Lady Aghori: లేడీ అఘోరీ గురించి రోజురోజుకు సంచలన విషయాలు బయటకు వెళ్లడవుతున్నాయి. అసలు అఘోరీ మాటంతా.. అబద్దాల పుట్ట అనేస్తున్నారు ఆమె గ్రామస్థులు. పేర్లు చెప్పేందుకు సాహసించని అతని గ్రామస్థులు.. కొన్ని సంచలన విషయాలు బయటకు చెప్పేశారు. అంతేకాదు ఏకంగా అఘోరీకి సంబంధించిన ఓల్డ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటో ఆధారంగా.. అఘోరీ మాటలు అన్నీ అబద్ధాలే అంటూ ప్రజలు సందేహిస్తున్న పరిస్థితి ఉంది.
తెలంగాణ, ఆంధ్రలో అఘోరీ మాతగా పరిచయమై ఆమె చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. ధర్మ రక్షణ అంటూ పలు చోట్ల వివాదాలకు కేంద్ర బిందువుగా మారి, వార్తల్లో నిలిచారు అఘోరీ. దిగంబరంగా సమాజంలోకి రాగా, పలు చోట్ల పోలీసులు అడ్డుకోవడం, ఆత్మార్పణకు యత్నించడం ఇలా ఒకటి కాదు.. చెప్పుకుంటూ పోతే కర్రలతో దాడులు.. రహదారిపై బైఠాయించి హల్చల్ .. ఇలా ఎన్నో వివాదాలు ఆమె చుట్టూ సాగాయి.
అఘోరీ తెలంగాణలో అడుగుపెట్టిన సమయంలో ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో ఇంటర్వ్యూలు ఇచ్చి వార్తల్లో నిలిచారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం వచ్ఛానంటూ చెప్పిన అఘోరీ మాత, అసలు విషయాన్ని ప్రక్కన పెట్టి ఫేమ్ కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శలు కూడా వినిపించాయి. ఆ క్రమంలో అఘోరీ అసలు చరిత్ర తెలుసుకొనే ప్రయత్నం చేసింది మీడియా. ఆ సమయంలో అఘోరీ తెలంగాణ లోని మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కృష్ణంపల్లికి చెందిన శ్రీనివాస్ గా బయటకు వెల్లడైంది. దీనితో అఘోరీ మాత కూడా తాను బాల్యంలోనే అఘోరీ మాతగా మారినట్లు చెప్పేశారు. ఇప్పుడు ఆ మాటలన్నీ అబద్ధాలని ప్రచారం జోరందుకుంది. దానికి ప్రధాన కారణం అఘోరీ లేటెస్ట్ ఫోటో బయటకు రావడమే.
ఇటీవల వరంగల్ శ్మశానవాటిక లో విచిత్ర పూజలు చేసి అక్కడి వారిని భయభ్రాంతులకు గురిచేసిన అఘోరీ మాతపై తాజాగా కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో అఘోరీ మాత అలియాస్ శ్రీనివాస్ ఇతడేనంటూ గత రెండు సంవత్సరాల క్రితం ఫోటో వైరల్ గా మారింది. శ్రీనివాస్ గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు.. అఘోరీ అలియాస్ శ్రీనివాస్ సుమారు మూడేళ్ల క్రితం వరకు గ్రామంలో ఉండేవారని, చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ మాయమైనట్లు తెలుపుతున్నారు. తాజాగా విడుదలైన ఫోటోను చూస్తే, ఆ ఫోటోలో గడ్డాలు, మీసాలు కలిగి ఉండడంతో గ్రామస్థులు చెప్పిన మాటలు వాస్తవంగా ప్రచారం సాగుతోంది.
ఇన్ని రోజులు ధనార్జన లక్ష్యంగా, ఫేమ్ కోసం అఘోరీ వివాదాలకు కేంద్ర బిందువుగా ప్రవర్తించారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. మరి ఇందులో ఎంతమేరకు వాస్తవం ఉందో కానీ, అఘోరీ ప్రకటనతో అసలు విషయం బయటకు వెళ్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదిఏమైనా అఘోరీ పాత ఫోటో మాత్రం వైరల్ గా మారింది.