BigTV English

Gyanavapi Verdict : జ్ఞానవాపిలో పూజలపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

Gyanavapi Verdict : జ్ఞానవాపిలో పూజలపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
gyanvapi mosque case verdict
gyanvapi veditct

Gyanavapi Verdict by Allahabad High Court(Today news paper telugu): జ్ఞాన్‌వాపి మసీదులోని సెల్లార్‌లో హిందూ ప్రార్థనలను అనుమతించాలన్న వారణాసి జిల్లా కోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ (AIMC) ఫిబ్రవరి 1న దాఖలు చేసిన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. జ్ఞానవాపి మసీదులో పూజలు చేసుకోవచ్చని పేర్కొంటూ.. మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది.


న్యాయమూర్తి  జస్టిస్ రోహిత్ రంజన్ అగ్రవాల్ ఈ తీర్పును చదివి వినిపించారు. ‘ ప్రతివాదుల వాదనలు విన్నతర్వాత వారణాసి జిల్లా జడ్డి గతంలో ఇచ్చిన ఆదేశాలను మార్చాల్సిన అవసరం లేదని ధర్మాసనం భావిస్తోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

మసీదు సెల్లార్ లో పూజలకు వారణాసి కోర్టు ఇచ్చిన అనుమతి మేరకు.. కొనసాగించవచ్చని పేర్కొంది. జనవరి 31న.. వారణాసి జిల్లా కోర్టు జ్ఞానవాపి మసీదు యొక్క దక్షిణ సెల్లార్‌లో ఒక పూజారి పూజలు చేయవచ్చని ఆదేశించింది. 1993 డిసెంబరు వరకు తన తాత సోమనాథ్ వ్యాస్ ప్రార్థనలు చేశారని శైలేంద్ర కుమార్ పాఠక్ పిటిషన్‌పై ప్రతిస్పందనగా ఈ తీర్పు వెలువడింది.


Read More : కొనసాగుతున్న రైతుల నిరసన.. 29న భవిష్యత్ కార్యాచరణ ప్రకటన

వారణాసి కోర్టు తీర్పును బీజేపీతో సహా పలు హిందూ సంఘాల నేతలు ఆహ్వానించారు. కావాలంటే.. ఈ విషయంలో వారు సుప్రీంకోర్టుకైనా వెళ్లవచ్చిన పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. వారణాసి జిల్లా కోర్టు తీర్పుపై చేసిన అప్పీల్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించిన తర్వాత.. ఫిబ్రవరి 2న మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. ఫిబ్రవరి 15న ఇరు పక్షాలను విచారించిన తర్వాత అలహాబాద్ హైకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసి.. నేడు మసీదు సెల్లార్ లో పూజలకు అనుమతిస్తూ తీర్పు వెలువరించింది.

అంతకుముందు.. ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ, జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లోని ‘వ్యాస్ కా ఠేఖానా’ భాగంలో హిందూ భక్తులను ప్రార్థన చేయడానికి అనుమతించాలని వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పు.. ప్రార్థనా స్థలాలను ఉల్లంఘించేలా ఉందని అన్నారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×