వర్షాకాలంలో ఎండలు అన్నట్లుగా అయ్యింది కాలం. అయితే ఈ సారి రైతులకు సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తూ ఆగమేఘాల మీద దూసుకొచ్చు వర్షాలను దంచికొడుతున్నాయి. అడవుల నరికివేత, యథేచ్ఛగా సాగుతున్న మానవ కార్యకలాపాలు, శిలాజ ఇంధనాల విచ్చలవిడి వినియోగం తదితరాలతో వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ సంభవించిన కారణంగానే రుతుపవనాలు ముందుగా వచ్చేశాయని ఎన్నో విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే ఏడాదికి మన దేశ సగటు వర్షపాతం 87 సెం.మీ. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా చూస్తే అంతకన్నా తక్కువగానే వర్షాలు ఉంటాయని అంచనా. ఐఎండీ మాత్రం సగటు కన్నా ఎక్కువ ఉండొచ్చని చెప్పింది.
రుతుపవనాల ముందు రాకతో కొద్ది రోజులు వర్షాలు కురిశాయి. ఈ వానలకు సముద్ర ఉష్ణోగ్రతలు తగ్గడంతో కురవాల్సిన వానలు ముఖం చాటేశాయి. అయితే ఈ నెల 50.4మి.మీ. వర్షపాతం నమోదు కావాలి. అటువంటిది 33.7 మి.మీ మాత్రమే కురిసింది. ఇది ఇలాగే కొనసాగితే దేశంలో కరవు పరిస్థితులు ఏర్పడటానికి అవకాశాలు అధికమవతాయి. వర్షాధార పంటలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. వాతావరణ మార్పుల కారణంగా తలెత్తే విపత్తులను కొన్నిసార్లు అంచనా వేయలేం. గంట వ్యవధిలోనే కుంభవృష్టితో అతలాకుతలం చేస్తాయి. తేమ వాతావరణం పర్వత ప్రాంతాలకు చేరుకుని ఒక్కసారిగా ప్రతాపం చూపుతాయి.
అయితే ఈ సారి ముందుగానే వర్షాలు రావడంతో ముందు ముందు కూడా వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నైరుతి రుతుపవనాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. కాని ఇలా ముందు వర్షాలు రావడం కొత్తేమి కాదని అంటున్నారు. అంతేకాకుండా కేరళ, మహారాష్ట్రకు వర్షాలు విస్తారంగా విస్తరించడం విశేషంని తెలిపారు. అయితే ఇలా వర్షాలు ముందుగా రావడం యాభై సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు రుతుపవనాలు ఒకేసారి విస్తరించాయి.
Also Read: ఎమ్మెల్యే గుమ్మనూరు ఫ్యామిలీ దందాలు!
ఈ సారి అరేబియన్ సముద్రం, బంగాళాఖాతం ఉపరితల వాతావరణంలో తేమ పెరిగి మే నెలలోనే మేఘాల అధిక ఆవిర్భావానికి దారితీసింది. కర్ణాటక, గోవా తారం వెంట ద్రోణి కారణంగా తుపాను పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవి ఈ సారి రుతుపవనాలను మరింత ముందుకు లాగాయి. అలాగే ఇప్పుడు కూడా గత కొద్ది రోజులలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్లకూడదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.