Siddharth About Karthi: భాషతో సంబంధం లేకుండా చాలామంది తమిళ హీరోలను అభిమానిస్తూ ఆదరిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. ఆ లిస్ట్‌లో ముందుగా సిద్ధార్థ్ ఉంటాడు. తను ఒక తమిళ హీరో అయినా కూడా నేరుగా తెలుగులో ఎన్నో గుర్తుండిపోయే సినిమాలు చేసి ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు. అలాగే కార్తీ కూడా ఆ లిస్ట్‌లో ప్రథమ స్థానంలోనే ఉంటాడు. తను ఎక్కువ స్ట్రెయిట్ తెలుగు సినిమాల్లో నటించకపోయినా కార్తీకి తెలుగులో ఫ్యాన్ బేస్ మాత్రం చాలానే ఉంది. తాజాగా సిద్ధార్థ్ అప్‌కమింగ్ మూవీ ‘మిస్ యూ’ తమిళ ట్రైలర్‌ను లాంచ్ చేశాడు కార్తీ. ఈ ఈవెంట్‌లో సిద్దార్థ్ (Siddharth), కార్తీ (Karthi) ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.
పాత స్నేహం
చాలాకాలం తర్వాత సిద్ధార్థ్ మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అయ్యాడు. అంతే కాకుండా తన కో స్టార్ అయిన అదితి రావు హైదరీని ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నాడు. అలా ఈ ఏడాది సిద్ధార్థ్‌కు బాగానే కలిసొచ్చింది. ఇక ఇన్నేళ్ల తర్వాత మరోసారి తనలోని లవర్ బాయ్‌తో ఆడియన్స్‌ను మెప్పించాలని సిద్ధమయ్యాడు సిద్ధు. అందుకోసమే ‘మిస్ యూ’ అనే ప్రేమకథతో థియేటర్లలో సందడి చేయనున్నాడు. తాజాగా ఈ సినిమాక సంబంధించిన ట్రైలర్‌ను కార్తీ చేతుల మీదుగా విడుదల చేయించారు మేకర్స్. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సిద్ధార్థ్, కార్తీ తమకు ఉన్నా పాత స్నేహాన్ని గుర్తుచేసుకున్నారు. పైగా కార్తీ హీరో అవ్వనని చెప్పి సిద్ధును ఎలా మోసం చేశాడో బయటపెట్టాడు.
Also Read: ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే మలయాళంలో మహిళలకు సేఫ్టీ తక్కువ.. సుహాసిని షాకింగ్ కామెంట్స్
చాలా టాలెంటెడ్
సిద్దార్థ్, మాధవన్, సూర్య కలిసి ‘ఆయుథ ఎరుతు’ అనే మూవీలో నటించారు. మణిరత్నం డైరెక్ట్ చేసిన ఈ మూవీకి కార్తీ అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో తాను అసలు ఎప్పటికీ యాక్టర్ అవ్వనని, తనకు డైరెక్షన్‌లోనే ఇంట్రెస్ట్ అని సిద్దార్థ్‌కు మాటిచ్చాడట కార్తీ. అలా కొన్ని సినిమాలకు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన తర్వాత అనూహ్యంగా తాను కూడా హీరో అయ్యాడు కార్తీ. ఇప్పుడు తమిళంతలో ప్రామిసింగ్ నటులలో తాను కూడా ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కార్తీ జర్నీని గుర్తుచేసుకుంటూ రోజులు ఎంత మారిపోయాయంటూ నవ్వుకున్నాడు సిద్దార్థ్. అంతే కాకుండా తను చాలా టాలెంటెడ్ అని ప్రశంసించాడు.
అందులో ఆసక్తి ఎక్కువ
‘ఆయుత ఎరుతు’ సినిమా సమయంలో సిద్ధార్థ్ తరచుగా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ పనుల్లో జోక్యం చేసుకునేవాడని గుర్తుచేసుకున్నాడు కార్తీ. తను యాక్టింగ్ కంటే ఎక్కువగా టెక్నికల్ విషయాలపైనే ఫోకస్ చేసేవాడట. మణిరత్నం కూడా సిద్ధార్థ్ ఆసక్తి చూసి నవ్వుకునేవారని గుర్తుచేసుకున్నాడు కార్తీ. అలా ‘మిస్ యూ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సిద్ధార్థ్, కార్తీ మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ ప్రేక్షకులను చాలా ఎంటర్‌టైన్ చేసింది. ఇక కార్తీ చివరిగా తన అన్నయ్య సూర్య హీరోగా నటించిన ‘కంగువా’లో గెస్ట్ రోల్‌లో కనిపించి అలరించాడు. సిద్ధార్థ్ తన ‘మిస్ యూ’ సినిమాతో నవంబర్ 29న థియేటర్లలో సందడి చేయనున్నాడు.