Tollywood Actor:ప్రస్తుత కాలంలో చాలామంది సెలబ్రిటీలు పెళ్లీడు వయసు రాగానే కొత్త తోడు వెతుక్కొని జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే వెండితెర, బుల్లితెర నటీనటులు పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్నటికి నిన్న ప్రముఖ కన్నడ సీరియల్ యాక్టర్ మేఘన శంకరప్ప (Meghana shankarappa) తన ప్రియుడిని వివాహం చేసుకుంది. అలాగే ప్రముఖ మలయాళ నటి పార్వతి నాయర్ (Parvati Nair) కూడా చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆశ్రిత్ అశోక్(Ashrith Ashok) తో ఏడడుగులు వేసింది. మరొకవైపు టాలీవుడ్ సెలబ్రిటీలలో కొంతమంది ఎంగేజ్మెంట్ చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టడం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు ప్రముఖ టాలీవుడ్ నటుడు కూడా వివాహానికి సిద్ధమవుతున్నారు. ‘పుష్ప’ సినిమాతో విలన్ గా తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్న ఈ నటుడు ఇప్పుడు తన ప్రేయసిని వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.
ఆయన ఎవరో కాదు డాలీ ధనుంజయ్. ప్రముఖ కన్నడ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన, ఈమధ్య తెలుగు చిత్రాలలో నటిస్తూ బిజీగా మారారు. అందులో భాగంగానే పుష్ప సినిమాలో జాలి రెడ్డి పాత్రలో తన విలనిజంతో ఆకట్టుకున్న ఈయన, ఇటీవల తన ప్రేయసి ధన్యత (Dhanyatha)తో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ జంట పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈయన షేర్ చేసిన ఇంస్టాగ్రామ్ ఇన్విటేషన్ కార్డు అందరినీ ఆకట్టుకుంటుంది. తన వివాహ తేదీ ప్రదేశాన్ని చాలా వినూత్నంగా ఇంస్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు ధనుంజయ్. ముఖ్యంగా తాము చేసే వృత్తులను ఇక్కడ హైలెట్ చేస్తూ చూపించడం జరిగింది. అందులో భాగంగానే ధనంజయ క్లాప్ బోర్డ్ పట్టుకొని కనిపించగా.. అందుకు తగ్గట్టుగా ధన్యత వైద్యురాలిగా స్టెతస్కోప్ పట్టుకొని ఉన్న ఫోటోలు షేర్ చేశారు. మైసూర్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వీరి వివాహం జరగబోతుందని సమాచారం. మైసూర్ లోని తన బాల్యం పూర్తి అయిన నేపథ్యంలో అక్కడే తన పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఇక అందులో భాగంగానే ధనంజయ్ తన ప్రేయసి ధన్యతతో ఏడడుగులు వేయబోతున్నారు.
ఇకపోతే ధనుంజయ్, ధన్యత ఫిబ్రవరి 15,16 తేదీలలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ విషయాన్ని కూడా తన ఇన్స్టా పోస్టు ద్వారా వెల్లడించారు. చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన ధన్యత వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. చాలా కాలంగా వీరి పరిచయం ప్రేమగా మారి, ఇప్పుడు పెద్దలను ఒప్పించి, పెళ్లి వరకు వచ్చింది. మొత్తానికైతే మరో మూడు రోజుల్లో ధనుంజయ్ కూడా ఒక ఇంటివాడు కాబోతున్నారని చెప్పవచ్చు.
ధనుంజయ్ సినిమాలు..
ధనుంజయ్ సినిమా విషయానికి వస్తే.. కాలేనహళ్లి అడవి స్వామి ధనంజయ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. రచయిత, సినిమా నిర్మాతగా కూడా పేరు దక్కించుకున్నారు. 2013లో ‘డైరెక్టర్స్ స్పెషల్’ అనే కన్నడ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టి, 2021 లో పుష్ప సినిమాలో జాలిరెడ్డి పాత్రలో నటించి ఇటు తెలుగు ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యారు. అయితే 2018 లో కన్నడలో వచ్చిన ‘ భైరవ గీత’ అనే సినిమాను తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక ఇప్పుడు మలయాళం సినిమాలో కూడా నటిస్తూ ఆకట్టుకుంటున్నారు.