NZ vs BAN: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో ( Champions Trophy 2025 Tournament ) భాగంగా ఇవాళ మరో రసవత్తర పోరు జరుగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల ( Bangladesh vs New Zealand ) మధ్య బిగ్ ఫైట్ ఉంది. పాకిస్థాన్ ( Pakistan ) రావల్‌పిండిలోని ( Rawalpindi) అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోనే న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరుగనుంది. అయితే.. న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో… టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. ఈ తరుణంలోనే… టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో.. ఇవాళ్టి మ్యాచ్ లో బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేయనుంది. పాకిస్థాన్ ( Pakistan ) రావల్‌పిండిలోని ( Rawalpindi) అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మొదట బౌలింగ్ చేసిన టీం గెలిచే ఛాన్సులు ఎక్కువగా ఉండటంతో… కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read: Hardik Pandya Watch: పాక్ మ్యాచ్ లో ఖరీదైన వాచ్ తో పాండ్యా..ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ?
మ్యాచ్ టైమింగ్స్, ఉచితంగా చూడాలంటే ?
న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న మ్యాచ్ భారత కాలమానం ప్రకారం… మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ను జియో హాట్ స్టార్ లో చూడొచ్చు. ఇందులో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ మ్యాచ్ లన్నీ… ఉచితంగానే ఇస్తున్నారు. జియో హాట్ స్టార్ లోనే కాకుండా… స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18 ఛానెల్స్ లో కూడా చూడొచ్చు.
ఇరు జట్ల రికార్డులు
ఇక ఇప్పటి వరకు.. బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్ ( Bangladesh vs New Zealand ) మధ్య 45 వన్డే మ్యాచ్లు జరిగాయి. న్యూజిలాండ్ జట్టు… ఈ 45 వన్డే మ్యాచ్లో పై చేయి సాధించింది. 45 మ్యాచ్లు జరగక 33 మ్యాచ్లలో న్యూజిలాండ్ గెలవడం గమనార్హం. అటు బంగ్లాదేశ్ కేవలం 11 మ్యాచ్ లో గెలిచింది. అంటే న్యూజిలాండ్ టీంకు గట్టి పోటీ ఇవ్వలేకపోయింది బంగ్లాదేశ్. అలాగే ఈ రెండు జట్ల మధ్య ఒకే ఒక్క మ్యాచ్ లో ఫలితం రాలేదు. అంతేకాదు… ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటి వరకు బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య 4 మ్యాచ్ లు పూర్తి అయ్యాయి. ఇందులో న్యూజిలాండ్ రెండు మ్యాచ్ లలో గెలువగా…. బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్ లలో గెలిచింది.
Also Read: Chiranjeevi in Ind vs Pak match: దుబాయ్ మ్యాచ్ కు చిరు, టీడీపీ నేతలు…అభిషేక్ శర్మతోనే సిట్టింగ్ !
ఇరు జట్ల ప్లేయర్లు
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్(w), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(c), మాట్ హెన్రీ, కైల్ జామీసన్, విలియం ఒరోర్కే
బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): తాంజిద్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(C), మెహిదీ హసన్ మిరాజ్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(w), మహ్మదుల్లా, జాకర్ అలీ, రిషద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, నహిద్ రానా, ముస్తాఫిజుర్ రహ్మాన్