Rana Daggubati : ఇటీవల కమల్ హాసన్ నటించిన చిత్రం ‘ థగ్ లైఫ్ ‘.. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో తమిళ్ నుంచే కన్నడ పుట్టింది అని కమల్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఒక రాష్ట్రం మొత్తం ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టింది. ఆయన సినిమాను కన్నడలో బ్యాన్ చేస్తాం.. కమల్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ నిరసన సెగ మొదలైంది.. ఆయన నటించిన థగ్ లైఫ్ మూవీ పై కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్‌సీసీ) నిషేధం ప్రకటించింది. ఒకవైపు తనకు వ్యతిరేఖంగా నినాదాలు వినిపిస్తున్నా కూడా కమల్ వెనక్కి తగ్గకుండా కోర్టును ఆశ్రయించారు.. సినిమాను కన్నడలో రిలీజ్ చెయ్యాలని రిక్వెస్ట్ చేశాడు. కానీ అక్కడ కూడా కమల్ కు చుక్కదురైంది. ఇవన్నీ దాటుకొని ఇవాళ థియేటర్లలో సినిమా రిలీజ్ అయ్యింది.. అయితే ఈ వ్యవహారం హీరో రానా వద్దకు వచ్చింది.. ఆయన ఏమన్నారో అన్నది ఆసక్తిగా మారింది.
‘కన్నడ’ వివాదం పైస్పందించిన రానా..
టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి ప్రస్తుతం రానా నాయుడు -2 ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ వెబ్ సిరీస్ కు గతంలో మంచి రెస్పాన్స్ ను అందుకుంది. దాంతో ప్రస్తుతం రాబోతున్న సీజన్ 2 పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా రెండో సీజన్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో కమల్- కన్నడిగుల మధ్య రాజుకున్న వివాదం గురించి ప్రస్తావన వచ్చింది.. దీనిపై స్పందించిన రానా మాట్లాడుతూ.. ఒకప్పుడు సోషల్ మీడియాను ప్రమోషన్స్ కోసం వాడేవారు. కానీ ఇప్పుడు మాత్రం తమ అభిప్రాయాలను పంచుకోవడం కోసం వాడుతున్నారు. మొదట్లో ఇలాంటి మాధ్యమాలన్నీ ఏం లేవు. ఇప్పుడు ఏది మాట్లాడినా వివాదాస్పదమవుతోంది. ఇటీవల ప్రతీది రాజకీయం చేస్తున్నారు అన్నాడు. ఏది మాట్లాడిన బూతులే అవుతున్నాయని రానా అన్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. ఇక రానా నాయుడు -2 నటించిన ఈ నెల 13 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రాబోతుంది.
Also Read : ‘థగ్ లైఫ్ ‘ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
‘థగ్ లైఫ్ ‘ మూవీ ఎలా ఉందంటే..?
కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో 37 ఏళ్ల తర్వాత వచ్చిన మూవీ ‘థగ్ లైఫ్ ‘.. ఒకవైపు వివాదాలు చుట్టిముట్టిన ఇవాళ థియేటర్లలోకి వచ్చేసింది. సినిమాపై ఉన్న అంచనాలతో పోలిస్తే కాస్త మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. కమల్ హాసన్ – మణిరత్నం కాంబినేషన్లో తెరకెక్కిన సినిమాకు కావడంతో అంచనాలు మామూలుగా లేవు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.. థియేట్రికల్ రిలీజ్‌తో వచ్చేది మొత్తం లాభాలే కానున్నాయి. రిలీజ్‌కు ముందే థగ్ లైఫ్ మంచి లాభాలు తెచ్చి పెట్టడంతో మేకర్స్ ఫుల్ గా ఉన్నారు. ఓవరాల్ గా కమల్‌కు కావాల్సినంత మనీ రిలీజ్ కు ముందే వచ్చేసింది. మొదటి రోజు ఓపెనింగ్స్ బాగానే జరిగిందని తెలుస్తుంది. మరి కలెక్షన్స్ పరిస్థితి ఏంటో చూడాలి.. ఈ మూవీలో శింబు – త్రిష తదితరులు ముఖ్య పాత్రలలో నటించగా ఏ ఆర్ . రెహమాన్ సంగీతం అందించారు..