Tollywood.. వెండితెర మెగాస్టార్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు చిరంజీవి (Chiranjeevi ), అయితే బుల్లితెర మెగాస్టార్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు ప్రభాకర్(Prabhakar). ఎన్నో సీరియల్స్ లో నటించి, నిర్మించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇప్పటికీ కూడా తనదైన నటనతో ఆడియన్స్ ను అలరిస్తున్న ఈయన పలు సినిమాలలో కూడా నటించారు. ఇదిలా ఉండగా అందరిలాగే ఈయన కూడా తన వారసుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు. ఆయన ఎవరో కాదు ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్(Chandrahass). సోషల్ మీడియాలో ఆటిట్యూడ్ స్టార్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న చంద్రహాస్ ఇప్పుడు హీరోగా అడుగు పెడుతున్నారు.
హీరోగా మారిన యాటిట్యూడ్ స్టార్..
రామ్ నగర్ బన్నీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు చంద్రహాస్. ఈ సినిమాను చంద్రహాస్ తల్లిదండ్రులైన.. మలయజ , ప్రభాకర్ లు ఇద్దరు కలిసి నిర్మిస్తున్నారు.శ్రీనివాస్ మహత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా .. ఈ సినిమా నుంచి ఇటీవలే ట్రైలర్ విడుదల చేసారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల అవ్వగా.. ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అక్టోబర్ 4వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ ఈవెంట్ లో చంద్రహాస్ తన సినిమా గురించి చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు. అంతేకాదు సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు చంద్రహాస్.
ఆడియన్స్ కి బంపర్ ఆఫర్ ప్రకటించిన చంద్రహాస్..
అంతేకాదు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆడియన్స్ కి బంపర్ ఆఫర్ ప్రకటించారని చెప్పవచ్చు. ఒకవేళ తాను నటించిన రామ్ నగర్ బన్నీ సినిమా ఎవరికైనా నచ్చకుంటే, తనకు ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ చేయాలని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా సినిమా నచ్చకపోతే.. బుక్ చేసుకున్న టికెట్స్, థియేటర్స్ లో దిగిన ఫోటో , అలాగే సినిమాకు వెళ్ళినట్టు ప్రూఫ్స్ తో సహా అన్నింటినీ తనకు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయాలని తెలిపారు. తన సినిమా వల్ల ఎవరికైనా టైం వేస్ట్ అయిందని చెబితే కచ్చితంగా డబ్బులు మొత్తం రిటర్న్ చేస్తానని కూడా తెలిపారు. టికెట్ కి అయిన ఖర్చును గూగుల్ పే చేస్తానంటూ కూడా చంద్రహాస్ చెప్పుకు రావడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
చంద్రహాస్ కి మాత్రమే సాధ్యం..
ఇకపోతే ఇప్పటివరకు ఇలాంటి ప్రకటన ఏ ఒక్క హీరో కూడా చేయలేదు అనడంలో సందేహం లేదు. మొత్తానికైతే తన సినిమాపై తన కాన్ఫిడెంట్ ని చూసి అభిమానులు సైతం ముచ్చట పడుతున్నారు. సినిమా నచ్చకపోతే ఆ ఖర్చును తిరిగి రిటర్న్ పంపిస్తానని చెబుతున్న చంద్రహాస్ ఈ సినిమాతో ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తారో చూడాలి.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">