Ind vs Pak U19 Asia Cup: పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఘోర ఓటమిపాలైంది. అండర్ 19 ఆసియా కప్ వన్డే టోర్నమెంట్ లో టీమిండియా కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఆసియా కప్ వన్డే టోర్నీలో.. తొలి ఓటమి చవిచూసింది టీమిండియా. అదికూడా దాయాది దేశమైన పాకిస్తాన్ చేతిలో… అత్యంత దారుణంగా ఓడిపోయింది టీమిండియా జట్టు.
Also Read: Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీ విషయంలో ICC కీలక నిర్ణయం.. అక్కడే మ్యాచులు !
పాకిస్తాన్ చేతిలో ఏకంగా 44 పరుగులు తేడాతో ఓడిపోయింది టీమిండియా జట్టు. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 281 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని చేదించే క్రమంలో… టీమిండియా దారుణంగా ఓడిపోయింది. 47.1 ఓవర్లలో కేవలం 237 పరుగులు మాత్రమే చేసింది టీమిండియా. దీంతో 44 పరుగులు తేడాతో ఓటమిపాలైంది.
Also Read: Mohammed Shami: SRHకు బిగ్ షాక్..మరోసారి గాయపడ్డ టీమిండియా బౌలర్ ?
అండర్ 19 ఆసియా కప్ 2024 టోర్నమెంటులో భాగంగా… ఇవాళ దుబాయ్ వేదికగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య… ఉదయం 10:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో… 7 వికెట్లు నష్టపోయి 281 పరుగులు చేసింది. పాకిస్తాన్ బ్యాటర్లలో సహజబ్ ఖాన్ ఒక్కడే 159 పరుగులు చేశాడు. 147 బంతులు ఆడిన సహజబ్… ఐదు ఫోర్లు, పది సిక్సర్లతో 159 పరుగులు చేశాడు.
108 స్ట్రైక్ రేట్ తో దుమ్ము లేపాడు.ఇక అటు పాకిస్తాన్ మరో ప్లేయర్ ఉస్మాన్ ఖాన్ 60 పరుగులు చేసి రాణించాడు. టీమిండియా బౌలర్లలో సామ్రారత్ నాగరాజు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పది ఓవర్లు వేసిన నాగరాజు.. 45 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. అటు ఆయుష్.. ఏడు ఓవర్లు వేసి 30 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు.
ఇక అటు చేజింగ్కు దిగిన టీమిండియా… 238 పరుగులకు ఆల్ అవుట్.. కావడం జరిగింది. టీమిండియా బ్యాటర్లలో నిఖిల్ కుమార్ 67 అలాగే మహమ్మద్ 30 పరుగులు చేసి రాణించారు. మిగతా బ్యాటర్లు ఎవరు కూడా రాణించకపోవడంతో టీమిండియా 44 పరుగులు తీయడంతో ఓడిపోయింది.
ఇక అటు 13 ఏళ్ల ఐపీఎల్ యువ కెరటం వైభవ్ సూర్యవంశం కూడా ఇవాల్టి మ్యాచ్లో పెద్దగా రాణించలేదు. ఒక పరుగు చేయడానికి 9 బంతులు ఆడాడు. అయినా పెద్దగా రాణించలేదు. అలీ రజ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సిద్ధార్థ , కెప్టెన్ అమన్ కూడా పెద్దగా రాణించలేదు. టీమిండియా టాపార్డర్ అలాగే మిడిల్ ఆర్డర్… రెండు కూడా… దారుణంగా విఫలమయ్యాయి. పాకిస్తాన్ బౌలర్ల దాటికి ఏ ఒక్క ప్లేయర్ గ్రీస్లో నిలబడలేకపోయారు. దీంతో పాకిస్తాన్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.
ఇది ఇలా ఉండగా ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన కీలక అప్డేట్ ఇవ్వాళ తెరపైకి వచ్చింది. హైబ్రిడ్ మోడల్ కు పాకిస్తాన్ జట్టు ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఇండియాకు సంబంధించిన మ్యాచ్లన్నీ… దుబాయ్ వేదికగా జరగబోతున్నాయి. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతుంది.