Vishwak Sen : యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) కు ఇప్పుడు నవ్వాలో, ఏడవలో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా రిలీజ్ అయిన ఆయన మూవీ ‘లైలా’ (Laila) ఫస్ట్ షోతోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంటుంటే, మరోవైపు విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘గామి’ (Gaami) మూవీ ఇంటర్నేషనల్ వైడ్ గా సందడి చేస్తోంది. మరి ఈ మూవీ విశేషాలు ఏంటి? విశ్వక్ సేన్ పరిస్థితి ఏంటి? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
విశ్వక్ సేన్ ‘లైలా’ మూవీకి డిజాస్టర్ టాక్…
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా రామ్ నారాయన్ దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘లైలా’. ఈ మూవీలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో కనిపించాడు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి ఈ మూవీని నిర్మించారు. పలు వివాదాలు అనంతరం ఫిబ్రవరి 14న ‘లైలా’ మూవీ థియేటర్లలోకి వచ్చింది. అయితే మొదటి షోతోనే ఈ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. మూవీ డిజాస్టర్ కావడానికి కారణం కథ, కథనం అనే టాక్ నడుస్తోంది. మరోవైపు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ చేసిన 11 మేకల కామెంట్స్ వల్ల వచ్చిన నెగిటివిటీనే ఈ మూవీని డిజాస్టర్ అయ్యేలా చేసిందని అంటున్నారు. ఏదేమైనా నష్టమైతే విశ్వక్ సేన్ మూవీకే జరిగింది.
ఇంటర్నేషనల్ వైడ్ గా ‘గామి’ సందడి
ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘లైలా’ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో విశ్వక్ సేన్ ఓవైపు నిరాశలో ఉంటే, మరోవైపు గత ఏడాది ఆయన నటించిన ‘గామి’ మూవీ గ్లోబల్ వైడ్ గా సందడి చేస్తోంది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ రోటర్ డామ్ ఫిల్మ్ ఫెస్టివల్ (International Film Festival Rotterdam-2025) జరుగుతున్న సంగతి తెలిసిందే. దానికి ‘గామి’ మూవీ సెలెక్ట్ అయ్యిందన్న విషయాన్ని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే తాజాగా డైరెక్టర్ విద్యాధర కాగిత, ప్రొడ్యూసర్ కార్తీక్ శబరీష్ ఇద్దరూ ‘గామి’ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ సందర్భంగా ప్రత్యేకంగా ఫోటోలకు ఫోజులిచ్చారు.
ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన యూవీ క్రియేషన్స్ ఈ మూవీ జర్నీలో భాగం కావడం గర్వంగా ఉందంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇక ‘గామీ’ మూవీలో విశ్వక్ సేన్ హీరోగా నటించగా, చాందిని చౌదరి హీరోయిన్ గా కనిపించింది. విద్యాధర కాగిత దర్శకత్వం వహించిన ఈ మూవీని దాదాపు నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత థియేటర్లలోకి తీసుకొచ్చారు. మైథలాజికల్ సైంటిఫిక్ మూవీగా రూపొందిన ఈ సినిమాకు కార్తీక్ నిర్మాతగా వ్యవహరించారు. గత ఏడాది మార్చి 8 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
విభిన్నమైన కథనంతో రూపొందిన ‘గామి’ సినిమాకు ఇలా ఇంటర్నేషనల్ ఫీలింగ్ ఫెస్టివల్ లో స్పెషల్ స్క్రీనింగ్ కోసం చోటు దక్కడం అంటే నిజంగా గర్వకారణమే. కానీ ఓవైపు ‘లైలా’ డిజాస్టర్, మరోవైపు ‘గామి’ సక్సెస్… ఇలా నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు విశ్వక్ సేన్ పాపం.
A Global Milestone for #Gaami! 🌏
Director @nanivid & Producer @KarthikSabarish are at International Film Festival Rotterdam as #Gaami gets its special screening 🎥✨
Honored to be part of this incredible cinematic journey! 🙌#GaamiAtIFFR #IFFR2025@VishwakSenActor… pic.twitter.com/JY3HwSYmOe
— UV Creations (@UV_Creations) February 15, 2025