Nishadh Yusuf: సినీ సెలబ్రిటీలు అంతా పైకి సంతోషంగా కనిపించడంతో వారి లైఫ్ కూడా అలాగే సంతోషంగా ఉంటుందని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ అది అన్ని సందర్భాల్లో నిజం కాకపోవచ్చు. తాజాగా ‘కంగువ’ ఎడిటర్ నిషాద్ యూసఫ్ మరణవార్త చూస్తుంటే అదే అనిపిస్తోంది. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే ‘కంగువ’. ప్యాన్ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన ఎడిటింగ్ బాధ్యతలను నిషాద్ యూసఫ్ (Nishadh Yusuf)కు అప్పగించారు. ఇక ఈ మూవీ త్వరలోనే విడుదల కానుండగా తన అపార్ట్మెంట్‌లో అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు నిషాద్.
సూర్య స్పందన
తెలుగులో ‘బాహూబలి’ లాంటి సినిమా తెరకెక్కడం వల్లే టాలీవుడ్ రేంజ్ మారిపోయింది. అలాంటి మూవీ కోలీవుడ్‌కు కూడా కావాలి. అందుకే తమిళ మేకర్స్ ఎంతోకాలంగా ఇలాంటి ఒక సినిమాను తెరకెక్కించడానికి కష్టపడుతున్నారు. ఇప్పుడు ‘కంగువ’ (Kanguva)తో ఎలాగైనా ఆ రికార్డ్ బద్దలగొట్టాలని అనుకుంటున్నారు. అందుకే ఎంత బడ్జెట్ అయినా వెనకాడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా పలుమార్లు విడుదలను పోస్ట్‌పోన్ చేసుకుంది. ఫైనల్‌గా నవంబర్ 14న ‘కంగువ’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడంతో మూవీ టీమ్ అంతా ప్రమోషన్స్‌లో బిజీ అయ్యారు. ఇదే సమయంలో నిషాద్ యూసఫ్ మరణవార్త బయటికొచ్చింది. దీనిపై సూర్య సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
Also Read: నటుడు దర్శన్ కి బెయిల్ మంజూరు.. బయటకు వచ్చాక చేసే మొదటి పని అదే..?
ఎప్పటికీ గుర్తుండిపోతావు
‘నిషాద్ ఇక లేడని వినగానే గుండె బద్దలయ్యింది. కంగువ టీమ్‌లో నువ్వొక ముఖ్యమైన వ్యక్తిగా ఎప్పటికీ గుర్తుండిపోతావు. మా ఆలోచనల్లో కూడా నిలిచిపోతావు. నిషాద్ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు సూర్య (Suriya). ప్రస్తుతం ‘కంగువ’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న మూవీ టీమ్‌కు ఇదొక తీరని లోటు అనే చెప్పాలి. ఇప్పటికే విడుదలయిన టీజర్స్ చూస్తుంటే ఈ సినిమా టైమ్ ట్రావెలింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిందేమో అన్న సందేహం వస్తుంది. ఇలాంటి టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్‌కు ఎడిటింగే కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి తన ఎడిటింగ్‌ను ప్రేక్షకులు ప్రశసించడం చూడకుండానే నిషాద్ మరణించడం బాధాకరం.
మమ్ముట్టికి క్లోజ్
నిషాద్ యూసఫ్.. తమళం కంటే ఎక్కువగా మలయాళ చిత్రాలకే ఎడిటర్‌గా పనిచేశాడు. ముఖ్యంగా మమ్ముట్టి (Mammotty) హీరోగా నటించిన ఎన్నో సినిమాలకు నిషాదే ఎడిటర్ కావడం విశేషం. ఇప్పుడు కూడా తన చేతిలో ‘కంగువ’తో పాటు మమ్ముట్టి హీరోగా నటిస్తున్న ‘బజూకా’ (Bazooka) కూడా ఉంది. తన కెరీర్ సాఫీగా సాగిపోతున్న సమయంలోనే నిషాద్ మరణాన్నికేరళ ఫిలిమ్ ఫెడరేషన్ తట్టుకోలేకపోతోంది. తన మృతికి సంతాపం తెలియజేసింది. కొచ్చిలోని పనంపిల్లి నగర్‌లో నిషాద్‌కు అపార్ట్మెంట్ ఉంది. అక్కడే అర్థరాత్రి రెండు గంటలకు తన మృతదేహం లభించింది. ఈ మృతికి గల కారణాలు ఏంటని ఇంకా తెలియాల్సి ఉంది. నిషాద్ మరణం తీరని లోటు అని మాలీవుడ్ భావిస్తోంది.
Heartbroken to hear Nishadh is no more! You’ll always be remembered as a quiet and important person of team Kanguva.. In our thoughts and prayers..! My heartfelt condolences to Nishadh’s family & friends. RIP pic.twitter.com/ClAI024sUe
— Suriya Sivakumar (@Suriya_offl) October 30, 2024