BigTV English

Sree Vishnu’s Swag : స్వాగ్ కూడా స్వాహా నేనా… అన్ని వేషాలు వేసినా లాభం లేదా ?

Sree Vishnu’s Swag : స్వాగ్ కూడా స్వాహా నేనా… అన్ని వేషాలు వేసినా లాభం లేదా ?

Sree Vishnu’s Swag : టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి రెడీ అవుతున్నాడు. స్వాగ్ అనే ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ తో త్వరలోనే థియేటర్లలోకి రాబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే స్వాగ్ మూవీ బిజినెస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. అదేంటో ఓ లుక్కేద్దాం పదండి.


స్వాగ్ మూవీకి రిలీజ్ కి ముందే కష్టాలు

హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న తాజా కామెడీ ఎంటర్టైన స్వాగ్. ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్ గా, నటిస్తుండగా దక్షా నగార్కర్, మీరా జాస్మిన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రీసెంట్ గా స్వాగ్ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ కాగా, అందులో మహిళలు ఆధిపత్యం చెలాయించే ఓ రాజ్యంలో కథ మొదలు కావడం, మగాళ్లను తొక్కేసే ఆ రాజ్యానికి మహారాణిలా రీతు వర్మ పరిచయం కావడం క్రేజీగా అనిపించింది. కానీ ఆ తర్వాత శ్రీ విష్ణు రకరకాల గెటప్స్ లఓ ఎంట్రీ ఇవ్వడం, డైలాగ్స్ చెప్పడం.. మధ్య మధ్యలో సునీల్, రవిబాబు రావడం మరింత ఇంట్రెస్టింగ్ గా అన్పించింది. అయితే టీజర్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్రీ విష్ణు గురించి. ఆయన రకరకాల గెటప్స్ లో రాజుగా, కోయదొర సింగగా, భవభూతి అనే పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నాడు. అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ మూవీ బిజినెస్ ఏ మాత్రం బాగా జరగట్లేదు అనేది తాజాగా వినిపిస్తున్న టాక్. సాధారణంగా శ్రీ విష్ణు అంటే కింగ్ ఆఫ్ ది కంటెంట్ అంటారు.. ఈ విషయం ఇప్పటిదాకా ఆయన చేసిన సినిమాలతో ప్రూవ్ అయింది కూడా. ఇక ఇప్పుడు స్వాగ్ సినిమాలో శ్రీ విష్ణు చాలా పాత్రల్లో కనిపించబోతున్నా ఈ మూవీకి బిజినెస్ జరగట్లేదు అనే వార్తలు వినిపించడంతో ఈ మూవీ కూడా స్వాహానా అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.


Swag: శ్రీ విష్ణు 'శ్వాగ్' విడుదల ఎప్పుడంటే.. | Sree Vishnu Starring Swag  Movie Release Date Announced KBK

అన్ని వేషాలు వేసినా లాభం లేదా ?

అక్టోబర్ 6న స్వాగ్ మూవీ థియేటర్లలోకి రాబోతోంది. మూవీ రిలీజ్ కి పట్టుమని నెల రోజులు కూడా లేదు. మరి ఏం జరుగుతోందో తెలియదు కానీ స్వాగ్ మూవీకి బిజినెస్ జరగకపోవడం అన్నది నిర్మాతలను టెన్షన్ పెట్టే విషయమే. మరి స్వాగ్ మూవీ బిజినెస్ విషయంలో మేకర్స్ ఏం నిర్ణయం తీసుకోకున్నారో చూడాలి. కాగా శ్రీ విష్ణు హీరోగా నటించిన గత చిత్రం ఓం భీమ్ బుష్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు రాజరాజ చోరా అనే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ హసిత్ గొలీతో చేస్తున్న స్వాగ్ మూవీపైనే ఆశాలన్నీ పెట్టుకున్నాడు శ్రీవిష్ణు. అయితే అంతకంటే ముందు శ్రీవిష్ణు చేసిన సామజవరగమన, అల్లూరి, భళా తందనాన, అర్జున ఫాల్గుణ వంటి సినిమాలన్నీ బెడిసి కొట్టాయి. ఇదే ఇప్పుడు స్వాగ్ మూవీకి బిజినెస్ జరగకపోవడానికి కారణం అని కూడా అంటున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×