ICC Men’s Champions Trophy 2025 Schedule: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటుకు సంబంధించిన కీలక అప్డేట్ ఐసీసీ ఇచ్చింది. ఈ టోర్నమెంట్ కు సంబంధించిన షెడ్యూల్ను తాజాగా విడుదల చేసింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. గ్రూప్ ఏ అలాగే గ్రూప్ బి గా జట్లను డివైడ్ చేసింది. ఇక ఈ నేపథ్యంలోనే గ్రూప్ ఏ… లో టీమిండియా, పాకిస్తాన్ జట్లు స్థానం సంపాదించుకున్నాయి. ఈ రెండు జట్లతో… బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి.
Also Read: Vinod Kambli: ఆస్పత్రి బెడ్ పై ఎమర్జెన్సీ వైద్యం.. పాట పాడిన టీమిండియా ప్లేయర్?
అటు గ్రూప్ బి లో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ అలాగే దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి. ఈ టోర్నమెంట్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్న నేపథ్యంలో రెండు గ్రూపులుగా విడదీశారు. ఫిబ్రవరి 19 వ తేదీ నుంచి ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంటు ప్రారంభమవుతుంది. మార్చి 9వ… ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటు ఫైనల్ మ్యాచ్ ఉండనుంది. ఈ టోర్నమెంట్లో మొదటి మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య ఫిబ్రవరి 19వ తేదీన జరగనుంది.
ఈ టోర్నమెంట్ హైబ్రిడ్ మోడల్ లో జరుగుతున్న నేపథ్యంలో టీమిండియా ఆడే మ్యాచ్ లన్ని దుబాయిలో నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 23వ తేదీన దుబాయ్ వేదికగా పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య కీలక పోరు ఉండనుంది. దీంతో ఈ మ్యాచ్ కోసం అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
Also Read: Ben Stokes Injury: ఇంగ్లాండ్ జట్టుకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ జట్టు నుంచి ఔట్
19 ఫిబ్రవరి – పాకిస్థాన్ v న్యూజిలాండ్, నేషనల్ స్టేడియం, కరాచీ
20 ఫిబ్రవరి – బంగ్లాదేశ్ v ఇండియా, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్
21 ఫిబ్రవరి – ఆఫ్ఘనిస్తాన్ v సౌతాఫ్రికా, నేషనల్ స్టేడియం, కరాచీ లో ఉంటుంది.
22 ఫిబ్రవరి – ఆస్ట్రేలియా v ఇంగ్లాండ్, గడాఫీ స్టేడియం, లాహోర్
23 ఫిబ్రవరి – పాకిస్తాన్ v ఇండియా, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్
24 ఫిబ్రవరి – బంగ్లాదేశ్ v న్యూజిలాండ్, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి
25 ఫిబ్రవరి – ఆస్ట్రేలియా v సౌతాఫ్రికా, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి
26 ఫిబ్రవరి – ఆఫ్ఘనిస్తాన్ v ఇంగ్లాండ్, గడాఫీ స్టేడియం, లాహోర్
27 ఫిబ్రవరి – పాకిస్థాన్ v బంగ్లాదేశ్, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి
28 ఫిబ్రవరి – ఆఫ్ఘనిస్తాన్ v ఆస్ట్రేలియా, గడాఫీ స్టేడియం, లాహోర్
1 మార్చి – దక్షిణాఫ్రికా v ఇంగ్లాండ్, నేషనల్ స్టేడియం, కరాచీ
2 మార్చి – న్యూజిలాండ్ v భారత్, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్
4 మార్చి – సెమీ-ఫైనల్ 1, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్*
5 మార్చి – సెమీ-ఫైనల్ 2, గడాఫీ స్టేడియం, లాహోర్**
9 మార్చి – ఫైనల్ – గడ్డాఫీ స్టేడియం, లాహోర్***
Note :
* సెమీ-ఫైనల్ 1, సెమీ-ఫైనల్ 2 టీం ఇండియా అర్హత సాధిస్తే.. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది.
*** భారత్ ఫైనల్‌కు అర్హత సాధిస్తే…ఆ మ్యాచ్ కూడా దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది.