Viswambhara: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి విశ్వంభర. బింబిసార సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిన వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో చిరు సరసన త్రిష నటిస్తోంది. నిజం చెప్పాలంటే త్రిషను తీసుకోవడానికి కారణం కూడా చిరు ట్రోల్ అవ్వకుండా ఉండడానికే అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సీనియర్ హీరోలకు కూతురు, మనవరాలు వయస్సు ఉన్న హీరోయిన్స్ తో రొమాన్స్ అంటే మరీ దారుణం అని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ధమాకా సమయంలో రవితేజతో శ్రీలీల రొమాన్స్ చేస్తేనే పెద్ద గొడవ చేశారు.. ఆయన వయస్సు ఎక్కడ.. శ్రీలీల వయస్సు ఎక్కడ అని.
ఇక రవితేజ కన్నా వయస్సులో పెద్దవాడైన చిరు పక్కన చిన్న హీరోయిన్స్ ను పెడితే మరింత ట్రోల్ చేస్తారని చెప్పి త్రిషను తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికీ వీరిద్దరూ కలిసి స్టాలిన్ సినిమాలో కనిపించడంతో.. నెటిజన్స్ కన్విన్స్ అయ్యారు. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఇంకా అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన సినిమా.. ఇప్పటివరకు రిలీజ్ అయ్యింది లేదు. మిగతా పెద్ద సినిమాలు అన్ని తమ డేట్ ను లాక్ చేసుకుంటున్నా కూడా విశ్వంభర మాత్రం అసలు రిలీజ్ డేట్ గురించి ఆలోచనే లేకుండా ఉంది అనే మాటలు వినిపిస్తున్నాయి. సీజీ వర్క్ ఇంకా పూర్తికాలేదని, దాని వలనే సినిమా ఆలస్యం అవుతూ వస్తుందని టాక్ నడుస్తోంది.
Samantha: 40కి చేరువలో కూడా.. ఇంత యవ్వనానికి కారణం అదే అంటున్న సమంత!
ఇక అందుతున్న సమాచారం ప్రకారం విశ్వంభర షూట్ మొత్తం ఫినిష్ అయ్యిందని, కేవలం ఒక్క ఐటెంసాంగ్ బ్యాలెన్స్ ఉందని తెలుస్తోంది. ఇక ఇప్పుడు కూడా చిరుకు హీరోయిన్స్ కొరత ఏర్పడింది. చిరు సినిమా అంటే కచ్చితంగా ఫ్యాన్స్ కోసమైనా ఒక ఐటెంసాంగ్ ఉండాల్సిందే. అది ఎంతలా అంటే గాడ్ ఫాదర్ సినిమాలో అవసరం లేకపోయినా కూడా ఐటెంసాంగ్ పెట్టినట్టు.. అది కేవలం ఫ్యాన్స్ ఆనందం కోసమే అని చెప్పుకొస్తారు. ఇక విశ్వంభరలో కూడా ఒక ఐటెంసాంగ్ ఉందట. కానీ, ఆ సాంగ్ లో స్టెప్స్ వేసే హీరోయిన్ దొరకడం లేదని టాక్.
ఇదెక్కడి విడ్డూరం అమ్మా.. చిరుకు హీరోయిన్ దొరకపోవడం ఏంటి..? ఎంతమంది హీరోయిన్లు తమ కెరీర్ లో చిరు సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించినా చాలు జన్మ ధన్యం అవుతుంది అని ఆశతో ఎదురుచూస్తున్నారు. అలాంటింది చిరుతో డ్యాన్స్ వేయడానికి హీరోయిన్ దొరకకపోవడం ఏంటి.. ? అని అంటే ఇక్కడ కూడా వయస్సు తేడా చూడాలి కదా. చిరు వయస్సుకు తగ్గట్టే హీరోయిన్ ఉండాలి. పుష్ప 2 లో చేసిందని శ్రీలీలను, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో చేసిందని ఆయేషా ఖాన్ ని, రాబిన్ హుడ్ లో చేసిందని కేతిక శర్మను తీసుకొని చిరు పక్కన డ్యాన్స్ వేయిస్త నెక్స్ట్ మినీట్ సోషల్ మీడియాలో చిరుపై విమర్శలు గుప్పిస్తారు. ఆ పిల్ల వయస్సు ఏంటి.. ఆమెతో ఈయన స్టెప్స్ ఏంటి అని.. అందుకే మేకర్స్ బాగా ఆలోచించి సీనియర్ బ్యూటీ కోసం వెతుకుతున్నారట. తమన్నా అయితే.. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా ఐటెంసాంగ్ అనగానే ఆమె గుర్తొస్తుంది. రొటీన్ గా ఉంటుందని ఆగారట. ఇక పాయల్ రాజ్ పుత్, పూజా హెగ్డే, సమంత.. ఇలా చాలానే ఆప్షన్స్ ఉన్నా చివరకు చిరు పక్కన చేసే బ్యూటీ ఎవరై ఉంటారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.