BigTV English

Brahmamudi Serial Today January 31st: ‘బ్రహ్మముడి’ సీరియల్: అమెరికా వెళ్లనున్న రాజ్‌, కావ్య –  ఆక్షన్‌లో గెలిచిన రాజ్‌

Brahmamudi Serial Today January 31st: ‘బ్రహ్మముడి’ సీరియల్: అమెరికా వెళ్లనున్న రాజ్‌, కావ్య –  ఆక్షన్‌లో గెలిచిన రాజ్‌

Brahmamudi serial today Episode: ఆఫీసులో కావ్య, రాజ్‌ నేనంటే గొప్ప నేనంటే గొప్ప అని పోటీపడుతుంటారు.ఇంతలో కావ్య స్టాప్‌ను పిలిచి బెదిరించి మీరే గొప్ప అని చెప్పించుకుంటారా..? అంటుంది. లేదు మన కస్టమర్లతోనే చెప్పిస్తాను చూడు అంటూ సూరజ్‌ కు ఫోన్‌ చేసి నేను చెప్పేవరకు మన నెక్లెస్‌ వ్యాల్యూ పెంచుతూనే ఉండు అని చెప్తాడు. సరే అంటాడు. ఆక్షన్‌ మొదలైన తర్వాత రాజ్‌ చెప్పినట్టు సూరజ్‌ చేత నెక్లెస్‌ రేటు పెంచుతూనే ఉంటాడు. మొత్తానికి వేరే వాళ్లు కోటీ ఎనభై లక్షలకు ఆక్షన్‌లో నెక్లెస్‌ తీసుకునేలా చేస్తాడు.


లైవ్‌లో ఆక్షన్‌ చూస్తుంటారు రాజ్‌, కావ్య. ఆ నెక్లెస్‌కు నువ్వు ఊహించిన రేటు ఎంత..? అని కావ్యను అడుగుతాడు రాజ్‌. 25 లక్షలు అని చెప్తుంది కావ్య. మరి వచ్చింది ఎంత అని రాజ్‌ అడగ్గానే.. కోటి ఎనభై లక్షలు అంటూ ఆశ్చర్యపోతుంది కావ్య. దీంతో రాజ్‌..  సో నువ్వు ఎంత కష్టపడి డిజైన్‌ వేశావో ఎంత క్రియేటివ్‌గా డిజైన్‌ వేశావో అన్నది పాయింటా..? దాన్ని ఇంత రేటుకు అమ్మడం పాయింటా..? అంటాడు.  కావ్య, రాజ్‌ను మీరే గ్రేటు అంటూ మెచ్చుకుంటుంది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేనే గ్రేట్‌ అంటాడు రాజ్‌. ఇంకెప్పుడు డిజైనర్‌, సీఈవో ఒక్కటే అనొద్దని రాజ్‌ చెప్పగానే అవునండి అంటుంది కావ్య.

స్వప్న తమ ఇంట్లో రెంట్‌కు ఉన్న వ్యక్తికి ఫోన్‌ చేసి రెంట్‌ ఇంకా పే చేయలేదని అడుగుతుంది. లేదు మేడం ఇప్పుడే రెండు లక్షలు మీకు సెండ్‌ చేశాను. చూసుకోండి అని చెప్తాడు. స్వప్న సరే అంటుంది. దూరం నుంచి అంతా వింటున్న రుద్రాణి, రాహుల్‌ బాధపడతారు. మనం చిల్లర కోసం కష్టపడుతుంటే అది మా నాన్న ఇచ్చిన ఆస్థితో హ్యపీగా ఉంది చూడు అంటుంది రుద్రాణి. అవును మమ్మీ అంటూ రాహల్‌ బాధపడతూ.. మమ్మీ రేపు మన క్రెడిట్‌ కార్డు ఇల్లు కట్టాలి కదా..? అంటాడు. వన్ మినిట్‌ అంటూ కిచెన్‌ లోకి వెళ్లి జ్యూస్‌ రెడీ చేస్తుంది రుద్రాణి.


