Varun Dhawan: సినీ పరిశ్రమలో హీరోయిన్లు మాత్రమే కాదు.. హీరోలు కూడా వేధింపులు ఎదుర్కుంటారు. ఏదైనా ఈవెంట్‌కు వెళ్లినప్పుడు పలువురు ఫ్యాన్స్ హీరోలు కూడా ఇబ్బందిపడేలా చేస్తారు. ముఖ్యంగా కొందరు హీరోలు ఫ్యాన్స్‌తో అంత ఫ్రీగా ఉండలేరు. అయినా అది అర్థం చేసుకోకుండా అభిమానులు ఇబ్బందిపెడుతుంటారు. తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ కూడా అలాంటి ఇబ్బందులను ఎదుర్కున్నానని బయటపెట్టాడు. అంతే కాకుండా ఒక పెళ్లయిన మహిళ తన వెంటపడిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆమె ఎవరి భార్య అనేది మాత్రం చెప్పనని, కానీ చాలా పవర్‌ఫుల్ వ్యక్తి భార్య అని అన్నాడు. దీంతో ఆమె ఎవరు అనే విషయంపై ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలయ్యింది.
పవర్‌ఫుల్ వ్యక్తి భార్య
ప్రస్తుతం తన అప్‌కమింగ్ మూవీ ‘బేబి జాన్’ (Baby John) ప్రమోషన్స్‌లో విపరీతంగా బిజీగా ఉన్నాడు వరుణ్ ధావన్ (Varun Dhawan). దేశంతో పాటు ప్రపంచాన్ని చుట్టేస్తూ ఈ మూవీని ప్రమోట్ చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు వరుణ్ ధావన్. అందులో ఫ్యాన్స్ వల్ల తనకు ఎదురైన ఇబ్బందుల గురించి బయటపెట్టాడు. ‘‘ఒక పెళ్లయిన మహిళ నా పర్మిషన్ లేకుండా మా ఇంటికొచ్చింది. ఆమె ఒక పవర్‌ఫుల్ వ్యక్తికి భార్య. ఆయన పొజిషన్ ఏంటని నేను చెప్పను కానీ చాలా పవర్‌ఫుల్ వ్యక్తి. తను నా వెంటపడి ఇబ్బందిపెట్టింది. తనకు నా గురించి అంతా తెలుసు’’ అని చెప్పుకొచ్చాడు వరుణ్ ధావన్.
Also Read: గేమ్ చేంజర్ స్టోరీ చెప్పేసిన శంకర్
పోలీసులకు ఫిర్యాదు
‘‘నా ఇంటి గురించి, నా కుటుంబం గురించి ఆ మహిళకు అంతా తెలుసు. నేను తనకోసం నా కుటుంబాన్ని వదిలేస్తానని అనుకుంది. కొన్నాళ్ల తర్వాత ఈ విషయంలో నేను చాలా భయపడ్డాను. కొన్నాళ్లకు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాను. అప్పుడు కూడా ఆమె ఒక వ్యక్తిని తీసుకొని మా ఇంటికొచ్చింది. అప్పుడే ఫీమేల్ కానిస్టేబుల్స్ వచ్చి ఆమెను తీసుకెళ్లారు’’ అని వివరించాడు వరుణ్ ధావన్. కానీ ఆ పెళ్లయిన మహిళ ఎవరు, తన భర్త ఎవరు లాంటి విషయాలను మాత్రం బయటపెట్టలేదు. తనను చూడడానికి కొందరు ఫ్యాన్స్ ఇంట్లో చెప్పకుండా వచ్చేవారని, అప్పుడు కూడా వారు పోలీసులను పిలవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపాడు.
అనుమతి లేకుండా ముద్దు
ఒకానొక సందర్భంలో ఒక ఫ్యాన్ తనకు ఇష్టం లేకుండా ముద్దుపెట్టిందని కూడా బయటపెట్టాడు వరుణ్ ధావన్. అలా చేయడం తనకు నచ్చలేదని అన్నాడు. ఇంకొందరు అయితే ఏకంగా తనను గిల్లేవారని కూడా తెలిపాడు. తను అలాంటి ఇబ్బందులు ఎదుర్కున్న ప్రతీసారి అసలు అబ్బాయిలు ఇలాంటివి ఎలా భరిస్తున్నారా అని ఆలోచించేవాడట. వారికి ఇలా జరగడం తలుచుకొని చాలా బాధపడేవాడట. వరుణ్ ధావన్ మాత్రమే కాదు.. ఫ్యాన్స్ వల్ల తాము ఎదుర్కునే ఇబ్బందులను ఇంతకు ముందు కూడా పలువురు హీరోలు షేర్ చేసుకున్నారు. ఇక ‘బేబి జాన్’ విషయానికొస్తే ఈ మూవీ డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యింది.