Kanchana: ఈరోజుల్లో కాలేజ్‌లో, స్కూల్స్‌లో చేసే స్టేజ్ పర్ఫార్మెన్స్‌లు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. అందుకే అలా ట్రెండ్ అవ్వడం కోసం కూడా పర్ఫార్మెన్స్‌లు ప్లాన్ చేస్తున్నారు స్టూడెంట్స్. కేవలం పాటలకు పర్ఫార్మెన్స్‌లు చేయడంతో పాటు సీన్స్ కూడా రీక్రియేట్ చేస్తున్నారు. అలా ఇటీవల ఒక కాలేజ్‌లో స్టూడెంట్స్‌లో ‘సలార్’ మూవీలో ఫైట్ సీన్‌ను రీక్రియేట్ చేశారు. అది నేచురల్‌గా రావడం కోసం దెబ్బలు కూడా తగిలించుకున్నారు. దీంతో ఒక్కసారిగా దానిగురించి సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలయ్యింది. తాజాగా ‘కాంచన’ సినిమాకు సంబంధించిన పాటను కూడా అలాగే రీక్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రయత్నం చేశారు. నిజంగానే వైరల్ అయ్యారు కూడా.
నేచురల్ రీక్రియేషన్
‘కాంచన’ సినిమాలో ట్రాన్స్‌జెండర్ పాత్రలో రాఘవ లారెన్స్ కనిపించడం, క్లైమాక్స్‌లో ఆ టైటిల్ సాంగ్.. ఇవన్నీ అప్పట్లో ప్రేక్షకులను ఓ రేంజ్‌లో భయపెట్టాయి. అలా రాఘవ లారెన్స్ తెరకెక్కించే హారర్ సినిమాలు కూడా అందరికీ చాలా నచ్చేసి బ్లాక్‌బస్టర్ హిట్లు అయ్యాయి. ఆ తర్వాత ‘కాంచన’ ఫ్రాంచైజ్‌లో ఎన్ని సినిమాలు, ఎన్ని పాటలు వచ్చినా ఆ పాట మాత్రం ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోయింది. అలాంటి పాటకు ఇప్పటికే ఎంతోమంది స్టేజ్ పర్ఫార్మెన్స్‌లు ఇచ్చారు. సేమ్ అదే గెటప్‌లో రీక్రియేట్ చేయాలని చూశారు. కానీ తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో మాత్రం ‘కాంచన’ పాటను రీక్రియేట్ చేయడం కోసం స్టూడెంట్స్ కాస్త ఎక్కువే చేశారు.
యాక్షన్ తీసుకోవాల్సిందే
‘కాంచన’ (Kanchana) పాటను స్టేజ్‌పై రీక్రియేట్ చేసే క్రమంలో ఒక కోడి మెడను కొరికాడు ఓ స్టూడెంట్. ఆ మెడను మొత్తం కొరికి పక్కన పడేయడంతో అది చూసిన వారంతా షాకవుతున్నారు. అసలు అలా ఎలా చేయగలిగారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈరోజుల్లో వైరల్ అవ్వడం కోసం ఎవరైనా ఏదైనా చేసేస్తున్నారని, అందుకే వీళ్లు కూడా ఇలా చేసుంటారని భావిస్తున్నారు. మొత్తానికి ఇది ఏ ప్రాంతం, ఈ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎవరు చేశారు లాంటి వివరాలు బయటికి రాకపోయినా ఈ స్టేజ్ పర్ఫార్మెన్స్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరికొందరు మాత్రం ఇలా చేయడంతో వేరే వాళ్లు కూడా ప్రభావితం అవుతారని, వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఫైర్ అవుతున్నారు.
Also Read: ఘనంగా ‘పుష్ప’ నటుడి పెళ్లి.. మైసూరులో ఘనంగా వివాహ వేడుకలు
ఫ్రాంచైజ్‌తో హిట్లు
రాఘవ లారెన్స్ తన కెరీర్‌లో ఎన్నో హారర్ సినిమాలు చేశాడు. అసలైతే తను కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఆ తర్వాతే మెల్లగా స్క్రీన్‌పై కనిపించడం మొదలుపెట్టాడు. అలా తనకు సినిమాల్లో నటుడిగా కూడా అవకాశం దక్కింది. ‘స్టైల్’ సినిమాతో తనకు కొరియోగ్రాఫర్‌గా మాత్రమే కాకుండా హీరోగా కూడా గుర్తింపు లభించింది. కానీ దాని వల్ల తనకు వరుసగా అవకాశాలు ఏమీ రాలేదు. ‘ముని’ అనే హారర్ మూవీతో తన లైఫ్ టర్న్ అయిపోయింది. అప్పటివరకు తెలుగు, తమిళంలో అసలు అలాంటి హారర్ మూవీ రాలేదని ప్రేక్షకులు కాస్త షాకయ్యారు. అందుకే దాని తర్వాత అదే ఫ్లోలో కొన్ని హారర్ సినిమాలతో బ్లాక్‌బస్టర్ కొట్టాడు రాఘవ లారెన్స్.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">