ఇదేంటి మమ్మీ జ్యూస్‌ తీసుకెళ్తున్నావు అని రాహుల్‌ అడిగితే.. మనకు ఏదైనా కావాలంటే… మనం దానికి ఇది ఇవ్వాల్సిందే అని చెప్తూ జ్యూస్‌ తీసుకుని స్వప్న దగ్గరకు వెళ్తుంది రుద్రాణి. వాళ్లిద్దరినీ స్వప్న తిడుతుంది. దీంతో రాహుల్‌ తెలివిగా స్వప్న ఫోన్‌కు లింక్‌ పంపించి అకౌంట్‌ ను రెండు లక్షలు ట్రాన్స్‌ఫర్‌ చేసుకుంటాడు. దీంతో స్వప్న కంగారుపడుతూ వెళ్లి రాహుల్‌కు చెప్తే.. అడ్డమైన లింకులు క్లిక్‌ చేస్తే ఇలాగే జరుగుతుంది అంటాడు. నేను లింక్‌ క్లిక్‌ చేసిన విషయం వీళ్లకెలా తెలుసు వీళ్లే ఏదో చేశారు అనుకుంటుంది స్వప్న.

సూరజ్‌, రాజ్‌ ఆఫీసుకు వస్తాడు. ఆక్షన్‌ విషయంలో కంగ్రాట్స్‌ చెప్తాడు. రాజ్‌ చెప్పరా ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతాడు. సూరజ్  గుడ్‌ న్యూస్‌ తో వచ్చానురా..? అంటాడు. రాజ్‌ ఆశ్యర్యంగా చూస్తాడు.  అరేయ్‌ గుడ్‌ న్యూస్‌ అంటే హ్యాపీగా చూస్తావనుకుంటే ఆశ్యర్యగా చూస్తావేంట్రా..? అంటాడు సూరజ్‌. దీంతో రాజ్‌ ఆ పదం విని చాలా రోజులైందిరా..? అందుకే అలా అనిపించింది. అంటాడు. మీ డిజైన్స్‌ అమెరికా క్లయింట్స్‌కు బాగా నచ్చాయి. వాళ్లతో మీటింగ్‌ అరైంజ్‌ చేశాను. మీరు అమెరికా వెళ్లి వాళ్లకు మీ డెమో ఇస్తే కాంట్రాక్ట్‌ ఓకే చేసుకోవచ్చు. అని చెప్పగానే.. కావ్య హ్యాపీగా రాజ్‌కు కంగ్రాట్స్‌ అండి ఎప్పుడు వెళ్తున్నారో చెప్పండి లగేజీ మొత్తం సర్దేస్తాను. అని చెప్తుంది. దీంతో సూరజ్‌ వాడొక్కడే కాదండి.. మీరు కూడా వెళ్లాలి.  వీసా త్వరగా వచ్చేలా చేసుకోండి అంటూ వెళ్లిపోతాడు. కావ్య ఆశ్యర్యంతో గంతులేస్తుంది. తీన్మార్‌ డాన్స్‌ చేస్తుంది.

తాము స్వప్న అకౌంట్‌ లోంచి కొట్టేసిన డబ్బులు ఎలా ఖర్చుపెట్టాలో ప్లాన్‌ చేస్తుంటారు రాహుల్‌, రుద్రాణి. చాటు నుంచి అంతా విన్న స్వప్న మీ కథ చెప్తాను అంటూ దగ్గరకు వెళ్లి రుద్రాణిని అత్తయ్యా అని పిలుస్తుంది. దీంతో రాహుల్‌, రుద్రాణి షాక్‌ అవుతారు. ఇంతలో స్వప్న నాకు ఒక హెల్ప్‌ కావాలి అని అడుగుతుంది. దీంతో ఏంటి ఖర్చులకు ఏమైనా డబ్బులు కావాలా..? అని అడుగుతుంది. అవును నాకు 50 వేలు డబ్బులు కావాలి అని అడుగుతుంది స్వప్న. లేవని చెప్తారు రాహుల్‌, రుద్రాణి. అయితే పక్కకు వెళ్లిన స్వప్న మీ దగ్గర ఉన్న ఆ 4 లక్షలు ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు రాహుల్‌ అని మనసులో అనుకుంటుంది స్వప్న. అనుకున్నట్టుగానే.. రాహుల్‌కు ఒక లింక్‌ పంపిస్తుంది. రాహుల్‌ లింక్‌ క్లిక్‌ చేయగానే అకౌంట్‌ ఉన్న డబ్బులు స్వప్న అకౌంట్‌ లోకి ట్రాన్స్‌ ఫర్‌ అవుతాయి. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Stories

×