Tejashwini Gowda: బుల్లితెర నటి తేజస్విని మోడలింగ్ తో తన కెరీర్ ను ప్రారంభించింది. 2016లో కోయిలమ్మ సీరియల్ లో చిన్ని పాత్రలో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. కన్నడ సీరియల్ “బిలి హెంద్తి” తమిళ సీరియల్ “సుందరి నీయుమ్ సుందరన్ నానుమ్”లోను నటించింది. బుల్లితెరపై కనిపించే రియల్ లైఫ్ జంటల్లో అమరదీప్ తేజస్విని క్యూట్ పెయిర్. సీరియల్ ద్వారా మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ జీవిస్తున్నారు. తాజాగా తేజస్విని ఇంటర్వ్యూలో తన నెక్స్ట్ సీరియల్స్ గురించి, ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకుంది. ఆ వివరాలు చూద్దాం..
తెలుగు లో ఆలా వచ్చాను
తేజస్విని 2022లో అమర్దీప్ ను వివాహం చేసుకుంది. ఆ తరువాత వీరిద్దరూ కలిసి ఎన్నో డాన్స్ షోలకు, రియాల్టీ షోస్ కు కలిసి పాల్గొన్నారు. తేజస్విని అమరదీప్ జంటకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఆమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. తాజాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంది.. తేజస్విని మాట్లాడుతూ.. కన్నడలో త్రీ మంత్స్ ఒక ప్రాజెక్టు చేసేటప్పుడు, ఒకసారి ఆడిషన్ కోసం కోయిలమ్మ టీం పిలిచారు. అక్కడే ఆడిషన్ ఇచ్చాను వారు ఓకే అనుకొని ఆ ప్రాజెక్టులోకి నన్ను తీసుకున్నారు. ఆ సీరియల్ లో చిన్ని పాత్రలో ఎంతోమంది అభిమానులకు దగ్గరయ్యాను.
బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ తో తేజస్విని నెక్స్ట్ సీరియల్..
అమరదీప్ కాకుండా ఏ సీరియల్ హీరో మీకు బెస్ట్ గా అనిపిస్తాడు. అందరూ నా ఫ్రెండ్సే ముఖ్యంగా నిఖిల్ నాకు బ్రదర్ లాంటివాడు. మానస్ నా ఫస్ట్ సీరియల్ హీరో వీరిద్దరూ బెస్ట్ గాని అనిపిస్తారు. నాకు నచ్చిన హీరోస్ కన్నడలో అయితే యష్, తమిళ్లో సూర్య, తెలుగులో అల్లు అర్జున్, ఎన్టీఆర్, నాని, ఇలా ఒక్క ఆర్టిస్ట్ అని నేను చెప్పలేను. మీ పక్కన హీరోగా మానాస్, నిఖిల్ అనుకుంటే ఏ హీరోతో మీరు నటిస్తారు అని అడగ్గా..తేజు సమాధానం గా .. నాకు ఇద్దరితో చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఆల్రెడీ మానస్ తో చేశాను కాబట్టి ఈసారి నిఖిల్ తో సీరియల్ చేస్తాను. అని ఆమె తెలిపింది.
అమర్ తో ఆలా పరిచయం ..
అమర్దీప్ తో నా పరిచయం నేను కోయిలమ్మ సీరియల్ చేసేటప్పుడు అదే టైం కి సిరిసిరిమువ్వలు సీరియల్ స్టార్ట్ అయింది.అమర్ ఫోటోషూట్ కోసం మా సీరియల్ సెట్ కి వచ్చినప్పుడు పరిచయమయ్యాడు.తనది చిన్న పిల్లాడి మనస్తత్వం అందుకే తనంటే నాకు ఎంతో ఇష్టం. ఏది మనసులో ఉంచుకోకుండా ఓపెన్గా బయటికి చెప్తాడు .